పుట:Saptamaidvardu-Charitramu.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

109


మార్చినెలలో నేడ్వర్డు, ఆయన పరివారముతో, బొం బాయి పురంబునకు నేతెంచి, ఆనెల 14 వ తేదీని స్వదేశగము నోన్ముఖుఁ డయ్యెను. అతఁడు హిందూ దేశమున నాల్గు నెలలుం డెను.:స్వల్ప కాలములో ననేకులతోఁ జెలిమి సేసి కొని, ఆ దేశస్థుల యాచార వ్యహారములను జక్కం గ్రహించి భూమి మీఁద 800 మైళ్లు నడిచి, సముద్రము పై 2500 మైళ్లు ప్రయాణము సేసి హిందూ దేశస్థులకును, ఆంగ్లేయులకును, గల మచ్చికను హెచ్చు చేసి తన వీటికి నేఁగెను. అతఁడు బొంబాయి లోనుండినపుడు: ఆయనతల్లి విక్టోరియ మహారాణీ హిందూ రాజ్య చక్రవక్తిని" అను హెూదాను. బొందఁబోవు ననునార్త అతనికి తెలిసెను. ఆతడింగ్లం:సునకు 'నేఁగు బాటలో నార్తు బూకు ప్రభువుకు నెనుక , హిందూదేశమును 'బాలించుటకు నిర్ణయింపఁబడిన లిట్టను ప్రభువు వేఱొక ఓడలో హీదూ దేశ మునకు వచ్చుచుండెను.

ఎడ్వర్లు హిందూ దేశములో నుండిన స్వల్ప కాలములో స్వదేశ సంస్థానపు ప్రభువులును, శ్రీమంతులైన వర్తక సమూ హంబులును, జనులును, ఆయనకు కానుకలను సమర్పించి యుం డిరి. అతఁడు వానిని బొంది. సంతోష చిత్తుడై ఇంగ్లండు చేరెను, స్వదేశీ సంస్థానపు రాజులు ఎవ్వర్ణునకు బహుమతులను ఇచ్చుటకై ఇంగ్లండులో 37,50,000 రూ. విలునగల వస్తువులు కొనినారట.