విజ్ఞానకోశము - సంహిత, నారద, విష్ణుపరాశరసంహితలు, రఘునందన, నాగభట్టు విరచిత గ్రంథములు మున్నగునవి పేర్కొన నగును. కుల వర్ణములకు తెగ, జాతి మూలకందమని రిస్లీ ప్రభృతులు అంగీకరించిరి. విభిన్న జాతులనడుమ కలుగుచు వచ్చిన సంఘర్షణములు, సంపర్కముల వలననే, కుల వర్ణము లేర్పడినవని వారు విశ్వసించిరి. అనగా, వారు ఆర్య - ద్రావిడ సంఘర్షణములను దృష్టియందుంచుకొని ఇట్లు అభిప్రాయపడి యుండవచ్చును. సెనార్ట్ నిర్వచనమునుబట్టి, ప్రాచీన ఆర్య వ్యవస్థ యొక్క సాధారణ పరిణామమే కులమని తెలియవచ్చు చున్నది. భారతదేశములో అసాధారణమైన ప్రత్యేక పరి స్థితులవలన, అవ్యవస్థ అసాధారణమైన స్వరూపము దాల్చి నది. ఇండో-ఇరానియను చారిత్రక దశలో కుల, వర్ణ వ్యవస్థ తలయెత్తినది. ప్రాచీన ఇరాన్ దేశములో గూడ భారతదేశమందువలె వర్ణవ్యవస్థ యుండెడిది. కుటుంబము, తెగనుండిమాత్రమే కులవ్యవస్థ ఆవిర్భవించినదను సిద్ధాం తమును ఆమోదించిన సెనార్టు ప్రభృతులు, భారత దేశ మందలి కులవర్ణ విధానమునకును, ప్రాచీన గ్రీకు, రోమక సాంఘిక వ్యవస్థలకును నడుమ కొన్ని పోలిక లున్న పని కనుగొనిరి. ఇబ్బెట్సన్ యొక్క అభిప్రాయమునుబట్టి కులమను నది ప్రాచీనకాలపు వర్ష శీలమగు సాంఘిక వ్యవస్థ కంటె ఎక్కువ కఠోరముగ (rigid) రూపొందింప బడెను. అంతియేగాక, అది తెగకు, వంశమునకు సంబం ధించిన 'గోత్రము' యొక్క ఘనీభవ స్వరూపము. (ossified form). నెస్ ఫీల్డ్ అనునతడు ఈ కులసమస్యను సాంస్కృతిక, వృత్తి, వ్యాపార వ్యాసంగములదృష్ట్యా చర్చించెను. ప్రారంభములో ఆచార్యత్వము (priest hood) ఒక్క బ్రాహ్మణవర్ణమునకే సర్వాధికారముగా సంక్రమించియుండలేదని అతని అభిప్రాయము. యజ్ఞ సంబంధమైన కర్మకాండకు క్షత్రియులు గూడ ఆచార్య త్వము వహింపనధికారము, అర్హత కలిగియుండిరి. దీర్ఘ కాలము గతించిన వెనుక, యజ్ఞ కార్యములు, అందలి మంత్రతంత్రములు, కర్మకాండ విభావము మిగుల జటిల
- మైనందువలనను, వాటియందు ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు
765 కులములు - వర్ణములు అవసరమగుటచేతను, ఆవృత్తియందు విశిష్టమైన దీక్షా దక్షతలతో కృషి సల్పిన వారు బ్రాహ్మణులైరి. ఈ విధముగా బ్రాహ్మణులు ఉన్న తలకుణములతో అధికారస్థాన మధి ష్టించి సర్వాధికారములు అనుభవించుచున్న తరుణములో హిందూ సంఘమందలి ఇతరవర్గములు తమకు అందు బాటులోనున్న హక్కులను సంపాదించుకొనుటకై విధిలేక తగు జాగ్రత పడవలసివచ్చెను. కుల సమస్యను గురించి మరియొక భావముగూడ ప్రచారములోని కెగబ్రాక నారభించెను. భారతీయులలో అత్యధిక సంఖ్యాకులు 'ద్రవిడ', 'ముండ' జాతీయులగుటచే, హిందు॰ సంస్కృతి పైనను, హిందూ సాంఘిక నిర్మాణముపైనను వారి ప్రభావము అత్యధికముగ ప్రసరించెను. 'హెలెనిక్ ' పూర్వ స్మృతి చిహ్నములను గురించియు, మినోన్, క్రిటన్ సంస్కృతులను గురించియు ఇటీవలజరిగిన పరిశోధనముల వలనను పై అభిప్రాయము ధృవమగుచున్నది. భారత దేశచరిత్రలో కుల, వర్ణ వ్యవస్థాని ర్మాణమునకు వ్యతి రేకముగా పెక్కు సంస్కరణోద్యమములు బయలు దేరెను. ఇట్టి ఉద్యమములలో బౌద్ధ, జైనములు అతి ప్రాచీనములు. మహమ్మదీయుల పాలనములో పెక్కురు సంఘసంస్కర్తలు హిందూ మహమ్మదీయుల నడుమ సఖ్యతను నెలకొల్పవలెనని యత్నించుచు, కుల, వర్ణ విధానముపై తిరుగుబాటు చేసిరి. ఈ సందర్భములో దక్షిణభారతమున తలయెత్తిన వీరశైవ లింగాయతు ఉద్యమముల ప్రసక్తి గూడ పేర్కొనబడుచున్నది. ఇవి కాక, కుల, వర్ణ లింగ భేదములను నిరసించిన వైష్ణ వోద్యమముగూడ భారత దేశ మంతటను విస్తృతరూపము చాల్చెను. ఉత్తర భారతములో రామానంద్, కబీర్ అను వారలు ఈ వర్ణ వ్యతిరేకోద్యమమునకు నేతలైరి. ఈ ఉద్యమములతో నానక్, దాదు, నామదేవ, చైతన్య మున్నగు ప్రముఖులకు సంబంధమున్నట్లు తెలియుచున్నది.. ఆధునిక యుగమున హిందూ సంఘములో వెక్కు సంస్కర, ణోద్యమములు తలలెత్తినవి. ఇట్టి నూతనోద్యమములలో 'ప్రార్థనా సమాజము', 'బ్రహ్మసమాజము', 'ఆర్యస మాజము' ముఖ్యములైనవి. ఇటీవల కొంది కాలము క్రింద మేధావివర్గమునకును, సంస్కరణోద్యమమునకునుచెందిన "రెనడే, గాంధీ వంటివారు కులవర్ణ విధానములో సంస్కర