పుట:Saptamaidvardu-Charitramu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

సప్త మైడ్వర్డు చరిత్రము.


నిరాణియును, ఇంగ్లండును జూడ నేతెంచిరి. వారి వెంట నార్వే దేశాధీశ్వరుఁడు పల్నీ సహితుడై" ఇంగ్లండునకు విచ్చేసి తమరాజ్యమునకు ముఱలెను.

1909 సం. న ఇంగ్లండు పృథ్వీరమణండు పరిజన పరి వృతుండై సమస్తరాజచిహ్నముల , జర్మని దేశమునకు నేఁ గెను. ఈతని రాకవలన సంతకు ముందున్న రాజు పగ అనునగ్గి చల్లారెను. జర్మని ప్రభువు ఇంగ్లండు నేలికకు సకల మర్యాదలు సల్పెను. బెర్లిను పురవాసులు ఎడ్వర్డు రాజమార్గంబున నూ రేఁగునపు డాతని పైఁ బూలవానలు కురియించి, అనేకు లనేక భంగులఁ దమకు నింగ్లండు నెడ కల ప్రీతి విశ్వాసములను దెల్పిరి.

ఎడ్వర్డు జర్మని వదలి ఇంటికి నే తెంచిన పిదప నప్పు డప్పుడు రోగ పీడితుఁ డగుచుండు వాఁడు. అతడు ఫ్రాన్సులో నుందు బియాకిట్టునకు నారోగ్య ప్రాప్తి కై వెళ్లు చుడును, ఆతఁ డీయేఁట నాపురికి వెళ్లెను. బియారిటునకుఁ జేరువ నుండు "పా " అనునూరిలో విల్బరు రైటను పండితుడు భూమ్యంత రిక్షముల నడుమ నడుచు నాకాశ యానమును నిర్మించి పరిషరి విధముల దాని నడుపు చుండెను. ఎడ్వర్డా చోటికి వెళ్లి ఆపం డితుఁ డాయా కొత్త విమానంబునఁ గూర్చుండి బుర్రున 'నేలనుండి పైకి నెగురు నపుడు గని విస్మాయానంద చేతస్కుండై . ఆవిద్వాం సునివలన నావిమానము నిర్మించు రహస్యంబులను గ్రహించి తనవీటికిఁ బు తెంచెను.