విజ్ఞానకోశము = 4 తెలంగాణ మంతటను సూర్లకొలది గ్రంథాలయములు ఉద్భవించి భాషాభిమానమును, దేశాభిమానమును ప్రబో ధించినవి. తెలంగాణమం దెచ్చట చూచినను జయంతులు, వర్ధంతులు, వార్షికోత్సవములు, ఉపన్యాసములు, కావ్య గానములు, సన్మానము అధిక మైనవి. ఈ భాషానిలయమున క్రీ.శ. 1940 లో పోతనవర్ధంతి, సారస్వత సప్తాహము కీ.శే. చిలుకూరి నారాయణరావుగా రధ్యతులుగా జరిగినది. ఈ సందర్భమును పురస్కరించు కొని 'తెలుగుతల్లి' అను మాస పత్రిక ప్రత్యేక సంచిక గా వెలువడినది. క్రీ. శ. 1942 లో భువనవిజయ సప్తాహము శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగా రధ్యతులుగా జరిగినది. ఇట్లే రెడ్డియుగ సారస్వత సప్తాహములవంటి కార్యక్రమము లేటేటా జరుపబడుచు వచ్చెను. హైద్రా బాదు తెలుగు ప్రజానీకము తదాకృష్టమై ప్రభుద్ధ మయ్యెను. సభలు, సమావేశములు జరిగినప్పుడు భాషానిలయము కిటకిట లాడిపోయెడిది. స్థలము చాలకుండెడిది. భవన మును విస్తృత మొనరింప ప్రయత్నములు సాగినవి. ఇంతలో 1947 లో భారతదేశమునకు స్వాతంత్య్రము లభించినది. 1948లో హైద్రాబాదుపై పోలీసుచర్య జరిగినది. రాజ్యపరిపాలనా విధానములో మార్పువచ్చినది. ఆంధ్ర ప్రజల మాతృభాషకుగల నిర్బంధములు వీడినవి. ఇనుమడించిన ఉత్సాహముతో భవన విస్తరణ కార్య క్రమము సాగినది. ఇపుడున్న విశాల వేదికా నిర్మాణము శ. జరిగి భాషానిలయము పడమటికి పెరిగినది. 80-8-1949 నాడు నూతనభాగావిష్కరణము జరిగినది. హైద్రాబాదునందు ఆంధ్ర జాతీయ ప్రభుత్వ మేర్పడు టచే భాషానిలయమునకు తొలిసారిగా ప్రభుత్వమునుండి ఆరువేల ధనము లభించినది. భాషానిలయమున కనేక విధముల సేవచేసిన శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు హైద్రాబాదు విద్యామంత్రిగానున్న కాలమున ప్రతి సంవత్సర మీ సంస్థకు ఆరునూర్ల రూపాయల సహాయ విరాళ మిచ్చుటకు ప్రభుత్వము వారును, ప్రతియేట అరువది రూపాయ లిచ్చుటకు హైద్రాబాదు పురపాలక సంఘము వారును అంగీకరించిరి. ఈవిధముగా శ్రీకృష్ణదేవరా యాంధ్ర భాషానిలయము అన్ని విధముల పుష్టి నందినది. 100 793 కృష్ణదేవరాయాంధ్రభాషావిలయము 1951 తో భాషానిలయమున కేబదేండ్లు నిండినవి. అర్ధశతాబ్ద మీ భాషానిలయము తెలంగాణవాసుల భాగ్య ములు పండించినది. ఏతత్కారణముగా క్రీ.శ. 1-9-1952 నాటి నుండి మూడు దినములు స్వర్ణోత్సవము అతివై భ వముగా జరిగినవి. రజతోత్సవములప్పుడు భాషానిలయ మునకు కార్యదర్శులుగానున్న శ్రీ బూర్గుల రామకృష్ణా శ్రీ రావుగారు స్వర్ణోత్సవ కాలమున భాషానిలయాధ్యక్షులుగా నుండిరి. కీ. శే. వడ్లకొండ నరసింహారావుగారు కార్య దర్శిగా నుండిరి. మహామహోపాధ్యాయ శ్రీపాద కృష్ణ మూర్తిశాస్త్రిగారు, కీ. శే. శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమ రావుగారు, శ్రీ చెరుకువాడ నరసింహం పంతులుగారు, శ్రీ డాక్టరు భగవంతంగారు హైద్రాబాదు రాష్ట్ర మంత్రి వర్యులు మున్నగు పెద్దలీ కార్యక్రమమునందు పాల్గొనిరి. భాషానిలయపడమున స్వర్ణోత్సవ సంచిక ప్రకటింపబడినది. ఈ భాషానిలయ స్థాపకులం దొకరైన మునగాల రాజా గారే రజతోత్సవ, స్వర్ణోత్సవములకు ఆహ్వాన సంఘాధ్యడు లుగా నుండు గౌరవమును పొందిరి. భాషానిలయ స్థాపన కాలమునుండి ఈనాటివరకును దానికి సేవచేయుచున్న ముదివగ్గు లిరువురు. ఒకరు శ్రీ మాడపాటి హనుమంత రావుగారు; రెండవవారు శ్రీ ఆదిరాజు వీరభద్రరావుగారు. ఈ ఇరువురు చేసిన సేవ అపారము. ఈ భాషానిలయము అభ్యుదయాత్మకముగ పురోగ మించుచున్నది. సంచారశాఖ యొకటి బయలు దేరిఇండ్లకు పోయి గ్రంథము లియబడుచున్నవి. పిల్లల కొరకొక ప్రత్యేక శాఖ తెరువబడినది. శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ వడ్లకొండ నరసింహారావు గారల చిత్రపటావిష్కరణములు జరిగినవి. మైక్రోఫోను వంటి పరికరములు సమకూరినవి. కార్డు ఇండెక్సు సిద్ధము చేయబడి గ్రంథాలయము ఇటీవల నవీన పద్ధతులపై నడప బడుచున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మవతరించినప్పటి నుండి (1956) ఆంధ్రప్రదేశ రాజధానియగు హైదరాబాదులోని సారస్వత సాంస్కృతిక సమావేశములకు భాషానిలయము కేంద్రమైనది. 1-4-58 నుండి 81-8-59 నాటి. నివేదికా కాలమునాటికి భాషానిలయ సభ్యుల సంఖ్య 420. గ్రంథ సంఖ్య 9958. భాషానిలయమునకు వచ్చు పత్రికల సంఖ్య 40. సగటున
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/846
స్వరూపం