పుట:Saptamaidvardu-Charitramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

121


నమ్మక ఉండిరి. సర్ విల్లియమ్ గార్డన్ కమ్మింగ్ (Sir William Gordon Cumming) అనునాతడు ఎడ్వర్డునకుఁ బ్రాణమిత్త్ర ము. కమ్మింగు తన్నుఁ గారణము లేక ఆర్తర్ విల్ప నను వాని భార్యయును, లిసెట్ గ్రీనును, వాని ప్రాణమిత్త్రము ను, బైక్లి లెవెట్టను నాతఁడును, తిట్టినా రని వారి పై మాననష్టపు దావా తెచ్చెను. “కాల రెడ్డు" అనునాతఁడు న్యాయాధిపతి. ఎడ్వర్డు సాక్ష్యమియ్య వలయు సని గార్డను కోరెను. ఆయ నకు న్యాయాధీపతి పిలుపు (Summons) పోయెను. ఎడ్వర్డు న్యాయాధికారి యాసతి చొప్పున న్యాయస్థానమున హాజరయ్యే. న్యాయాధిపతి ఆయనకుఁ గూర్చుండుటకు నాసన మిచ్చెను, వ్యాజ్యము విచారణ చేయఁబడెను. ఎడ్వర్లు సాక్ష్య మిచ్చు వారు నిలుచుతావున వచ్చి నిలిచెను.ఉభయకక్షులవారి న్యాయవాదు లాయనను లేనిపోని ప్రశ్నలు వేసి తప్పుదారులకు లాఁగఁ జూచిరి. కాని ఆయన వారికుట్రలకు బేలుపోక నిజము సెప్పెను. ఆవల విచారణ ఏడుదినములు సాగెను. కడపట ప్రతివా దులు దోషు లని పంచాయతీలు చెప్పిరి. వేల్సుయువ రాజు లింతకుముం దనేకు లుండిరి. వారిలో నే ప్రభువును ఇంతదనుక ఈ సాక్ష్య మెచ్చటను జెప్పినట్టు లగపడదు. మన యెడ్వర్దే సాక్ష్యము " సెప్పిన వారలలో మొదటివాడను.

1891 సం. న మే నెల 17 వ తేదీని "పెప్ రాణియందు " పైపు డ్యూకు” అను ప్రభువునకు నొక యాడుబిడ్డ పుట్టెను.