పుట:Saptamaidvardu-Charitramu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

నప్త మైడ్వర్డు చరిత్రము.


నుండు వెల్షు జనులు ఆ రాజదంపతులను మిగుల గౌరవించిరి. అప్పుడు ఎడ్వర్డు వేల్సు రాజ్యము యొక్క రాజ కు మారు డను బిరుదు “వేల్సు" అను రాజ్యమువలన వచ్చిన దని తలంచి అందు సర్వకళా శాలను స్థాపించుటకు నుద్యమించి సఫలీకృతయత్నుడయ్యె, అచ్చట సర్వకళాశాల యొకటి స్థాపి పబడెను. "ఆబిరిస్ట్ విత్ ” (Abery stwith) అను పట్టణంబున అతఁడు దానికి అధ్యక్షుడై 1896 సం. జూను నెలలో ఆ హోదాను వహించి, గ్లాడ్ స్టను మున్నగు దొడ్డ వారి సమ క్షమునఁ దనయిల్లాలికి నొక బిరుదు నొసంగెను. డెనార్కు రా కొమారునకు ప్రిన్సెస్ మాదును ఇచ్చి అతఁడు జూలై నెలలో బకింగు హాముభవనంబునఁ బెండ్లి చేసెను. విక్టోరియా మహారాణి ప్రభృతు లాపరిణయమును జూచి సంతోషించిరి,

విక్టోరియా డైమెండు జూబిలి మహోత్సవము. విక్టోరియా మహారాణి ఇగ్లండు సింహాసనము నలంక రించి పెక్కేండ్లయిన దని మంత్రు లా దేవేరికి డై మెండు జూబిలి 'మహోత్సవము సేయవలయు నని నిశ్చయించుకొనిరి. ఎడ్వ డ్డు ప్రభృతు లీయాలోచన సమంజసంబై ఉన్నదని అంగీకరించి, 1897 సం.న విక్టోరియా జూబిలి మఘోత్సవమును అత్యద్భుతం బుగ కావించిరి . పెక్కు మంది పర దేశ రాజులు విచ్చేసి, రాణికి బహునుతులను సమర్పించిరి. ఎడ్వర్లు, మహెూత్సవమును