పుట:Saptamaidvardu-Charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

153


రుష్యాదేశ చక్రవర్తి జయాస హితుండై కౌసులో నుండు నెడ్వర్డు కడకు విచ్చేసెను, ఎడ్వర్డాయనను మిక్కిలి గౌరవిం చెను. కాని పార్ల మెంటు సభ్యులలోఁ గొందఱు మన యెడ్వర్డు రుష్యా చక్రవర్తిని గౌరవించుట నానావిధంబుల 'నా క్షేపించిరి. అతఁడు వారిమాటల నాలకించిన వాడు కాడు. ఇందువలన నింతకు ముందు రుష్యాలో నడిచిన వివాదాన్ని మొదలంట నారిపోయెను,

ఎడ్వర్డు ఆగస్టు నెలలో నాస్ట్రియాకు వెళ్లి బొహిమియా నగరమునకు సమీపంబున నుండు “మెరైన్ బాడు” అనుపల్లెకు వెళ్లెను. ఆ గ్రామ మనారోగ్యదశ చేఁ బీడింపఁ బడు వారికి సంజీవి వంటిది. ఆతఁ డాచోటఁ గొన్నాళ్లుండి డానిని గొప్ప పట్టణ ముగఁ జేసెను. ఆస్ట్రియా దేశ వైద్యుఁ డైన డాక్టర్ ఆట్టను వాడు ఏడ్వర్ణునకు దివ్యౌషధముల నిచ్చు చుండెను. ఎడ్వర్గా వైద్యుని మందులవలన మంచి యారోగ్యదశకు వచ్చిన పిమ్మట నింగ్లండునకుఁ జను దెంచెను. నవంబరు నెలలో పోర్చుగలు'రా కొమాడు డింగ్లండు నకు నృతెంచెను. అతని తల్లి దండ్రులు క్రూరులచే నక్రమముగ న కాలమరణము సెందియుండిరి. ఆరాచ పసివాఁడు ఎడ్వర్డుకూఁతు స్వరియింప నే తెంచె నసి ఒక మాట పుట్టి యుండెను, కాని ఆమాట ఎంత మాత్రము సత్యము కాదు. ఎడ్వర్డా పసివానిని గౌరవించెను.