కులోత్తుంగ చోళదేవుడు ణములు ప్రవేశ పెట్టుటకు పూనుకొనిరి. కాని విచిత్ర మేమన, ఈ సంస్కరణోద్యమములలో అధిక భాగము ఒకప్పుడో లేక మరి యొకప్పుడో తమతమ కులవర్ల వ్యవస్థా చట్రములోని కే తిరిగి తిరోగమించినవి. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కులము వ్రేళ్ళూని స్థిరపడిపోవుటయే, ఈ విచిత్ర పరిణామమునకు కారణము. ఇటీవల కొలది సంవత్సరములలో కుల వ్యవస్థను గూర్చి పెక్కురు పెక్కు పరిశోధనములు చేసిరి. ఈనాడు శక్తి సంపన్నమైన కులవ్యవస్థ రెండు ప్రమాణముల (levels) పై ఆధారపడి వ్యవహరించుచున్నది. (1) మంత్ర బద్ధమగు కర్మకాండ ప్రమాణము (Level of ritual); (2) సిద్ధాంతశాస్త్ర ప్రమాణము (Level of ideology). కులమునకు సంబంధించిన ఆచార కర్మకాండ ప్రాచీన మును, సంప్రదాయ బద్దమును కాగా, సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనములకు ఉపయోగపడు కులవ్యవస్థ బలీయమైనట్టియు, ప్రధానమైనట్టియు సిద్ధాంతముగ పరిణమించెను. నాగరక (urban), పారిశ్రామిక (industrial) ప్రభావములు కులవర్ణ విధానముపై పనిచేయుచుండెను. కులవ్యవస్థ కొరకై విధింపబడిన ఆచార కర్మకాండ ఈనాడు క్రమముగా క్షీణించుచున్న దని చెప్పవచ్చును. కానీ, ఈనాటి పార్లమెంటరీ ప్రజా స్వామిక దశయందు, లౌకిక వ్యవహారములలో సిద్ధాంత శాస్త్రము (ideology) అను పేరుక్రింద, కులము క్రొం క్రొత్త బలమును పుంజుకొనినది. ప్రాచీన కులధర్మములు, విధులు, కట్టుబాటులు చాలవరకు పరివర్తనము చెందినవి. కాని ఈవర్ణ వ్యవస్థ యను చట్రములో కుల నిర్మాణ మందు ఒక విధమైన వర్గచైతన్యము (class conscious- ness) క్రమముగా ప్రవేశము కల్గించుకొనినది. _కులోత్తుంగ చోళదేవుడు : స. ప్ర. ఈ చోళ చక్రవర్తులు మున్నూట ఏబది సంవత్సరములు (క్రీ.శ. 850-1200) దక్షిణాపథమును పాలించిరి. వంశమునకు మూలపురుషుడు విజయాలయుడు. చోళ చక్రవర్తుల రాజధాని తంజావూరు నగరము. కులోత్తుంగ చోళుని తండ్రి తూర్పు చాళుక్య ప్రభువును, విమలాదిత్య తనూజుడును, ఆంధ్ర మహాభారత కృతిభర్తయునగు రాజ సంగ్రహ ఆంధ్ర ప్రభు రాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుని తల్లి చోళ నగు రాజరాజు యొక్క కుమార్తె. ఆమె పేరు కుంద వాంబ. రాజరాజ చోకుని కుమారుడు రాజేంద్రచోళుడు. చాళుక్య రాజరాజ నరేంద్రున కాతడు మేనమామ. రాజరాజ నరేంద్రుడు తన మేనమామ కుమార్తెయగు అమ్మంగ దేవిని ఉద్వాహము కావించుకొనెను. ఈదంపతుల పుత్రుడే రాజేంద్రచోళుడు. అత్తవారి యెడల అభిమాన ముచే చాళుక్య రాజరాజ నరేంద్రుడు తన కుమారునకు తన మామగారి పేరు పెట్టుకొనెను. చాళుక్య రాజేంద్ర చోళుడు తన మేనమామ రెండవ రాజేంద్ర చోళుని బిడ్డ యగు మధురాంతక దేవిని వివాహ మాడెను. ఈవిధముగ తూర్పు చాళుక్య రాజులలో మూడు తరములవారు చోళ రాజకన్యకల పరిణయ మాడుట ఒక విశేషాంశము. 766 చాళుక్య రాజేంద్ర చోళ దేవుని మామయు, చోళ సామ్రాజ్యమున కధిపతియునగు రెండవ రాజేంద్ర చోళు నకు పురుష సంతతి లేదు. చాళుక్య రాజేంద్ర చోళుడు చోళవంశమువారి దౌహిత్రుడు. కావున చోళరాజ్య మునకు వారసుడగుటకు ఇతడు జతనములు చేయసాగేను. ఈతడు తన బాల్యమును మాతామహస్థానమగు చోళ రాజ్యమునందే గడపెను. ఈతని మాతామహియు, గంగై కొండ చోళుని భార్యయునగు రాజమహిషి రాజేంద్రచోళుని యందు మిక్కిలి అభిమానమును చూపుచుండెను. ఇతడు చక్రవర్తి లక్షణ సమన్వితుడనియు, ఉభయ వంశోద్ధార కుడు (చోళ చాళుక్య వంశములు) కాగలడనియు ఆమె పలుకుచుండెడిదట. ఈవిషయము "కళింగత్తుప్పరణి" అను గ్రంథమునందు తెలుపబడినది. ఈ రాకుమారునకు సైతృక రాజ్యమగు వేగిదేశమునందుకంటే మాతామహరాజ్య మగు చోళరాజ్యమునందే ఎక్కుడు అభిమానము. ఇది ఇట్లుండగా క్రీ.శ. 1061 వ సంవత్సరమున రాజేంద్ర చోళుని తండ్రియగు చాళుక్య రాజరాజనరేంద్రుడు మర ణించెను. తండ్రి అనంతరము రాజేంద్రచోళుడు వేగి రాజ్యమునకు అధిపతి కావలసియుండెను. కాని అట్లు సంభవింపలేదు. రాజరాజనరేంద్రుని సోదరుడు విజయా దిత్యుడు వేగిరాజ్యమునకు అభిషిక్తుడయ్యెను. ఆకాల ) మున చోళరాజ్యమును పాలించుచున్న వీర రాజేంద్రుడు విజయాదిత్యునియెడ అభిమానమును పూని, ఆతనిని వేగి
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/819
స్వరూపం