పుట:Saptamaidvardu-Charitramu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

సప్తమైడ్వెర్డు చరిత్రము


ప్తించెను. అతని తోబుట్టువు " ప్రిన్సస్ అలెసీ" అను నామె జబ్బుపడి, తిరిగి కుదుటఁబడక మిత్తినోటికిఁ బేలపిండి యయ్యె, ఎడ్వర్డు తనసోదరి మరణంబునకై మిగుల పగల బొగులుచు రాచకార్యములలోఁ బ్రవేశింపక దుఃఖముతో నింటిపట్టున నే ఉండెను. “తగిన కాలునకె తగులును. " అను సామెత చొప్పున నెడ్వర్డు తోబుట్టు వొకఁడు దశాఫ్రికాలోనుండు జూలూ లాండు" అనుచోట రణము సలిపి, స్వర్గస్టు డయ్యె సనుశోక వృత్తాంతము ఆయనకుఁ దెలి సెను. అతను దాని కై మిక్కిలి శోకించెను. కాని తను చావు మనుష్యజనము మొందినవా రందరకు నుండుట సహజ మనియును,చచ్చినవాని కై పగచుట పనికిమాలిన పని అనియును తలుచి నిశ్చింతతో నుండెను.

ఎడ్వర్లు, రణమున స్వర్గస్థుఁ డైన రాకోమారుని జ్ఞాపకార్థ మై నెస్టుమినిష్టురు గుడిలో నాతనిరూపు కలపటమును వ్రేలాడ "వేయవలయు నని చెప్పి, దానికి గాను 1,950 రూపాయలను , ఇచ్చె ను, అనేకులు దీనికి సమ్మతించలేదు. అయినను ఎడ్వర్లు తాను పట్టిన పట్టు వదలక 1883 సం. జనవరి నెలలో ఫుల్ విచ్చిలో నాతని గాపకార్థమై అతని యాకారము గల పటమును జనులు కు గోచరమగునటుల: జేయుటకుఁ దన చిన్న కుమారులు "వెం టరా నా చోటికి వెళ్లి , రాకోమారుఁడు, మాతల్లి యైన విక్టోరి యా మహారాణిగాను ప్రాణములు గోలుపోయినాడనియును అతఁడు దైవభక్తి సంపన్ను డనియును, వానిగుణములను