పుట:Saptamaidvardu-Charitramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవయధ్యాయము

133


నిలుచుచు, భూమి మీఁదఁ గొన్ని గడియల కాలము బండ్లపై సికారి సేయుచుఁ దిరిగి ఓడ నెక్కి కడలి పై దారి సాగఁ జేయు చుఁ బరిపరివిధముల నెడ్వర్డు మనస్సున కెక్కురీతిని తిన్నగఁ బయ నము సేయుచుండిరి. ఫ్రీప్పనునాతఁడు ఎడ్వర్డు సమీపంబున నుండి ఆరుచుండు గాయమునకు మందులు వేయుచుండెను. ఎడ్వర్డీ రీతిని గాయమునలన బాధపడు చుండినను, కేపు టౌనున నుండు జనులు ఓకుమ్రాని స్తంభ మొకటి కావలయు నని కోరి యుండిరి. ఎడ్వర్డు వారి కోరిక చెల్లించుటకుఁ దాను వ్యా ధిగ్రస్థుఁ డయ్యును, ఎంతమాత్రమును ప్రొలుమాలక దానిని సంపాదించి, వారికి పంపి, వాఱికృతజ్ఞతకుఁ బాత్రుఁ డయ్యె'. ఎడ్వర్డోరులకు నుపకారము సేయుటలో స్వసౌఖ్య లాభ ముల సంతగ బాటింపడు. కేపు టౌనున నుండు జను లాతని యెడఁ దనుకుఁ గల రాజభ క్తి విశ్వాసముల ననేక భంగులఁ దెలి యఁ బడిచిరి.

ఎడ్వర్డు గాయము కుదిరెను. అందఱనుకొన్న విధంబున నాతఁడు కుంటివాఁడు కాడయ్యె. జనులందరును తమరేని ప్రబల మైన వ్యాధి కుదిరి నెమ్మదిగ నుండుటకు సంతోషించిరి. ఎడ్వర్లు స్కాట్లండనకుఁ జనుదెంచి, ఆచోట నుండి లండను పురికి నే తెం చెను. అచ్చట "టీగ్ ఆఫ్ మర్సి” (League of Mercy) నాతఁడు ప్రసగించి, ఆనగరంబున సమరిన వైద్యశాలకు ద్రన్య మియ్య వలయు నని నొక్కి వక్కాణించెను.