పుట:Saptamaidvardu-Charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

సప్తమైడ్వెర్డు చరిత్రము.

ఎడ్వర్డు లండనుపురి చేరెను. రైలుస్టేషనులో నాయన తల్లియును, మఱియు ననేకు లాతని నెదుర్కొనుటకు వచ్చియుండిరి. అతఁడు జను లభినందించుచుండ లండనుపుర వీథుల నూరేగుచు, తన వియోగబాధచే శ్రమచెందు నలెగ్జాండ్రా మహాసాధ్వికి దర్శనం బొసంగి, తన యిల్లు చేరెను.

ఎడ్వర్డిల్లు చేరఁగానే రాజబంధువు లందఱును విచ్చేసి ఆయనను దర్శించిరి. అతఁడు భార్యాసమేతుడై కానాటు ప్రభువు, ఎడింబరో ప్రభువు, మున్నగువారు వెంట జనుదేర, వెస్టుమినిస్టరు గుడిలో భగవంతుని చరణారవిందంబుల దన హృదయ పీఠంబునఁ జేర్చి, ప్రముదితచిత్తుడై పొందుపట్లకు నేతెంచెను.


ఎనిమిదవ అధ్యాయము.


1876 సం. ము మొదలు 1987 సం. ము కడవఱకు

ఎడ్వర్డు ఇంట నెమ్మదిగ నుండుట.

లండను పురంబున “లైసెన్‌స్డ్ విక్టలర్స్ అసైలమ్” (Licensed Victuallers' Asylum) అను నాశ్రమము కలదు. అది యాపట్టణంబున వెలసి కొన్ని యేండ్లాయెను. ఆయాశ్రమవాసులు జూబ్లీ మహోత్సవము సేయఁ దలఁచి, ఎడ్వర్డును, బిలిచిరి. అతడు ఆచోటికి వచ్చుటకు నియ్యకొనెను. అనేకు లీసంగతి నెఱింగి, ఆచోటికి బోవల దని ఎడ్వర్డును వేడిరి.