Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుళోత్తుంగ చోళదేవుడు చోడులను తనకు మిత్రులను కావించుకొనెను. వీరు తెనుగు సీమయందు చోళుల అధికారమునకు విశ్వాస ముతో తోడ్పాటు కావించిరి. కుళోత్తుంగునకు పశ్చిమ చాళుక్య రాజగు ఆరవ విక్రమాదిత్యుడు ప్రజల విరోధిగ నుండెను. విక్రమాదిత్యుని ప్రోత్సాహమువలన సింహళ ప్రభువగు విజయబాహుడు స్వాతంత్ర్యమును ప్రకటించు కొనెను. ఇంతవరకును సింహళ ప్రభువులు చోళులకు సామంతులుగ నుండుచు వచ్చిరి. కులోత్తుంగుని రాజ్యావ సాన కాలమున మైసూరు రాజ్యములోని కొంతభాగ మును హొయసలులు ఆక్రమించిరి. ఈ విధముగ కూడ చోళరాజ్యము నష్టపడేను. అయినను కులోత్తుంగుడు చోళరాజ్య గౌరవమును చక్కగా కాపాడినట్లు భావింప వచ్చును. ఈరాజు సాధ్యమైనంత వరకు యుద్ధములనుండి తప్పించుకొని, రాజ్యమున శాంతిని స్థాపించి, ప్రజా క్షేమము నకై పాటుపడెను. కులోత్తుంగుడు క్రీ. శ. 1070 నుండి 1118 వరకును వైభవముతో పరిపాలనము కావించెను. చోళరాజ్యము నందు చిరకాలమునుండి అమలులో నున్న ఆచారము ప్రకారము ఈరాజు క్రీ. శ. 1088వ సంవత్సరమున రాజ్య మందు వ్యవసాయము చేయబడుచున్న భూమిని కొలిపించి న్యాయసమ్మతమగు పన్నులను విధింపించెను. కాలాను గుణముగ పన్నులను మార్చుట ఆకాలమున పరిపాటిగ నుండెను. ఈరాజు విజ్ఞానప్రియుడు, జయం కొండ వే అను కవి కులోత్తుంగుని ఆస్థానకవిగ నుండెను. ఆస్థానక వికీ చోళరాజ్యమున 'కవిచక్రవర్తి' వ్యవహార ముండెడిది. ఈకవి సుప్రసిద్ధమగు 'కళింగత్తుప్పరణి' అను కావ్యమును రచించెను. విఖ్యాత తమిళ గ్రంథమగు "శిలప్పాధికారం" అను గ్రంథమునకు వ్యాఖ్యానము రచించిన యారుక్కు నల్లర్ " అను పండితుడు జయకొండన్ కు సమ కాలికుడుగ కానవచ్చుచున్నాడు. పెరియ పురాణమును రచించిన "సెక్కిలార్" అను శైవవిద్వాంసుడుకూడ 1 సంగ్రహ ఆంధ్ర కులోత్తుంగుని ఆస్థానమున నివసించెను. కులోత్తుంగుడు మొదటినుండియు తమిళ దేశముననే నివసించినందున ఇతనికి ద్రావిడ భాషమీదనే అభిమానము మెండుగ నుండెను. తండ్రియగు చాళుక్య రాజరాజనరేంద్రుడు పోషించినట్లు ఇతడు ఆంధ్రభాషను పోషింపలేదు. విశిష్టా ద్వైత మతస్థాపకుడగు శ్రీరామానుజాచార్యుడు కులో త్తుంగునకు సమకాలికుడు. కాని కులోత్తుంగునకు విశిష్టా ద్వైతముపై అభిమానము లేని కారణమున శ్రీ రామా నుజుడు చోళమండలమును వీడి, హోయసల రాజ్యమునకు వెడలిపోవలసి వచ్చెను. కులోత్తుంగుని బిరుదులు శాసనముల నుండియు, 'కళింగత్తుప్పరణి' అను కావ్యము నుండియు తెలియవచ్చు చున్నవి. అవి రాజు కేసరి, త్రిభువన చక్రవర్తి. సర్వ లోకాశ్రయ, విష్ణువర్ధన, పరాంతక, పెర్మానడిగలు, విక్రమచోళ, కులశేఖర, పాండ్యకులాంతక, విరుద రాజ భయంకర, అకలంక, అభయ, జయధర మున్నగునవి. ఈ ప్రభువు కాలమున గంగాపురి యనబడు గంగై కొండ చోళ పురము చోళ రాజధానిగా నుండెను. కాంచీపురమున పెక్కు రాజభవనములును, అభిషేక మండపమును ఉండుచు వచ్చెను. కులోత్తుంగ చోళునకు మువ్వురు రాణు లుండిరి. వీరు దిన చింతామణి (బహువిధముల ఈమె మధురాంతక దేవి కావచ్చును) ఏళిళై వల్లభి, త్యాగపల్లి అనువారలు. కులోత్తుంగునికి కుందాపై, మధురాంతకి అను తోబుట్టువు లుండిరి. ఈతని కుమార్తెలగు రాజసుందరి, సూర్యవల్లి అనువారలు కళింగ సింహళ రాజకుమారులకు క్రమముగ రాణులైరి. క్రీ.శ. ఈ ప్రభువు వీరుడును, మహా సమర్థుడును అయిన శ. 1118 వ సంవత్సరమున దివంగతుడయ్యెను. ఈతని అనంతరము చోళ రాజ్యశోభ క్రమముగ ఓణించెను. వి.య. 768