పుట:Saptamaidvardu-Charitramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

సప్త మైడ్వర్డు చరిత్రము.


సంతోషించి, తమ మనుముని నెత్తి ముద్దాడి చిరుతకు చిత్ర విచిత్రము లైన వస్తువుల మెసంగిరి.

ఎడ్వర్డు పెద్దకుమారుఁ డై జార్జి యువ రాజును, ఆతని యేలిక సానియును, హిందూ దేశ ముసకు వెళ్లి, క్రమ్మఱ దమ పురికి విచ్చేసిరి. ఎడ్వర్డు వారలకు సగౌరవంబున స్వాగత మిచ్చెను.

న్యూ కాజు లను పురంబున పైనను నది పై వంతెన కట్ట బడెను. ఎడ్వర్డు దానిని దెఱి చెను. అది నాతని పేర ప్రసిద్ది గాంచెను. అతడు ఆబర్డీ నను సర్వక ళాశాలలో మారీష్ కల్ కాలేజీని తెఱచెను.

1907 సం. న ఎడ్వర్డు తన భార్యామణి వెంటరా మధ్య ధరాసముద్ర యానము సేయ నారంభించెను. త్రోవలో నుండు స్పైను దేశాధీశ్వరుఁడు ఎడ్వర్డు నెదుక్కొని మిక్కిలి గౌర వించెను. ఎడ్వర్ణావల నిటలీ ఱేనిని దర్శించి, ఆయనతోఁ జాల "కాలము సంభాషించి, జర్మని రాజ్యమునకు నేఁగి, ఆచక్రవ ర్తితో గొంతకాలము ప్రొద్దుపుచ్చి తన టెంకికిఁ జను దెంచెను. ఈ సమయమున డెన్మార్కు నొడయఁడును, ఆయ: దొరసాని యును, ఇంగ్లండునకు వచ్చి ఎడ్వర్డునింట నతిదులై ఉండి, తమ రాజ్యమునకు వెళ్లిరి.

ట్రాన్సు హాలు దక్షిణాఫ్రికాలో నొక రాజ్యము. ఆయది. కెంపులు రవలు కల గనులకుఁ 'బేరు వడసి యుండును. అందలి