కృష్ణానది మున ఇది మిక్కిలి గొప్పది. ఆ కాలువ యొక్క పొడవు 270 మైళ్ళు. అది వెన్న (పినాకిని) నదిలో పడును. అది గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో 21 లక్షల ఎకరముల మొత్తము విస్తీర్ణములో గల వరిపంటకు నీరు అంద జేయును. ఎడమదరికాలువకు 15,000 క్యూసెక్కుల నీరును గొంపోవుశక్తి కలదు. దీని పొడవు 205 మైళ్ళు. ఈ కాలువక్రింద నల్లగొండ, ఖమ్మము, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో 13.5 లక్షల ఎకరములకు నీరు పారుదల అగునట్లు ప్రతిపాదింపబడినది. నీటిపారుదల ప్రయోజనములకు తోడుగ, ఆనకట్ట వద్ద 75,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయబడును. ఇట్లు సుమారు 35 లక్షల ఎకరముల భూమికి నీటిపారుదల ఏర్పడును. సాలీనా 10 లక్షల 75 వేల టన్నుల ఆహార ధాన్యములు పండింపనగును. ఈ పథకము పూర్తియగుటకు 125 కోట్ల రూపాయలు వ్యయము కావలసియుండు నని అంచనా వేయబడినది. దశలవారి వథకము (Phase Scheme) : ఈ ప్రాజెక్టును రెండు దళలలో (phases) పూర్తి చేయునట్లు నిర్ణయింప బడినది. మొత్తము ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తికాక మునుపే, ముందుగా లాభములను పొందగల్గుటయే దీని యుద్దేశము. మొదటిదశలో ఆనకట్ట రాతికట్టడము ఎఫ్.ఆర్.యల్.+ 525 (తుట్టతుదకు ఎఫ్. ఆర్. యల్ 590) ఎత్తునకు లేపబడును. కృష్ణానది యొక్క కుడి ఎడమ ఒడ్డులయందు క్రమముగా 135 మరియు 108 మైళ్ళ నిడివిగల రెండు కాలువలు త్రవ్వబడును. వీటివలన 20.6 లక్షల ఎకర ములకు నీటిపారుదల ఏర్పడును. అందు కృష్ణా డెల్టా క్రింద 14 లక్షల ఎకరములలో మొదటి వంటయు, 14 లక్షల ఎకరములలో రెండవపంటయు చేరియున్నవి. మొదటి దళ - యందలి పథకమునకు రు.81 కోట్ల రూపాయలు వ్యయ మగుమ. ఈ ప్రాజెక్టుపై పని 1955 డిశెంబరులో మొదలు పెట్ట బడెను. అనకట్ట 807 అడుగుల ఎత్తువరకు లేపవలయునను మొదటి దళావిధానము 7 సంవత్సరములలో పూర్తి అగునని ఊహించబడుచున్నది. తుంగభద్ర ప్రాజెక్టు : ఇది పూర్వపు హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వము, పూర్వపు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము 804 G సంగ్రహ ఆంధ్ర కలిసి ప్రారంభించిన పని. ఇప్పు డి తుంగభద్ర ఆనకట్ట ప్రాంతము మైసూరురాష్ట్రములో చేరిపోయినది. ఆంధ్ర, మైసూరు రాష్ట్రములతో 8 లక్షల 30 వేల ఎకరములకు నీటి పారుదల కాగలదని తలపబడుచున్నది. తుంగభద్ర జలాశయములో 8.05 మిలియను ఎకరపు టడుగుల నీరుండగలదు. పథకము ప్రకారము ఆనకట్ట ఎత్తు వునాదుల పైన 100 అడుగులుండును. రెండుదశలలో జలవిద్యుచ్ఛక్తి (Hydro Electric Power) ఉత్పత్తి కాగలదు. మొదటి దశలో అనకట్టవద్ద 88000 కిలోవాట్లు, రెండవదశలో హంపెవద్ద 86,000 కిలోవాట్లు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదు. ఈపథకమునకు రు. 46.04 కోట్ల రూపాయలు వ్యయము కాగలవు. దీనివలన 1,40,000 టన్నుల ఆహార ధాన్యములు, 80,000 టన్నుల వ్యాపారపు పంటలు పండు నని అంచనా వేయబడినది. ఆనకట్ట నిర్మాణము పూర్తి అయినది; కాలువల నిర్మాణము గూడ దాదాపు పూర్తి అయినది. అనకట్ట యొద్ద పవర్ హౌస్ పై పనియు, కుడి పైపు కాలువ త్రవ్వు పనియు చురుకుగా నడచుచున్నది. ఇంతవరకు కుడివైపున (ఆంధ్రప్రదేశ్) 20,200 ఎక ర ములు, ఎడమవైపున (మైసూరు) 14,600 ఎకరముల భూమి సాగుక్రిందకు వచ్చినది. తుంగభద్ర హైలెవెల్ కాలువ: తుంగభద్రా జలమును ఇంకను ఎక్కువగా ఉపయోగించుకొను హైలెవెల్ కెనాల్ స్కీము ఉద్దేశింపబడినది. దీనిచే ఉత్పత్తి స్థానమున (at its head) 4,000 క్యూసెక్కుల నీటిని గ్రహించుచున్నది. దీనిలో 35% మైసూరు రాష్ట్రము లోను, 85% ఆంధ్రప్రదేశములోను ఉపయోగింపబడును. 116 వ మైలు వద్ద ఈ కాలువ, ఉరవకొండ కాలువ ద్వారా వెన్న నదిలోనికి 1584 క్యూసెక్కుల నీటిని వదలి పెట్టు చున్నది. 'కొనమనయానిపల్లి' వద్దనున్న మధ్య- పెన్నా రెగ్యులేటరు సాయమునను, గండికోటవద్దనున్న ఆనకట్ట సాయమునను ఈ నీరు ఉపయోగించుకొనబడుచున్నది. దీనివలన మైసూరు రాష్ట్రములో 1,86,000 ఎకరముల ఆయకట్టునకును, ఆంధ్రప్రదేశమున గల అనంతపురము, కడప జిల్లాలలో 2,51,878 ఎకరముల ఆయకట్టునకును నీటిపారుదల సదుపాయ మేర్పడుచున్నది.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/857
స్వరూపం