పుట:Saptamaidvardu-Charitramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

నప్త మైడ్వర్డు చరిత్రము.

1899 సం. స. జర్మని దేశము యొక్క రాజును, రాణీయును, లండను పురికి నేతెంచి. ప్రజలు వారి రాకను గురించి పరి పరి విధంబుల డెందంబులలోఁ దలపోసికొనిరి. అప్పుడాఫ్రి కాలో బోయరులకును, ఆంగ్లేయులకును గొప్ప యుద్ధము నడు చు ఉండెను. అందుఁ దొలుదొల్త నాగ్లేయులు పరాభవ మొందు చుండిరి. జర్మనిచక్రవర్తి ఆయుద్ధ విషయమై ఇంగ్లండు ప్రభుత్వము వారితో మాటలాడి పోవుటకు వచ్చె నని కొందఱు తలంచిరి. కాని అతఁ డా సంగతీలోఁ దా నెంతమాత్రమును ప్రవేశింపక తన యవ్వ విక్టోరియా మహారాణిని గాంచి తనరా జ్యమునకు వెళ్లెను.

ఆసోమదేయుఁ డొకఁడు ఎడ్వర్డును దుపాకితోఁ గాల్ప నుద్యమించి విఫల ప్రయుత్నుఁ డగుట.

1900 సం. ఏప్రిలు నెలలో నెడ్వర్డ లెగ్జాండ్రులు డెన్మా ర్కు రాజధాని యగుకోపను హేగనుకు వెళ్లి వలయునని లండను వదలి రైలు మార్గమునఁ బయసము సేయు చుండిరి. వారు బ్రసల్సు పురంబున “నార్డు" అను రైలు స్టేషనులో బండి నెక్కిరి. అప్పుడు “ స్వీడో» అను వాడు కేల దుపాకీ గొని ఎక్కు పెట్టి ఎడ్వర్డు పయిని కాల్చెను. "కొని భగవత్కృపాకటాక్ష మహిమచే నాదెబ్బ నెడ్వర్డు తప్పించు కొని ప్రాణమును కాపాడు కొనెను. అతఁడు ధీర సత్వుడై.. దన తల్లికి నా సమాచారమును బంపి, ప్రయాణమును సాగించెను. " స్వీడో "