Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/828

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ భామ వేషమందు ప్రసిద్ధులైన పురుషులు కూడ కలరు. కూచిపూడివారివలెనే పిచ్చుకకుంట్లలో కూడ అందరును పురుషులే యగుట ఇంకొక విశేషము. ఇంక రాజాశ్ర యాదులు లేని దేవదాసీ - రాజనర్తకీ సంప్రదాయముల వారు క్రమముగా దిగజారీ బజారులలో మేజువాణీలకు దిగినారు. ఈ మేళముల వారికి ప్రత్యేక శిక్షణ మేమియును అక్కరలేదు. అట్టివారిని పిలిపించి, తైతక్కలాడించి, ఆనందించి, వారినికూడ అనుభవించెడి సరసులు ఎక్కువై నారు. దీనితో ఈ కథ పతనమైనది. కథాకళి : తెలుగు దేశమునకు కూచిపూడి నాట్యకళ యెట్టిదో మళయాళ దేశమునకు కథాకళి అట్టిది. ఇది కూచిపూడివారి నృత్యనాటకములను పోలినది. కానీ, ఇందు నటులు వాచికాభినయమును పరిహరించుటచే తెలుగు నృత్యనాటకములవలె ఇది సమగ్ర నృత్యకళ కాదు. ఈ కథాకళి నాట్యమునకు క్రీ. శ. 1575-1650 నాటివాడగు కొత్తరక్కరరాజు మూలపురుషుడని తెలియుచున్నది. ఇతడు. వాగ్గేయకారుడే కాక నృత్య విద్యా నిపుణుడు కూడను. క్రీ. శ. 1503-1509 ప్రాంత మున విజయనగరములో ప్రదర్శనములిచ్చిన కూచిపూడి వారు తరువాతి కాలములో మలయాళ దేశమును కూడ సందర్శించి ప్రదర్శనము లిచ్చినట్లు ఆధారములు కలవు. కూచిపూడివారి నాట్యకళ ప్రేరకముకాగా, ముందే దేశమందున్న 'కుడియాట్టమ్' ను సంస్కరించి ఆయన వేటి కథాకళికి రూపులుదిద్దెను. అంతకు దక్షిణదేశమునకు వలస : క్రీ. శ. 1565 లో జరిగిన తల్లి కోట యుద్ధానంతరము విజయనగర సామ్రాజ్యము ఛిన్నాభిన్నమైనది. అదే సమయములో తంజావూరు నాయక రాజులు బలపడినారు. క్రమముగా విజయనగర సామ్రాజ్య వైభవము తంజావూరులో నెలకొనెను. లలిత కళలన్నింటికిని అది ఆటపట్టయినది. రఘునాథ నాయకుడు (క్రీ.శ. 1814-88) స్వయముగా విద్వత్కవియై, నాట్య- సంగీత వేత్తయై, కవి పండిత గాయక నర్తక పోషకుడై రెండవ కృష్ణదేవరాయలనిపించుకొనెను. ఈ రఘునాథ నాయకుని తండ్రియగు అచ్యుతప్ప నాయకుని కాలము (క్రీ.శ. 1581-1814) లో కళలకు పట్టుగొమ్మలైన కొన్ని వందల కుటుంబములు రాజాశ్రయము నర్థించి తెలుగు 775 . కూచిపూడి నాట్యము దేశమునుండి తంజావూరునకు వలసపోయేను. అందులో కూచిపూడివారు, దేవదాసీ - రాజనర్తకీ సంప్రదాయము లకు చెందినవారు కూడ కలరు. ఊత్తుక్కాడు అను చోట మేలట్టూరు వేంకటరామశాస్త్రిగారి భాగవత మేళ నాటకములకు ముందు భామకలాపమును ప్రదర్శించేడి వారట; వలసవచ్చిన కూచిపూడివారి సంప్రదాయమే అది. విజయ రాఘవుని ఆస్థానకవయిత్రియును, నర్త కీయునుఅగు కృష్ణాజీ (కృష్ణమాంబ) గుంటూరు ప్రాంతములనుండి వలస వచ్చిన రావినూతుల తిరుమలయ్యకునూర్తెయట. మన్నారు దాసవిలాస నాటక రచయిత్రియగు పసుపులేటి రంగా జమ్మయును ఇట్లు వలసవచ్చిన కుటుంబములలోనిదే. రఘునాథనాయకుని ఆస్థాన నర్తకియగు ముద్దు చంద్ర రేఖ వీరవెంకటపతి రాయలచే సన్మానింపబడిన బిరుదు పాత్రయట. మువ్వ గ్రామవాసియును ఆంధ్రవాగ్గేయ కారుడును అయిన క్షేత్రయ్య విజయరాఘవుని ఆస్థాన ములో నుండెననుట ప్రసిద్ధమే. వాగ్గేయకారు లగు నారాయణ తీర్ధులును, త్యాగరాజును పదహారణాల ఆంధ్రులు. మేలట్టూరు భాగవత మేళములకు పితామహు డైన వేంకటరామ శాస్త్రీయును ఆంధ్రుడేయని విశ్వసింప బడుచున్నది. మేలట్టూరు భాగవత మేళములు : ఇట్లు తెలుగు దేశమునుండి వలసవచ్చిన కుటుంబముల నాదరించి కళా పోషకుడగు అచ్యుతప్ప నాయకుడు 'అచ్యుతపుర' మనెడి గ్రామమును వారికి అగ్రహారముగా నొసంగెను. అదియే నేటి మేట్టూరు. నట్టువ, నాట్యమేళములవారి కొసంగ బడినదగుటచేతనే ఆగ్రామమునకు (మేలట్టూరు) అను పేరు వచ్చినది. కూచిపూడివారి నాట్యము ప్రేరకము కాగా . వేంకటరామశాస్త్రి తెలుగు భాషలో 12 నృత్య నాట కములను రచించెను. అవి దైవోత్సవములందు ప్రదర్శింప బడుటకే ఉద్దిష్టములైనవి; వానిని ప్రదర్శించువారు భాగ వతులనబడిరి. కాగా ఇవి 'భాగవత మేళానాటకము' లని ప్రసిద్ధి నందినవి. వీనిని మేలట్టూరునందే కాక, శూలమంగ ళము, ఊత్తుక్కాడు, కుటనూరు, నల్లూరులలో కూడ చిరకాలమునుండియు ప్రదర్శించుచున్నారు. భరతనాట్యము :- ఇంక తంజావూరు రాజాస్థానముల నాక్రమించిన నర్తకీమణుల ఏకపాత్రాభినయము ఇంకొక