విజ్ఞానకోశము – ౨
ఆస్ట్రేలియా (భూగోళము)
మగు కాన్ బెజ్జూ నిర్మింపబడెను. 1926 బాల్ఫరు ప్రకటన వలనను, 1931 వెస్టుమినిస్టర్' శాసనమువలనను ఆస్ట్రేలి యాకు ఇతర అధినివేశ రాజ్యములతోబాటు ఎక్కువ స్వేచ్ఛ లభించెను.
రెండవ ప్రపంచయుద్ధము : రెండవ ప్రపంచయుద్ధమున ఆస్ట్రేలియా మిత్రమండలి పక్షమున పోరాడెను. 1941 లో జపాను యుద్ధమున ప్రవేశించి మలయా, ఫిలిప్పైను దీవులు, బర్మా, ఆక్రమించుటతో ఆస్ట్రేలియాకు జపాను దండయాత్ర భయమెక్కువైనది. కాని కోరల్ (Coral) సముద్ర యుద్ధముతో జపాను వెనుకంజవేసెను.
యుద్ధానంతర మేర్పడిన ఐక్యరాజ్యసమితిలో ఆస్ట్రేలియాకు సభ్యత్వము లభించినది. ఆస్ట్రేలియా ప్రతినిధి యైన డాక్టర్ ఇవాట్ సమితిలో ప్రముఖపాత్రను నిర్వహించెను. 1948 లో అతడు సాధారణసభ కధ్యక్షుడై నాడు. ఇండోనీషియా స్వాతంత్య్రము సందర్భమున ఆస్ట్రేలియా ఇండియాతో కలిసి పనిచేసెను.
ఉమ్మడి భద్రత చర్యలు : పసిఫిక్ సముద్ర రాజకీయములలో ఆస్ట్రేలియా కీలకస్థాన మాక్రమించియున్నది. ఆస్ట్రేలియాకు జపానుభయ మెక్కువైనది. అందుచే ఆత్మ రక్షణకై 1951 లో న్యూజీలాండు, అమెరికా (U.S.A.) లతో కలిసి ఆస్ట్రేలియా ఒక కూటమి నేర్పరచెను (Anzus). 1954 లో నేర్పడిన ఆగ్నేయ ఆసియా రాజ్యకూటమి యందలి (Seato) ప్రధాన రాజ్యములలో ఆస్ట్రేలియా యొకటి.
వి. యస్. యల్.హా.రా.
ఆస్ట్రేలియా (భూగోళము) : పూర్తిగా దక్షిణ - అర్ధ గోళముననే వ్యాపించి యున్న ఆస్ట్రేలియా ఖండము ఇంచుమించు కోడి గ్రుడ్డు ఆకారము కలిగి ఉన్నది. 10°-41′ దక్షిణమునుండి 43° - 39' దక్షిణము వరకు అక్షాంశమునందును, 110° తూర్పునుండి 153° తూర్పువరకు రేఖాంశమునందును ఈ ఖండము వ్యాపించియున్నది. దీని వైశాల్యము 3 మిలియనుల చదరపు మైళ్లు. భూగోళమున ఉన్న ఖండములలో ఇది మిక్కిలి చిన్నది. ఇది పరిమాణములో ఇంచుమించు సంయుక్త అమెరికా రాష్ట్రములంత ఉండును. దీని సముద్ర తీరము 12,210 మైళ్లు. దేశములోని ప్రతి 244 చదరపు మైళ్లకు 1 మైలు సముద్ర తీరము కలదు. తూర్పునుండి పడమరకు దీని అత్యధిక విస్తృతి 244,000 మైళ్ళు. ఉత్తరమునుండి దక్షిణమునకు దీని పొడవు 1970 మైళ్ళు. ఈ ఖండము యొక్క శీతోష్ణస్థితిపైనను, భూగోళతత్త్వము పైనను, దీని అక్షాంశ స్థితి యొక్క ప్రభావము కనిపించును. ఒక్క ఉత్తరమువైపు తప్ప, తక్కిన ఎల్లలు సముద్రములేయగుటచే దీనికి చాలవరకు ఏకాంత స్థితి కలుగుచున్నది. ఈ ఖండమునకు, తూర్పున పసిఫిక్ మహాసముద్రమును, దక్షిణమున, వాయవ్య భాగమున హిందూమహాసముద్రమును కలవు.
ప్రపంచమందలి పురాతన ప్రదేశములలో ఆస్ట్రేలియా ఒకటి. న్యూగినీతోను, మలనీషియా అనబడు సముద్ర తీరమందలి మరి కొన్ని ద్వీపములతోను కలిసి ఈ ఖండము మునుపు చాల పెద్దదిగా ఉండెడిదని భావింపబడుచున్నది. ఆస్ట్రేలియా మధ్య మైదానపు పల్లపు ప్రదేశము నవీన శిలలతో నిండియున్నది. ఆస్ట్రేలియా పశ్చిమ భాగము నందును, సముద్ర తీరమునందు కూడ ఇవి కనిపించును. పశ్చిమ ఆస్ట్రేలియాయందలి పెద్ద పీఠభూమి మాత్రము మిక్కిలి ప్రాచీన శిలలతో నిండియున్నది. ఎడారియందలి ఇసుక రాయి, బిరుసైన కొండ భాగములు, మధ్య ఆస్ట్రేలియా యొక్క నైఋతి భాగపు సముద్రతీరము నందలి ఇంకను మిక్కిలి క్రొత్త రాళ్లతో ఏర్పడియున్నవి. తూర్పున ఉన్న పీఠభూమి మిక్కిలి పురాతనమై ఎక్కువ కఠినమైన రాళ్లతో కల్పితమైనది. ఇట్టి ప్రదేశములలో ఖనిజములు (Minerals) ఎక్కువగా లభించును. తూర్పున బొగ్గుతో కలిసిన రాయికూడ సాధారణముగా కనిపించును. పశ్చిమ ఆస్ట్రేలియా అంతయు ఎక్కువ ఎత్తులేని మైదానముగా నున్నది. ఈ మైదానము పశ్చిమ సముద్రతీరమున చిన్న చిన్న కొండల పంక్తిగా పెరిగినది, అందుచేత ఈ గుట్టలకును హిందూమహాసముద్రమునకును మధ్య ఇరుకైన యొక మైదాన మేర్పడినది. అది మధ్య భాగమున కొంచెము వెడల్పుగ నున్నది. కొండల ఎత్తు 1500 అడుగులను ఎప్పుడును మించదు. పశ్చిమ మైదానమునకు పిమ్మట గొప్ప మైదానములున్నవి. అవి ఉత్తరము నుండి దక్షిణమునకు ఖండమునకు మధ్యగా వ్యాపించి యున్నవి. ఈ మైదానములు ఆగ్నేయభాగమున క్రుంగుచు,