పుట:Saptamaidvardu-Charitramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

సప్తమైడ్వెర్డు చరిత్రము

.

కాలములో దాని సొబగును రెండు మూఁడుతడవలు చూచి, ఆ మహల్" ఏదేశంబునకు లేదని నిశ్చయించి తన విడిదికిఁ జనెను.


ఎడ్వర్డునకు వేటపై సధిక ప్రీతికలదు. అతఁడి ఫిబ్రసకి నెల 5.వ తేదిని జయపూరునకు నేఁగినవు డాతఁడు దాని కెలంకుల నుండు నడవులలో నొక పులిసి బీచమడంచెను. అతడీ తావు విడిచి నేపాలు రాజ్యమునకు వెళ్లి అచ్చట నుండు దట్టమైన నిపీ నంబులలో సర్ జంగ్ బహదూరు సాయంబున నై దాఱుపులుల నొక వేటునఁ గాల్చి చంపెను. అతఁడు హిమవత్పర్వత ప్రాంతం బుల నుండు నడవులను, పర్వత శిఖరంబుల యౌన్నత్యం బును, సదులసొంపును, మొదలగు చక్కని ప్రదేశంబులఁ జూచి మఱలెను.

ఎడ్వర్డు తన పరి జనులతో నర్మదానదీ తీరంబు పై వెలయు జబ్బలపురముఁ బ్రవేశించి ఆ పురజనులు సంప్రీతిమై నిచ్చిన యూతిథ్యంబులును గొని, అచ్చట కారాగృహంబున నవయువారు ను, పూర్వమున దారులలోఁ బ్రయాణము సేసిన బాటసారులను హతము నొనర్చి వారి యమూల్యాభరణంబులను గైకొన్న వారును, అయిన 'తగ్సు' ఆనునారిలో నేడ్గీరిని జూచి వారితో గొంతకాలము సంభాషించెను. అట్టి సమయంబున వారిలో నొకుడు తా నఱువదిమందిని తన చేతులారఁ జంపితి నని ఎడ్వర్డుతో మం దలించి బడాయి కోట్టెను. అట్టి వారు విచారణలో దొరతనము వారికి దోడుపడి సాక్ష్యము నిచ్చి నందు ప్రభుత్వము నారి మన్నన లను బడసి ప్రాణములను గోల్పోక చెఱసాలలో ననయు చుండిరి.