Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/814

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - తిరుక్కు ఱశును పఠించిన మీదట పఠిత కీ విషయా దికము ప్రధానముగ స్ఫురించును. పాలకులు, పాలితులు ఎల్లరు ధార్మికులై యుండవలెను. శాశ్వత సౌఖ్యమును ప్రసాదించు ధర్మపథమునే మానవు డనుసరింపవలెను. మానవుని దుఃఖములకు కారణభూతములు కామక్రోధ మోహములు. ఇవి నశించిననాడే మానవుడు కష్టజలధి నుండి గట్టెక్కగలడు. కుఱకు సర్వస్వతంత్ర గ్రంథము. అయినను సంస్కృత హెఙ్మయ ప్రభావము కొంతవరకు కుఱళుపై కానవచ్చు చున్నది. తిరువళ్ళువరునకు మనుస్మృతి, చాణక్యుని అర్థ శాస్త్రము, హితోపదేశ పంచతంత్రములు, కామందకుని నీతిసారము మున్నగు గ్రంథములతో పరిచయముండి యుండునని విద్వాంసులు కొందరు తలచుచున్నారు. కుఱళు పద్యరచనా విధానము సంస్కృతమునందలి సూత్ర రచనను తలపించుచున్నదనియు ఈ సందర్భమున పేర్కొనదగును. ఏమయినను, తిరుక్కుఱరు స్వతంత్ర రచన మనుట సమంజసము. ఇక తమిళ వేదములోని కొన్ని భావములను పరికింతము: "శిష్టుఁడైనట్టి దేశికుఁ గొల్వకున్న: గష్టించి నేర్చిన కళలెల్ల సున్న. వర్ష మే నరునకు పతన భూతమ్ము వర్ష మే యతని సంపదకు మార్గమ్ము. పరదైవముల వీడి పతిఁ గొల్చు చాన కురియు మన్నంతనే కురియదే వాన. చిట్టి చేతులతోడఁ జిటిపాప కలువు పట్టెడన్న మే సుధా ప్రాయమ్ము గొలుపు. కసరి యిచ్చినదానికంటె రమ్యోక్తిఁ బసమించు మోముతోఁ బలుకు పేరశక్తి. మునుముందు పొగడి వెన్వెనుక నిందించు మనుజు మోయునో యేమొ మహీ విధియంచు. పూని ద్రావాసవం వానగాఁ దీవి కాని ప్రేమరసమ్ము కనినంతఁ దీసి." ఈ ద్విపదలు శ్రీ చల్లా లక్ష్మీనారాయణ శా తెలుగు నేత నుండి గ్రహింపబడినవి. ఉపసంహారమున మహానీయుడు, మహాకవియు నగు తిరువళ్ళువరు ప్రసాదించిన తిరుక్కుఱళు తమిళ సాహి 96 761 త్యాకాశమున ధ్రువతారవలె నిస్సంశయముగ నుడువ దగును కులములు - వర్ణములు : కులములు - వర్ణములు ప్రతిభాసించుచున్నదని చ. రా. ళ. కుల మనగా తెగ, వంశము. ప్రాచీన కాలములో ఆర్యులు వేర్వేరు తెగలుగా నివసించుచుండిరి; వేర్వేరు వృత్తు అవలంబించుచుండిరి. ఇట్టివారు అముక కులము వారు, అనగా అముక వంశమువారు, అముక తెగవారు అనబడిరి. వర్ణమనగా రంగు. ఆర్య, అనార్య జాతులకు గల భేదములను బట్టియు, గుణకర్మ విభాగమునుబట్టియు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణములుగా సాంఘికులు విభజింపబడిరి. సంఘాభ్యుదయమునకు ప్రాచీనార్యులు చేసికొనిన వీ కట్టుబాట్లు, కులము, వర్ణము అను పదములు సమానార్ధకములు. సజాతీయమైన ప్రాణుల గుంపు అని ఆ పదముల భావము. ఈ పదములు జాతి, తెగ, వంగడము అను అర్థములు నిచ్చుచు, హిందూ సాంఘిక వర్గీకరణమును నిరూపించు చున్నది. ఒక తెగలోపలనే వివాహ సంబంధములు చేయు విధానము (endogamy), వంశ పారంపర్యము (here- dity), కులవ్యవస్థకు ప్రాథమిక మౌలిక సిద్ధాంత ప్ర ములుగా పరిగణింపబడుచున్నవి. పురుషుడు స్వకుల మందలి స్త్రీని మాత్రమే వివాహమాడవలెను. ఇంతటితో ఆగక, ఈ కులములలో, స్వశాఖలో మాత్రమే వివాహము లాడు పెక్కు అంతశ్శాఖలు గూడ బయలు దేరినవి. ఈ అంతశ్శాఖలలో మరల చిలవలు, పలవలు ఉద్భవించినవి. భిన్నులైన ఈ ఉపశాఖీయులు ఒండొరులతో వివాహ సంబంధములు చేసికొనెడి ఆచారము కలదు. న్యాయచట్టమందు 'సపిండ' సిద్ధాంతము ఆచరణయందు కలదు. ఈ సిద్ధాంతము ననుసరించి రక్తస్పర్శగల సన్ని హితులు ఒండొరులను పరిణయమాడరాదు; తల్లిదండ్రుల యొక్కయు, సోదరుల యొక్కయు, అక్కచెల్లెండ్ర యొక్కయు సంతతివారు అన్యోన్య వివాహములు చేసి కొనగూడదు. సాధారణముగా, ఆరు తరములవరకు పితృ పథమున ఒకే పూర్వ వంశీకుడున్నను, నాలుగు తరముల వరకు మాతృపక్షమున ఒకే పూర్వ వంశీకుడున్నను, అట్టి వారు ఒకరి నొకరు వివాహ మాడకూడదను నిషేధము