పుట:Saptamaidvardu-Charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవయధ్యాయము

127


నెలలో రుష్యా రాజధాని యగు సెంటుపీటర్సు బర్గులో రుష్యా దేశ చక్రవర్తికిని, గ్రాండ్ డచెస్ క్రీశ్చియానాకును, జరిగిన పెండ్లి వేడుకులను గాంచుటకు వెళ్లి తన దేశమునకు మరల విచ్చే'సెను.

రుష్యా చక్రవర్తి వివాహ సమయంబున నారోగ్యదశ నుండ లేదు. ఎడ్య ర్జీలు సేరినతోడ్తో నాతఁడు మిగులరోగ పీడితుఁడయ్యె. ఈయశుభ వార్త ఎడ్వర్ణ లెగ్జాండ్రలకుఁ జేరెను. వారు అక్టోబరు నెలలో బయనమై ఆస్ట్రియాకుఁ జేరునప్పటికీ నారుష్యాజారు స్వర్గస్థుఁ డయ్యె ననువార్త వారి చెవిని బడెను. వా రంతట సెంటుపీటర్సు బర్గునకు వెల్లి .. రుష్యా దేశ చక్ర వర్తిపరలోక క్రియలు సమస్త రాజచిహ్న ములతో జరుగు చుం డెను. ఇంగ్లండునుంచీ జార్జిరాకుమారుఁడు 'సెంటుపీటర్పు బర్గు న నుండిన తల్లిదండ్రులఁ జేరెను. అవల: గొన్నాళ్లలోనే రు ష్యా దేశ చక్రవర్తి చిన్న కుమారునకును, “హిస్సీ' అనుచిన్న రా జుకూఁతు రైన అలెగ్జాండ్రాకును వివాహము జరిగెను. ఆ పెం డ్డి ముగిసిన వెంటనే ఎడ్వర్ణలగ్జాండ్రాలు తనయుఁడు వెంటఁ జనుదేర నింగ్లండు జేరిరి. ఎడ్వర్డీ రీతి నాయారాజ్యములకుఁ . బలుమాఱు వచ్చుచుఁ బోవుచునుండుటచే నాయా రాష్ట్రముల కును, ఇంగ్లండునకును, గల మైత్రీ చెలంగ కలహము లేనై న నుండిన నవి రూపుమాయు చుండెను.

ఎడ్వర్డ లెగ్జాండ్రులు వేల్సు రాజ్యమునకు వెళ్లిరి. అచ్చట