పుట:Saptamaidvardu-Charitramu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

సప్తమైడ్వెర్డు చరిత్రము


జ్యేష్ఠ పు తీకను పాణిగ్రహణము సేయఁ గోరిరి. కాని ఎడ్వేర్డు 'పరాయివానికిఁ దనపట్టి నియ్య నొల్లక ఆంగ్లేయ ప్రభువులలో ఒక చిన్న వానికి నొసంగుటలో అధికలాభము కలదని ఆలో చించి వారి ప్రార్థనల నంగీకరిపఁ డయ్యె. ప్రెస్సస్ లూయి అన్యుని వివాహ మాడె నేని, ఆమెకు నోకానొక సమయమున ఇంగ్లండు దొరతనము లభించులాగున దటస్థించిన ఆమెయే రాజ్య మును బాలించుటకు ఆగ్లేయులు సమ్మతింతురు. కాని, ఆమె భర్తగాని ఆమె బిడ్డలుగాని దేశము నేలుటకు ఇష్టపడరు. ఈ కారణము చేతనే ఎడ్వర్డు తనముద్దుపట్టీ నస్య దేశస్థున కియ్య నభిలషింపలేదు.

లార్డు పై పునకుఁ బెండ్లి రోజున -- "డూక్ ఆఫ్ పైపు"(Dake -of Fife) అను బిరుదు ఒసంగఁబడెను. ఒకింగుహాము అంతః పురమునకుఁ జేరిని కోవెలలో నా పెండ్లి వి శేష వైభనముగ నడిచెను. అప్పుడు విక్టోరియా మహా రాణీయును, ఎడ్వర్డ్ లెగ్జాం డ్రాలు ను వారి కొడుకులును, కడపటికూఁతును హేలనీసు రాజును, (King of The Hellenes) డెన్మార్కు యువరాజును "హెస్సిప్రభువును సచ్చి వధూవరుల నాశీర్వదించిరి..

బాకార్టు వ్యాజ్యమున ఎడ్వర్డు సాక్ష్యము సెప్పుట.

1890 సం. న హేమంతఋతువున ఎడ్వర్టు న్యాయ స్థానమున నాయధిపతుల మ్రోల నిలుచుండి సాక్ష్య మియ్య బోవు నని పుకారు పుట్టెను. జనులు కొంద ఱాగాలి మాటను