విజ్ఞానకోశము పరాక్రమముచూపి రాయచూరు దుర్గమును స్వాధీనపరచు కొనెను. ఇస్మాయిల్ ఆదిల్ షా పలాయనమంత్రము పఠించి ప్రాణములను రక్షించుకొ నేను. ఈ రాయచూరు యుద్ధము చరిత్రాత్మకమయినట్టిది, రాయలవారి యుద్ధతంత్ర విశార దత్వమును, నిర్వహణదక్షతను వెల్లడిచేయునట్టిది. భారత రామాయణీయ యుద్ధములను బోలినట్టిది. శత్రువుల కీతని పేరు వినగానే గుండె జల్లనునట్టు చేసినట్టిది. హిందూదేశ మంతటను కృష్ణదేవరాయలవారి కీర్తి ప్రసరించునట్లు చేసినది రాయచూరు యుద్ధమే. పిమ్మట రాయలు సైన్యముతో గుల్బర్గాపై దండెత్తి కోటను కూల్చి, ఫిరోజాబాదు. సాగర్ దుర్గములను వశ పరచుకొని బీజాపూరును ముట్టడించి దానిని ధ్వంసము చేసెను. గుల్బర్గాలో “మహమ్మదు II బహమనీ" యొక్క ప్రథమ పుత్రుని నిలిపి మిగిలిన ఇద్దరు పుత్రులను విజయ నగరమందు గౌరవ మర్యాదలతో నుంచుకొనెను. ఇస్మాయిల్ ఆదిల్షా సంధి సూత్రములను అక్ష్యము చేయక మరల రాయచూరును ముట్టడింప యత్నించెను. కానీ రాయలు యుద్ధ సన్నద్ధుడై వచ్చుచున్నాడను విష యము తెలిసి కోట విడిచిపారిపోయెను. ఆదిల్ యొ దుర్నయమునకు తగిన గుణపాఠము చెప్పుటకై, బెల్గాముపై దండయాత్రచేయ యత్నించుచున్న రాయలు రోగ గ్రస్తుడై క్రీ.శ. 1530 సంవత్సరారంభమున దివంగతుడయ్యెను. రాయలకు మువ్వురు భార్యలు. వారు తిరుమలా దేవి (పట్టమహిషి), అన్నపూర్ణాదేవి, చిన్నా దేవి అనువారలు. వీరుకాక రాయలకింకను తొమ్మిదిమంది భార్యలుండిరట. రాయలకిద్దరు కుమారులు, ఇద్దరు కొమారితలుండిరి. పెద్ద కొమరిత తిరుమలాంబను అళియ రామరాయలకును, రెండవ కొమరిత 'వేంగళాంబను తిరుమల రాయలకును ఇచ్చి వివాహమొనర్చెను. రాయల కాలమున విజయనగరము విద్యానగరమై సర్వసౌఖ్య విలాసములకు ఆవాసమయ్యేను. రాయలు తన పట్టాభిషేకానంతరము విరూపాక్ష దేవాలయ గోపు రము, రంగమండపము నిర్మింపించెను. ఉదయగిరి దుర్గ విజయానంతరము కృష్ణస్వామ్యాలయమును (1518) హజార రామాలయమును కట్టించెను. అటుపిమ్మట తన తల్లి పేర నాగలాపురమును కట్టించెను. కృష్ణరాయలు 789 కృష్ణదేవరాయలు శిల్పకళానిలయముగా విఠోబా దేవాలయమును నిర్మింప దొడగెను. ఆ నిర్మాణము సదాశివరాయల కాలమువరకు సాగుచుండెనట! నాగలాపురమునకు ఈశాన్యముగా నొక విశాలమైన రాజమార్గమును కమలాపురము గుండా విజయనగర రాజమందిరమువరకు వేయించెను. ఇతడు నాగలాపుర ప్రాంతమున అనంతశయనాలయము, అష్ట కోణాకృతి విరాజితమయిన ఒక మహలు, మజ్జనళాల ఏర్పరచెను. గజపతుల నోడించినతరువాత 'భువనవిజయ' మందిరము గట్టించెను, దీనిని 'దసరాదిబ్బ'అవియు నందురు. రాణివాస మందిరములను, మంత్రాలోచనా మందిరము లను, గజశాలలను, ఏకశిలయందు ఉగ్ర నరసింహస్వామి విగ్రహమును (1528) నగరలక్ష్మికి ఆభరణములుగా నుండు నట్లు నిర్మించెను. ఈ నిర్మాణములందెల్ల రాయల శిల్పకళా పోషణ ప్రీతి సువ్య క్తమగుచున్నది. సామ్రాజ్యమున రాయలు సర్వస్వతంత్రుడై యుండెను. రాయలకు ప్రధానామాత్యుడు తిమ్మరుసు. విజయనగర రాజ్య భారమంతయు తిమ్మరుసు మహామంత్రి చాకచక్య ముతో నిర్వహించుచు రాజుచేత తండ్రివలె గౌరవింప బడుచు, 'అప్పాజీ' అని పిలిపించుకొనుచుండె ననియు, అమరవాయకులందరు అతని కనుసన్నల మెలగుచుండి రనియు తెలియుచున్నది. తిమ్మరుసు రాయలకు మహా మంత్రియై యుండుటయే గాక, పిన్ననాటి నుండియు రాయల ప్రాణరథకుడునై యుండెను. ఇతడు గాక ఇంకొక ఉపప్రధానియు, ఒక ఖాండాగారాధ్యక్షుడును ఒక ధర్మాసనాధికారియు మంత్రులుగా నుండిరని రాయ వాచకము తెలుపుచున్నది. మంత్రులతోపాటు రాజకార్య ములను చక్క బెట్టుటకై ఒక రాజసభ (కార్యనిర్వాహక సభ) ఉండెడిది. ఇది యొక రాజనభ, ఈ సభా భవన నామము 'భువన విజయము'. ఈసభకు అమరనాయకులు, జీతముపైనున్న నాయకులు, ఉద్యోగులు, సామంతులు, ప్రభువులు, సేనాపతులు, వర్తకులు, రాయకారులు, పండితులు, కవులు, తత్వజ్ఞులు, వివిధ మతాధికారులు హాజరయ్యేడి వారు. శ్రీకృష్ణదేవరాయలవారు వ్యవసాయాభివృద్ధికై ‘కొఱ్ఱ గలు' వద్ద తుంగభద్రా నదిపై ఆనకట్ట (1521) కట్టించేను. అందుండి కొఱకాలువ, బసవన్న కాలువ- అను రెండు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/842
స్వరూపం