Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/847

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృష్ణాజిల్లా ప్రతిదినము పాఠకులుగా 200 మంది భాషానిలయమునకు వచ్చెదరు. సభలకు స్థలము చాలుటలేదు. భవనము ఉత్త రాభిముఖముగా పెంచుట నీలయ కార్యనిర్వాహకుల ఆశయము. విరాళములు ప్రోగుచేయబడుచున్నవి. నిజాం ట్రస్టుఫండువారు దీనికై పదివేల దానము దయచేసినారు. భాషాభిమానుల ప్రోత్సాహమున్నచో త్వరలోనే భవన విస్తరణము జరిగి శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయము ఇతోధికాభివృద్ధి నంది సమస్త వస్తువరికర సమేతమై, పరి పూర్ణమయి కేంద్రగ్రంథాలయముగా పరిణమింపగల దనుటకు అవకాశ ముకలదు. కృష్ణాజిల్లా : వి. రా. కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశములో నున్నది. ఇది ఉత్తర అక్షాంశ రేఖ 15°-43' నుండి 17°-10' వరకును, తూర్పు తులా రేఖ 80° నుండి 81°-33' వరకును విస్తరించి యున్నది. ఖమ్మంమెట్టు జిల్లాలోని భూభాగములను వినిమయము చేసికొనుట కారణముగ 1950వ సంవత్సరమునుండి భూమి హద్దులలో ఈజిల్లా స్వల్పమైన మార్పులకు లోనై యున్నది. మొదటినుండి కృష్ణాజిల్లాకు చెందియున్న ఈ క్రింది గ్రామ ములు ఖమ్మం మెట్టు, నల్లగొండ జిల్లాలలో చేర్చబడినవి : లింగగిరి సూరవరం, కలవపల్లి, లక్కవరం, అమరవరం, గానుగబండ మొలుగుమాడు, రొంపిమళ్ల, మల్లవరం. వీటికి ప్రత్యామ్నాయముగా కొడవటిగల్లు, ఉస్తేపల్లి, పరిటాల, గనిఆతుకూరు, మోగులూరు, బ తినపాడు, గానుగుపాడు, బోరవంచ, మల్లవల్లి, పుల్లంపాడు, అను గ్రామములు కృష్ణాజిల్లాలో చేర్చబడినవి. ఈ జిల్లాకు ఉ త్తరమున ఖమ్మం మెట్టు జిల్లాయు, పశ్చిమ గోదావరి జిల్లాయు, తూర్పున పశ్చిమ గోదావరి జిల్లాయు బంగాళాఖాతమును, ద క్షిణమున, బంగాళాఖాతము, గుంటూరు జిల్లాయు, పశ్చిమమున గుంటూరు జిల్లాయు సరిహద్దులుగా నున్నవి. దక్షిణము, నైరృతి దిశలందు కృష్ణానదియే సరిహద్దుగా వర్తించును. ఉత్తరము, ఈశా న్యములందు తమ్మిలేరు, కొల్లేరు సరస్సు, ఉప్పుటేరు సరి హద్దులుగా నున్నవి. ఈ జిల్లాకు క్రమమైన ఆకారములేదు. ఇది ఇంచు మించు పశ్చిమోత్తరమునుండి ఆగ్నేయమునకు పొడవుగా సంగ్రహ ఆంధ్ర వ్యాపించి యున్నది. నందిగామ, తిరువూరు తాలూకాల మధ్య ఖమ్మం మెట్టు జిల్లాలోని భూమి ఈ జిల్లాలోనికి వి శేషముగా చొచ్చుకొని యున్నది. బందరు, దివి తాలూ కాలు సముద్రతీర ప్రాంతములు. జిల్లాను స్థూలముగా డెల్టా, మిట్టలు అను రెండు సహజమండలములుగా విభజించ వచ్చును. బందరు, దివి, గుడివాడ, కైకలూరు, గన్నవరము, విజయవాడ తాలూకాలు డెల్టా మండల ములో చేరును. శేషించిన భాగము మిట్ట మండలములో చేరును. మొదటిది కృష్ణానది డెల్టాలో నొక భాగము. రెండవది దక్కను పీఠభూమిలో అంతర్భాగము. అది యొక నిమ్నోన్నతమైన మైదానము. దానిలో బయటి తూర్పుకనుమల శాఖలగు ఎత్తులేని కొండల వరుసలు అచ్చటచ్చట కనిపించును, నందిగామ తాలూకా తూర్పు సరిహద్దు నందలి కొండపల్లి కొండలును, తిరువూరు తాలూకా యొక్క దక్షిణ భాగమందు జమ్మలవాయి దుర్గపు కొండలును ప్రధానమైనవి. నూజివీడు తాలూకా లోను, గన్నవరం, నందిగామ తాలూకాల భాగములలోను కొండల వరుసలు కలవు. 794, కొల్లేరు సరస్సు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు తాలూకాలో దక్షిణభాగమునను, కృష్ణాజిల్లాలో, కైక లూరు తాలూకాలో ఉత్తరభాగమునను కలదు. అది యొక లోతులేని నీటిపల్లము. దాని విస్తీర్ణము 150 చ. మైళ్లు. ఆ సరస్సు ఋతుపవన కాలమందు చుట్టుపట్టుల నున్న మురుగునీటికి ఒక తొట్టివలె నుపయోగపడును. వేసవిలో అది ఎండిపోవును. డెల్టా సాధారణముగా చదు నుగా నున్నను సముద్రతీర సామీప్యమున కొన్ని కాలూశా లలో వ్యవసాయమునకు పనికిరాని బంజరు భూములున్నవి. డెల్టా విశాలమై పంటభూములతో నలరారుచుండును. నదులు: కృష్ణానదియు, దానికి ఉపనదియైన ము నేరును జిల్లాయందలి ముఖ్యనదులు. అరేబియా సముద్రమునుండి నలుబదిమైళ్ల దూరమునగల మహాబలేశ్వరమునకు సమీప మందున్న పశ్చిమ కనుమలలో పుట్టి కృష్ణానది ఆంధ్రప్రదేశ ములో గుండా పోవుచు కృష్ణాజిల్లాకు వైరృతి సరిహద్దుగా ప్రవహించి సముద్రములో కలియును. నందిగామ తాలూ కాకు అడ్డముగా ఉత్తర దక్షిణముగా ప్రవహించుచున్న ఉపనదియగు మునేరు కృష్ణానదికి పోషకముగా నున్నది.