పుట:Saptamaidvardu-Charitramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవయద్యాయము.

105

నెక్కి, అవి వినడుమ నుండు వ్యాఘ్రాది క్రూర సత్వంబులను జక్కాడెను. అతఁ దీంతకుముం దెచ్చటను ఇట్టి మృగంబులను జంపినవాడు కాడు. అతని దేశమున నీమృగములు లేవు. ఆది మిక్కిలి చలి చేశము, అందుస మృగంబులు వసింప జాలపు, ఆతఁడు "వేఁటాడుటచే సంతృప్తహృదయుండై తన విడిదికి నరు దెంచెను. ఎడ్వర్లు పుసహా పట్టణమును బాసి, బొంబాయికి నేతెంచి, అచ్చటనుండి పోర్చుగీసు వారి పురంబు లైన గోనా మొదలగు స్థల ములను జూచి, సింహళ ద్వీపంబునకు నేగి ఆచోటం దేయాకు పంటను పరిశీలించి, చెన్న పురికీఁ జను దెంచెను. ఆపురంబున బ్రజులు ఆయనను మిగుల గౌరవించిరి. అతఁను తనతండ్రి శ్రాద్ధ మును డిసంబరు నెలలో చెన్న పురి గవర్నరుండు గిండీ పార్కులో జేసి కొని, కలకత్తాకు వెళ్లను.

ఆతడు కలకత్తానగర రాజంబునఁ గ్రిస్ మస్ పండుగలు నడువుకొనెను, అతఁడాచోటఁ బెక్కు రాజ కార్యములు సేసెను. అనేక రాజులు ఆయనను జూడవచ్చిరి. అతడు వారిని దగిస రీతిని గౌరవింపవలసి యుండెను; వారి బసలకు నాతఁడు నెళ్ల వలసి యుండెను. అతఁడు దొరతనమునారి దివ్యమైన భవనంబునఁ గొలువు చేసెను. హిందువులును, తురకలును, వెండియు ననే కులును, ఆయన కొలువు తీరియుండుటను జూచి విస్మయ చిత్తు లైరి ఆతడు క్రైస్తవుల కోవెలలో భగవంతుని స్మరించి, గొప్ప