పుట:Saptamaidvardu-Charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

నప్త మైడ్వర్డు చరిత్రము.


మోకాలు పరీక్షించి శ్రీఘ్రముననే కుదిర్చెద నని చెప్పెను. రాణి ప్రభృతులకుఁ గొంత ధైర్యము వచ్చెను.

ఇంతలో 21వ తేదీని లార్డులిస్టరను నాతఁడు. ఎడ్వర్డు గాయమును పరిశీలించెను. ఎడ్వర్డు అతనితోఁ దనకు గాలు బెణి కిన విధము సంతయును బూసగ్రుచ్చిసరీతిని చేప్పెను. వైద్యు లందఱును చేరి, సముద్రయానము చేసి, ఆస్బోరున నుండిన రోగము శీఘ్రముగఁ గుదురు సని తీర్పు చేసిరి. ఎడ్వర్డు వారి యిష్టము చొప్పున నాస్బోరులో నుంచుటకు సమ్మతించెను. విక్టోరియా కూడ నాచోటనే ఉండెను. ఆమె తనకుమారుని రోగము కుదుటఁ బడువఱకు నతనియొద్ద నుండుటకు మిక్కిలి సంతోషించెను. ఎడ్వర్డు తనతల్లి కడ కేగుటకు ముందు, మేడ మెట్ల పైఁ బడినపుడు తన చెంగట నుండి శస్త్రము సేసి మందు మాకు లిచ్చిన డాక్టర్ షా అను వైద్యునకుఁ బచ్చలు తాపిన బుగారు పతకంబును బహుమతి నిచ్చెను. ఆనైద్యుడు దానిని గైకొని రాకోమారు నెడఁ గృతజ్ఞత కలవాఁడై ప్రముదితహృద యుండయ్యె. జూలై నెల 30 వ తేదిన నే అలెగ్జాండ్రను, 'ప్రిన్సస్ విక్టోరియాను, గ్రీసుదేశపు రాజును, ఎడ్వర్డు వెంట నా స్బోరుసకు వెళ్లిరి. . ఎడ్వర్డు రోగము అభిముఖమునకు వచ్చు చుండెను. అందరును కొంత ధైర్యము వహింప సాగిరి. ఎడ్వర్డు ప్రభృతులు నావపై సముద్రయానము సేయఁ గడంగిరి. వారాయా రేవులలో