కృష్ణదేవరాయలు పరగణాకు సాళువ గోవింద రాజును ముఖ్య పరిపాలకునిగా నియమించెను. ఈతని క్రింద ముగ్గురు ప్రాంతీయ పాలకులు నియమింపబడిరి. పిమ్మట రాయలు కూర్గు, మళయాళ దేశములను స్వయ ముగ జయించెను. రాయల పక్షమున విజయప్ప, వెంకటప్ప అను నాయకులు పాండ్య, చోళ, చేర దేశములను జయించిరి. ఆ యా దేశముల వారియవలసిన కప్పములు నిర్ధారణ పూర్వకముగా కట్టుదిట్టము లోవర్చి జయింప బడిన ఈ దక్షిణ దేశమును మూడు భాగములుగా చేసి, వాటియందు కృష్ణప్ప - విజయ రాఘవ - వెంకప్ప నాయ కులను నీల్చి, రాయలు రాజధానికి తిరిగివచ్చెను. ఉదయగిరి నేలు ప్రతాపరుద్ర గజపతిపై రాయలు క్రీ. శ. 1513 లో దాడివెడలి, అతనితో పదు నెనిమిది మాసములు ప్రచండముగ పోరి దుర్భేద్యమైన ఉదయగిరి దుర్గమును వశపరచుకో నేను. ఉదయగిరిలోని కోట వల్లభ రాయనికి రాయలు శా. శ. 1436 వ సంవత్సరమునకు సరియగు భావనామ సంవత్సర జ్యేష్ఠ బ॥ దశమినా డొక గ్రామము దానమిచ్చినట్లు శాసనము వేయించెను. (క్రీ.శ.. 1514) ఉదయగిరి కోటలో దొరకిన కృష్ణ విగ్రహమును తనవెంట గొనిపోయి ఆ సంవత్సరమందే హంపిలో పెద్ద దేవాలయమును కట్టించి అందా కృష్ణ విగ్రహమును ప్రతిష్ఠించెను. రాయలు కందుకూరును జయించి త్రోవలో తిరుపతి వేంక టేశ్వరస్వామిని దర్శించి 30 వేల వరహాలతో కనకాభి షేకము గావించి నిత్యదీపనై వేద్యములకై తాళ్ళపాక గ్రామమును దాన మొనర్చినట్లు 6-7-1614 వ తేదీన వేసిన శాసనము తెలుపుచున్నది. ఈతని వెంట వచ్చిన దేవేరులు తిరుమలదేవియు, చిన్నమాంబయు నిత్యనై వే ద్యమునకై గుడియారు, పిరాటిక లత్తూరు అమ గ్రామ ములను దానము చేసిరి. ఈకాలముననే రాయలవారు. హంవీలో హజార రామస్వామి దేవళమును కట్టించిరి. కృష్ణరాయలు అంతటితో ఆగక ఉత్తర దిగ్విజయ యాత్రకై బయలుదేరి త్రోవలో కనిగిరి, కందుకూరు కోటలను జయించి, వీర రుద్రగజపతిని సపరివారముగ బంధించి రాజధానికి పంపెను. ఆశాలమున అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగేడు, 'కేతవరము' మొదలైన దుర్గములకెల్ల కొండవీడు కూడలి సంగ్రహ ఆంధ్ర స్థలముగా నుండెను. అద్దంకి నుండి కోటలన్నిటిని రాయలు జయించుటలో గజపతుల సైన్యమునకు ఒక కొండవీడే గతియైనది. రాయలు కొండవీటిని నెలల తరబడి ముట్టడి వేసి చిట్టచివరకు ఆకోటను సాధించెను. గజపతిని సకుటుం ఐముగా బంధించి కోటను సాళువ తిమ్మరుసు పాలన క్రింద నుంచేను. తరువాత రాయలు రాణులతో అమరావతిని, శ్రీశైలమును, ఆహోబిలమును దర్శించి తిరిగి కొండ పల్లిపై నడచెను. మధ్య అడ్డుపడ్డ ప్రతాపరుద్ర గజపతిని మరల నోడించి రెండు నెలలు ముట్టడిచేసి దురాపమగు కొండపల్లిని వశపరచుకో నేను (1515). 788 అటుతరువాత రాయలవారికి కళింగముపై దృష్టి మరలేను. రాయలవారు విజయవాటిక వద్ద ఆంధ్ర శ్రీవిష్ణువును దర్శించి, ఉత్తరముగా పయనించి, రాజు మహేంద్రవరము నాక్రమించి, విజయ పరంపరలతో పొట్నూరు చేరి, అచ్చట విజయ స్తంభము నాటించెను. (1516). కళింగరాజధానియగు కటకమువరకును రాయల సైన్యము నడచినది కాని గజపతి రాయలతో సంధిచేసికొని కుమార్తెయగు అన్నపూర్ణాదేవిని అతని కిచ్చి వివాహము చేసి లొంగిపోవుటచే అతనిపై రాయలు దయదాల్చి కృష్ణా నదికి ఉత్తరమున నున్న ప్రాంతమంతయు అతనికి వదలి వేసెను. పేరెన్నికగన్న ఈ దండయాత్ర 1517 జనవరి 2 వ తేదీతో ముగిసెనని శాసనమువలన తెలియుచున్నది. తరువాత రాయలు దక్షిణ ఆర్కాటు జిల్లాలోని కాటూరు కోటను స్వాధీన మొనర్చుకొనెను. కృష్ణదేవరాయలు కళింగ యుద్ధమున నిమగ్నుడై యుండగా బిజాపూరు పాలకుడగు ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూరు దుర్గమును మరల ఆక్రమించుకొ నేను. రాయలు పదిలక్షల కాల్బలముతో, 500 గజబలముతో క్రీ. శ. 1520 లో రాయచూరుపై దండు వెడ లేనట. ఇస్మాయిల్' ఆదిల్ షా అశ్వపై న్యముతో కృష్ణానదిని దాటి ఐదుమైళ్ళు వచ్చి రాయచూరునకు తూర్పున విడిసియున్న రాయల సైన్యమును 1520 సం. మే 19 వ తేదీనాడు డీకొనెను. ఇస్మాయిల్ అదిల్ షా యుద్ధములో ఓడిపో యెను. రాయలాతనిని రాయచూరు కోటవరకు తరిమి వేసెను. అచ్చట ఫిరంగీదళములో ఆ సుల్తాను రాయల సైన్యమును చిక్కువరచు చుండగా రాయలు అప్రతిహత
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/841
స్వరూపం