కూచిపూడి నాట్యము శతాబ్దిలో నుండెనని కొందరు కొందరు విమర్శకులు సిద్ధాంతీకరించియున్నారు. కాని అది విశ్వసనీయముగా కన్పట్టదు. మెకంజీ సేకరణములలోని మాచుపల్లి కైఫీ యత్తునుబట్టి క్రిందివిషయములు తెలియుచున్నవి : శ్రీకృష్ణ దేవరాయల సవతి అన్నగారైన వీరనరసింహ రాయలు (క్రీ. శ. 1508.1509) విజయనగర సామ్రాజ్య మును పాలించుచున్న కాలములో సంబెట గురవరాజను సామంతుడొకడు కలడు. కూచిపూడి బ్రాహ్మణ భాగవతులు సంచారము చేయుచు ఒకసారి గురవరాజు ఆస్థానమునకు పచ్చిరి. కాని, గురవరాజు శిస్తు వసూలు సమయములో ప్రజలను భయ పెట్టుటకై స్త్రీల స్తనములకు చిరుతలు పట్టిం చుట మొదలగు అతిదారుణమైన శిక్షలు విధించుచుండేడి వాడట. కూచిపూడి బ్రాహ్మణ భాగవతులు అదిచూచి ఏవగించుకొని, అచ్చటినుండి విజయనగరము వచ్చి తమ కేళికా ప్రదర్శనమునకు అనుమతి నీయవలయునని రాయ లను వేడిరి. కూచిపూడి మేళమువారు చారి విద్యావంతు లని ప్రసిద్ధి కెక్కియుండుటచేత రాయలు స్త్రీలు కూడ చూడవలెననెడి ఆళయముతో నగరులో కేళికను ప్రదర్శింప జేసెను. కేళికా ప్రదర్శన సమయములో, ఒక అవాంతర ఘట్టముగా, గురవరాజు చరిత్రను వారు ప్రదర్శించిరి. రాయలవారు వివరములడిగి తెలిసికొని గురవరాజు అకృత్యమునకు చాల కోపముచెందిరి. పిమ్మట కేళిక పూర్తి అగువరకును ఉండి, మరునాడు గురవరాజును శిక్షించుటకు తమ సేనానిని పంపిరి. అతడు గురవరాజు కోటను నాశనములేని వానితలను కొట్టి తెచ్చెను. దీనినిబట్టి క్రీ. శ. 1500 నాటికే కూచిపూడి బ్రాహ్మణ భాగవతులు సుప్రసిద్ధులై నారనియు, వారి మేళ మొకటి దూర దేశములందు సంచారము చేయుచు కేళికా ప్రదర్శ నముల నొసంగుచుండెననియు స్పష్టమగుచున్నది. సిద్ధేం ద్రుని శిక్షణములో థామకలావమునే ప్రప్రథమముగా నేర్చియున్న కూచిపూడి భాగవతు లానాడు వీరనరసింహ రాయల యెదుట ప్రదర్శించిన కేళిక సుప్రసిద్ధమైన 'కామకలాపమే' అని విశ్వసింపవచ్చుచున్నను. అయినచో సిద్ధేంద్రుడు విధిగా క్రీ. శ. 1500 నాటికి పూర్వుడ గును ; అనగా క్రీ. శ. 14 వ శతాబ్దికో, లేదా 18వ శతాబ్దికో చెందినవాడగును. సంగ్రహ ఆంధ్ర భామకలావము : సిద్ధేంద్రుని కామకలాపము నృత్యకళ పరమకోటినిపొందిన అపూర్వసృష్టి; వడపట్టిన యలంకార భరతశాస్త్రములు, కవిసామ్రాట్ విశ్వనాథ వారు పేర్కొ న్నట్లుగా సత్యభామయే శృంగారరస సర్వస్వమున కాలం బన మని తెలిసినవారు సృష్టిలో ముగ్గురన్న ముగ్గురే--- మొదటివాడు శ్రీకృష్ణదేవుడు, రెండవవారు తెలుగుక వి నందితిమ్మన (పారిజాతాపహరణకర్త); మూడవవారు సిద్ధేంద్రయోగి (కామకలాపస్రష్ట). థామక లోపమందలి కథ నిమిత్తమాత్రము ; నిజమునకు కృష్ణదేవునకుగాని, రుక్మిణి లేదా రాధకు గాని ప్రాముఖ్యములేదు. ఇంక ఇది ఆద్యంతమును ప్రణయకలహకుపితుడగు భర్తకు దూరమైన సత్యభామా విరహాభినయమే. ఈ విప్రలంభ శృంగారాభినయమందు అష్టవిధ నాయికా భేదములు, తత్తదవస్థా భేదములు, ధీరాధీరాది భేదములు, దశవిధ కామావస్థలు, దళవిధ లాస్యాంగములు, స్త్రీలకు సహ జములైన అంగజ . స్వభావజ - ఆయత్నజ వికారములు మొదలగువానితో హడిన అలంకారశాస్త్ర సర్వస్వమును నృత్య-గాన వాద్యములతో సమన్వయమగుచున్నది. ఈ అభినయము నంతటిని భామ ఒక్క తెయే చేయును. అలంకారశాస్త్రమును, చతుర్విధాభివయములును, సంగీత మును సమానములగు పాళ్ళలో మేళవింపబడిన భామ కలాపము ఏక పాత్రాభినయమునకు ఉత్తమనిదర్శనము. ఇదిఅంతయును లాస్యాభినయ మనియు, ఇందు తాండవ మునకు స్థానము లేదనియు మరచిపోరాదు. 772 P ఒకనాడు సత్యాకృష్ణులు మాటాడుకొనుచుండగా ఇరువురిలో ఎవరు ఎక్కువ సౌందర్యవంతులనెడి ప్రశ్న కలిగెను, నేనే ఎక్కువ సౌందర్యవంతురాలను అని ముందు ఆలోచన లేక యే సత్య సగర్వముగా పలికెను. అది కృష్ణునకు కోపకారణమయ్యేను. అంతట ఆతడు దిగ్గున లేచి వెడలిపోయెను. అప్పుడు ఆమెకు తన తప్పిదము తెలిసెను. విరహార్తయై విలపించును. చివరకు విరహ బాధను భరింపలేక దూతిని స్వామి సన్నిధికి రాయకార మంపును. ఎట్టకేలకు కృష్ణుడు రుక్మిణీ లేదా రాధా సహితుడై వచ్చును. అది మరల సత్యకు అసూయా కారణ మయ్యెను. అప్పుడా ఇరువురి మధ్యను సుప్రసిద్ధ మైన సవతుల కయ్యము సాగుమ. చివరకు కృష్ణుడు సత్యను
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/825
స్వరూపం