విజ్ఞానకోశము - ౨
ఆహారము - విహారము
ఫలములు : ద్రాక్ష - ఖర్జూరము - దాడిమీ - ఆమ్రము-జంబీరము మొదలగునవి.
మాంసములు : మృగములు - విష్కిరములు - ప్రతు దములు - పుస్తహిహములు - బిలేశయములు - మహామృగ ములు - అప్చరములు - ఔదకములు (మత్స్యములు) అని యెనిమిది విధములుగా వర్ణింపబడినవి. . క్షీరములు : గో - మహిష - అజ అవి - ఉష్ణ - అశ్వ- ఖర - మానుషీజాతులను భేదములచే అష్టవిధములు. ఇందు దధీ - తక్ర - నవనీత - ఆజ్యాది ద్రవ్యములనుగూర్చి గూడ వర్ణింపబడినది.
జలములు : కూప - సారస- తాటాక, చౌండ్య -ప్రాస్రవణ - నాదేయాంతరిక్షాది విభేదములచే అష్టవిధములుగ వర్ణింపబడినవి.
స్నేహద్రవ్యములు : ఘృతములు - తైలములు.
సంధానములు : అసవ, అరిష్ట, మద్య, సౌవీరాదులు.
ఆహారము మండ, వేయ, విలేపి, ఓదనము అని నాలుగు విధములుగా చెప్పబడినది. ఇందు మండము, పేయ, విలేపి, అనునవి శోధనకర్మ చేయించిన పిమ్మటను, జ్వరాది వ్యాధులలోను, ఆహారముగ నుపయోగించును. మండము నందు మెతుకులు కానరావు. కేవలము ద్రవ ప్రాయముగనే యుండును, "పేయ అంతకంటే కొంచెము ఘనముగ నుండును. దీనియందు సిక్ధకములు (ఆహార కణములు) కనుపించును. విలేపియందు ద్రవము తక్కువగా నుండును. ఘనపదార్థ మెక్కువగ నుండును. ఓదనమనగా అన్నము మామూలుగ పచింపబడునట్టిది. ఇది పక్వాహారములలో ప్రధానమైన యాహారము. దీనికి సహాయముగ వ్యంజనములను శాకములను ఉపదేశించి యున్నారు. సామాన్యముగ శాకముల భక్ష్యముచేసి సంస్కరించి వాడుదురు. వ్యంజనములను పశ్వాపక్వ భేదముచే రెండురకముల వాడవచ్చును. బృంహణముగ నుండుటకై ఆహారపదార్థములతో బాటుగ పాలు, నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు వాడుదురు.
ఈ అహారరసము సరిగ సిద్ధమై శరీరమునందు జీవనీయాంశములు (విటమిన్సు) అభివృద్ధి చెందుటకై ఫలములను గూడ వాడుచుందురు. ప్రస్తుత కాలములో విజ్ఞాన విషయముల ప్రచారమెక్కువగ నుండుటచే ఫలముల యొక్క ప్రయోజనమును బహుజనులు గ్రహించి ఫలముల యుపయోగమును బహుళముగ జేయుచున్నారు.
ఆహార ద్రవ్యములలో స్వస్థవృత్తమున కుపయోగించు నవియని కొన్నిటిని గుర్తించి వాటిని ప్రత్యహ సేవనీయములుగ తంత్రకారులు చెప్పియున్నారు. అవి శాలి ధాన్యము, గోదుమలు, యవలు, షష్టికము, ముద్గము (పెసర,) క్షీరము, ఘృతము, ద్రాక్ష, ఉసిరిక, సైంధవ లవణము,
ధాన్యములు గాని, ఫలములు గాని, ఉచితమైన క్షేత్రములలో జనింపకపోయినను, నీటియందు నానిపోయినను, అగ్నిచే 'కాలిపోయినను, అకాలములయందు బుట్టినను, వాటిని సేవింపరాదు.
విషమాశనము, అధ్యశనము, సమశనము అనారోగ్య హేతువులు మాత్రమేగాక, మృత్యుకారణములగు మూడు విధము లయిన వ్యత్యస్థాహారములును కలవు.
కాలాకాల నియమము లేకుండగ పరిమాణ నియమము లేకుండగ హీనముగ గాని, అతిమాత్రముగ గాని సేవింపబడునది విషమాశనము.
భోజనము చేసిన వెంట నే మరల భుజించుట అధ్యశనము. పథ్యాపథ్యపదార్థములను కలిపి సేవించుట సమశనము. హితమైన వస్తువులను క్రొత్తగా అభ్యసింపవలసి యున్నపుడు ఒకటి, రెండు, మూడు అన్న కాలములచే ఆంతరము కలుగునట్లుగా చేసి సేవింపవలయును. అభ్యాసములో నున్న యపథ్యాహారములను నాల్గవ భాగముతోగాని, పదునారవ భాగముతోగాని వదలివేయుచుండవలెను.
వక్వాపక్వాహారములలో ఈ దిగువ నుదహరింపబడిన కారణములచే పక్వాహారములే శ్రేష్ఠములుగతోచుచున్నవి.
(1) పక్వమగుటచే ఆ ద్రవ్యములయందలి గురుత్వమంతరించును. అందుచే సులభముగ జీర్ణమగును.
(2) ఈ పదార్థములయందుండు దృశ్యాదృశ్యము లయిన క్రిమిజాతులున్నచో నశించి ఆరోగ్యమునకు భంగము వాటిల్లకుండును.
(3) భక్షణమునకు సౌకర్యముగ నుండును.
అపక్వాహారములలో విటమిన్లు ఉండుననియు, పాకముచే నవి నశించుననియు కనుక అపక్వముగనే తినవలయు