విజ్ఞానకోశము . . తమ్మిలేరునది తిరువూరు, నూజివీడు తాలూకాల తూర్పు సరిహద్దుల వెంబడి ప్రవహించుచు పశ్చిమ గోదావరిజిల్లాలో ప్రవేశించుచున్నది. బుడమేరు చిన్ననది. అది విజయవాడ గన్నవరము, గుడివాడ, కైకలూరు తాలూకాలగుండా ప్రవహించి కొల్లేరులో పడుచున్నది. అడవులు: ఈ జిల్లాయందలి తాలూకాలలోని రిజర్వు అడవుల ఏర్పాటు ఈదిగువ విధముగా నున్నది. నందిగామ తాలూకాలో 60,88 చ. మైళ్ళు; విజయవాడ తాలూ కాలో 58.17 మైళ్ళు; తిరుపూరు తాలూకాలో 24,74 చ, మైళ్ళు మాజివీడు తాలూకాలో 30.18 చ. మైళ్ళు గన్నవరం తాలూకాలో 10.94 చ. మైళ్ళు; బందరు తాలూకాలో 44.15 చ. మైళ్ళు; దివి తాలూకాలో 88.29 చ. మైళ్ళు రిజర్వు అడవులు కలవు. మొత్తము జిల్లాలో 295.15 చ. మైళ్ళు రిజర్వు అడవులున్నవి. దివి తాలూకాలోని రిజర్వు ఆడవులలో మాన్ గ్రోవ్ చెట్లు పెరుగును. శీతోష్ణము . వర్షపాతము : ఏప్రిల్, మే, జూన్ నెలలు అత్యుష్ణముగా నుండును. పశ్చిమతీర నైరృతి మేఘ వాయువులు వీచుట సాగగనే జులై నుండి ఉష్ణోగ్రత తగ్గును. నైరృతి, ఈశాన్య ఋతుపవనములు వీచుచుండగా వానలు పడును. నవంబరు మొదలుకొని ఫిబ్రవరివరకు శీతోష్ణస్థితి ష్ణస్థితి బాగుగా చల్లగానుండును. ఈ జిల్లాలో మొత్తముమీద వర్షపాతము సగటున 87", నందిగామ తాలూకాలో సగటున 32 లును, దివి తాలూకాలో 40″ లును వర్షము కురియుచుండును, ఈశాన్య ఋతు పవనములవల్ల సముద్రతీరపు భాగములలో డిసెంబరు నెల వరకు వర్షములు కురియుచుండును. నేలలు : ఈ జిల్లాలో మూడు రకముల నేలలున్నవి. అవి ఒండు నేలలు, నల్ల రేగడి నేలలు, ఎఱ్ఱరేగడి నేలలు, తీరము నానుకొని ఇసుక నేల (arenaceous) గల చిన్న మండల మొకటి కలదు. నల్ల రేగడి నేల ఎక్కువ విస్తీర్ణము కలదిగా నున్నది. అది కైకలూరు, విజయవాడ, నంది గామ తాలూకాలలో విశేషముగా నున్నది. నల్ల రేగడి తరువాత ఒండు నేల ఎక్కువ విస్తీర్ణమును కలిగియున్నది. అది కైకలూరు తాలూకాలో తప్ప అన్ని తాలూకాల లోను కనిపించును. మిట్టలలో భూమి ఎఱ్ఱగా నుండును. 795 కృష్ణాజిల్లా నీటి పారుదల : ఈ జిల్లా కంతటికి నీటిపారుదలకు కృష్ణానదియే ప్రధానమైన ఆధారము. విజయవాడ వద్ద కృష్ణానదికి అడ్డముగా నొక ఆనకట్టను కట్టి ఆ ఆనకట్టకు పై భాగమునుండి ఇరుప్రక్కలనున్న భూములకు కాలువల ద్వారమున నీరు సరఫరా చేయబడుచున్నది. తూర్పు వైపున ఉన్న కాలువలును, వాటి శాఖలును కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకును, పడమటివైపున ఉన్న కాలువలు గుంటూరు జిల్లాకును ఉపయోగపడుచున్నవి. మునేరు, బుడమేరు, తమ్మిలేరు అనునవి మెట్ట తాలూకా లలో నీటిపారుదలకు కొంతమట్టుకు ఉపయోగించుచున్నవి. మిట్టలలో చెరువుల మూలమున నీటిపారుదల ఏర్పడు చున్నది. మెట్ట పొలములలోని బావుల నీరు మెట్ట పైరు లకును తోట పైరులకును పనికివచ్చుచున్నది. మెట్ట పైరులను పెంచుటకై తీరప్రాంత భూములలో చెలమలు తాత్కాలికముగా త్రవ్వబడుచుండును. కొల్లేరు, ఉప్పు పేరుల నీటితోకూడ వ్యవసాయము జరుపబడుచున్నది. దివి తాలూకాలోని భూభాగమునకు నీటిపారుదల కొరకు కృష్ణానదిపై పులిగడ్డ వద్ద అక్విడక్టు నిర్మింపబడి దాని గుండా బందరు కాలువ తీసికొనిపోబడెను. పంటలు : ఈజిల్లాలో వరిపంట ముఖ్యమైనది. చోళ్లు, కంబు, వరిగ, రాగులు, కారుజొన్న కొలది మెట్టభూము లలో పండించ పడుచున్నవి. వేరుసెనగ, పొగాకు ముఖ్య మైన వాణిజ్యపు పంటలు. రహదారులు : విజయవాడ నుండి నల్ల గొండ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పోవు రహదారులు కలవు. మద్రాసు, కలకత్తాలను కలుపు జాతీయరహదారి (ట్రంకు రోడ్డు) ఈ జిల్లా గుండా పోవును. ఈ జిల్లా యందలి రోడ్ల పొడవు 1474 మైళ్లు. ఇందు 24 మైళ్లు జాతీయ రహ దారులు ; 78 మైళ్లు రాష్ట్రీయ మార్గములు, 448 మైళ్లు జిల్లా పెద్ద బాటలు ; 208 మైళ్లు జిల్లా ఇతర బాటలు: 454 మైళ్లు గ్రామ మార్గములు; 2 మైళ్లు పబ్లికువర్క్సు శాఖకు చెందిన రోడ్డు ; 192 మైళ్లు స్థానిక సంస్థలకు చెందిన రోడ్లు. మొత్తము మీద ఈ జిల్లాలో రోడ్ల సౌకర్యములు తగినంతగా లేవు. రైల్వేలు : ఈ జిల్లాలో 55 మైళ్ల పొడవుగల బ్రాడ్ గేజి రైలుమార్గము, 774 మైళ్ల పొడవుగల మీటరు గేజి రైలు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/848
స్వరూపం