ఆస్ట్రేలియా (భూగోళము)
సంగ్రహ ఆంధ్ర
చాల పల్లముగానుండి సముద్ర మట్టముకంటే కొంచెము ఎత్తుగా నున్నవి. వీటియందు పెక్కు ప్రవాహము లేర్పడి
సరస్సులలోను, బురద నేలలోను, చేరును. తూర్పువై పున పీఠభూములు, ఎత్తైన ప్రదేశములు కలవు. ఉత్తరమున కేవ్ యార్క్ నుంచి, టాస్మేనియా దక్షిణపు కొన వరకు ఇవి ఆస్ట్రేలియాకు అడ్డముగా వ్యాపించియున్నవి.
తూర్పు పీఠభూమి యొక్క అత్యున్నత భాగములను "గ్రేట్ డివై డింగ్ రేంజి" అందురు. ఈ పీఠభూమి యొక్క ఔన్నత్యము ఎక్కువగా ఆగ్నేయతీరమున కనిపించును. "ఆస్ట్రేలియన్ ఆల్ప్సు" ఎల్లప్పుడు మంచుచే కప్పబడి యుండవు. ఇంచుమించుగా విక్టోరియా న్యూసౌత్ వేల్సు రాష్ట్రముల సరిహద్దులకు అడ్డముగా ఈ పర్వతములు ఉత్తరమునుండి, దక్షిణమునకు వ్యాపించియున్నవి. 'కాస్కుస్రో' అను అత్యున్నత శిఖరము యొక్క ఎత్తు ఒకటిన్నర మైలు. ఉత్తరమువైపుగా ఈ పర్వత శ్రేణులు ఔన్నత్యమున తగ్గుచు, క్వీన్సులాండు సరిహద్దును దాటి వ్యాపించి యున్నవి. కార్పెంటేరియా సింధుశాఖ చుట్టును ఉన్న సముద్రతీరము దక్షిణమున పల్లముగా ఉన్నది. ఇచట నుండియే 'డివైడింగ్ రేంజి' యొక్క కొండశాఖ ఒకటి పశ్చిమమువైపు మళ్ళుచున్నది. అచ్చటచ్చట "డివైడింగ్ రేంజి" చాల లోతైన లోయలచే భాగములుగ విభక్తమైనది. ఒక్కొక్క భాగమునకు ప్రత్యేక మైన పేరుకలదు . 'డివైడింగు రేంజి యొక్క పశ్చిమ భాగమందున్న పీఠభూమి మిక్కిలి వైశాల్యము కలది. ఐనను అది పశ్చిమ పీఠభూమి కంటె చిన్నది. ఇచ్చట సాధారణముగా భూమి నైరృతి వైపునకు ఏటవాలుగా నుండును. ఆస్ట్రేలియా యందలి మధ్యభాగము నేరుగా సముద్రము నుండి సముద్రము వరకు పల్లముగానుండి పశ్చిమ పీఠభూమిని తూర్పు పీఠభూమి నుండి వేరుచేయుచున్నది. తూర్పువైపున 20 నుండి 100 మైళ్ళ వెడల్పున ఏటవాలై ఇరుకైన సముద్రతీరమైదానములు ఏర్పడియున్నవి.
ఈ ప్రాంతమందలి చాలభాగములో ఇసుక రాయి కాని, నల్లరాయి కాని, ఉండుటచే, ఇది సారవంతముగాదు. ఇచ్చట అగ్ని పర్వతములు లేమిచే వాటికి సంబంధించిన నేల కనిపించదు. కాని తూర్పు తీరమునకు పశ్చిమ భాగము నందు 200 మైళ్ళ వరుసలో ఉత్తమమైన నేలలు కలవు. ఈ ప్రాంతము బాదాము వంటి చెట్లు (Chestnut) పెరుగుటకు అనువైన మండలమని చెప్పవచ్చును. పశ్చిను మండలమున ఎడారి సరిహద్దుల యొద్ద బూడిదవన్నెగల నేల కనిపించును. దక్షిణమున మాన్లీ సాయిల్ అనబడు సున్నము, ఉప్పుగల భూవి శేషము కలదు. ఆస్ట్రేలియా మధ్యప్రదేశము నందు ఎంతో విశాలమగు ప్రదేశము డెసెర్ట్ వేస్ట్ అనబడు గులకరాయితో నిండియున్నది.
ఆస్ట్రేలియా శీతోష్ణస్థితియందు చాలా సమత్వనుుకలదు. మకర రేఖ ఈ ఖండమును రెండు భాగములుగ విభజించును. నీటిలో దక్షిణభాగము మిక్కిలి పెద్దది. ఈ ఖండములో మూడవవంతుకంటే ఎక్కువ భాగము ఉష్ణమండలములో నున్నది. మిగిలిన దాదాపు ¾ భాగము దక్షిణ సమశీతోష్ణమండలము నందలి ఎక్కువ వెచ్చని భాగమున ఉన్నది. సగటు ఉష్ణోగ్రత 70° ఫా. జనవరి నుండి జూలై వరకు ఉష్ణోగ్రత యొక్క వ్యాప్తిలో మార్పు తక్కువగా ఉండును. ఆస్ట్రేలియా శీతోష్ణస్థితి దాని భౌగోళికస్థితిపై ఆధారపడి యుండలేదు. (1) ఇచటి వేడిమి విక్టోరియా రాష్ట్రములో తప్ప అన్ని భాగములలో పీఠభూమి యొక్క ప్రభావమునకు, కొంతవరకు లోనగుచున్నది. దేశమునందంతటను చాలవరకు శీతోష్ణస్థితిసగటున వెచ్చగా నుండునని చెప్పవచ్చును. (2) కార్పెంటేరియా సింధుశాఖ యొక్క వాయవ్య దిశయందును, పశ్చిమమందును సగటున ఉష్ణోగ్రత 80° ఫా. కు పైగా నుండును. మకరరేఖ కిరువైపులను ఉష్ణోగ్రత 70° -80° ఫా. మధ్యనుండును. క్వీన్సులాండుతో కలిపి, ఈఖండమునందలి దక్షిణభాగమునందును, న్యూసౌత్ వేల్సు యొక్క ఉత్తర భాగమునందును, సగటున ఉష్ణోగ్రత 70° ఫా. ఉండును. అంతకు తక్కువగను ఉండును. దక్షిణమునకు పోవుకొలది సంవత్సరము మొత్తముమీద ఉష్ణోగ్రత యొక్క పరిమితి తగ్గును. భారమితి (Barometer) పీడనములు ఆస్ట్రేలియాలో చాల ఎక్కువ. ఇందుకు కారణము ఇది దక్షిణమందున్న అధిక పీడనమండలములో నుండుటయే. భూమధ్య రేఖ వద్దనున్న అల్పపీడనమండలము వేసవిలో (జనవరి నెలలో) దక్షిణమువైపు కదలి, ఆస్ట్రేలియా ఉత్తర సముద్రతీరము పై ప్రసరించును. శీతకాలమునందు అంటార్కిటిక్ అల్పపీడనమండలము వెంబడి వచ్చు తుఫానులవల్ల ఈ ఖండము చాలా దెబ్బతినుచుండును.