కుమ్మరము ఉత్పత్తి బాహుళ్యమునకును, కళాకల్పనకును పరస్పర వైరుధ్యము లేదనుటకు చైనా కుమ్మరమే ప్రబల నిదర్శ నము. చైనా కుమ్మరపు పరిశ్రమ వేలమంది శ్రామికులకు పెక్కు శతాబ్దముల వరకు జీవనాధారముగ నేర్పడెను. చైనా కుంభకారులు అత్యున్నత మైన శిల్పనై పుణ్యప్రమాణ మును, కళా సంస్కృతిని మొక్కపోనీయక పరిరక్షించిరి. 1వ జపాన్ కుమ్మరము ; జపానీయులు తాము చక్కని పోర్సిలెయిన్ పాత్రలను, విగ్రహములను క్రీ. శ. 1 వ శతాబ్దియందే నిర్మించినట్లు చెప్పుకొన్నను, నిజమైన అభి వృద్ధి క్రీ. శ. 7 వ శతాబ్దియందే జరిగెను. ఆ శతాబ్దిలో ‘కాటోసిరో' అను జపానీయుడు చైనాలో కుమ్మరవు విద్య నభ్యసించి, పోర్సి లెయిన్ నిర్మాణ విధానమంద లి రహస్యములను జపానుకు కొనివచ్చెను. జపానునందలి కుమ్మరము యొక్క ప్రాచీనకాలికత, తొలివికాసము ఎట్లున్నను, ఆ కళయందు జపానీయులు మధ్యయుగములో 'అండాకారపు చిప్పలు' (egg-shell) అనెడి కిరణ భేద్యములగు మృణ్మయ పాత్రలను, పళ్ళె రములను ఉత్పత్తి చేయుటలో కాంచిన ప్రగతి ప్రపంచ విఖ్యాతమైనది. వారు కిరణభేద్యమైన మెరుగులతోను, అండర్ గ్లైజ్ అలంకారములతోను సాధారణమైన మట్టి కుండలను, రాతి సామానులనుగూడ నిర్మించిరి. జపానుదేశమందు 'రకు' అను నొక విధమగు సాధా రణమైన కుండ సామానునుగూర్చి ప్రత్యేకముగా ఇచ్చట పేర్కొన నగును. ఈ సామానును స్వల్పమైన ఉష్ణోగ్రత యందు కాల్చేదరు. ఈ పాత్రలపై సీసము, వెలిగా రము అనువాటి మిశ్రమముతో మెరుగులు దిద్దబడెను. 'రకు' అను పదమునకు హాయి, సౌఖ్యము, భోగము లేక ఆనందము అని అర్థము. 'టీ' ఉత్సవమునకు (Tea ceremony) అత్యుత్సాహముగల పోషకుడగు 'సైకో' అను నతనిచే 1598 లో, చొజీరోకు (Chojeiro) ప్రసాదింప బడిన బంగారుముద్ర (Gold seai) మీద 'రకు' అను పదము చిత్రలిపి (ideograph) లో చెక్క బడియున్నది. చోజిరో అను నతడు కొరియా దేశీయుడైన 'అమేయ' అను నతని కుమారుడు. అమేయ 1525 సం. లో క్యోటొనగర మందు స్థిరనివాస మేర్పరచుకొని ప్రప్రథమముగా ఈ పొమానును చేసెను. సంగ్రహ ఆంధ్ర గ్రీకు కుమ్మరము : గ్రీకులు పర్షియాదేశముతోను, తది తర దేశములతోను వాణిజ్యాది సంబంధములు కలిగి యుండిరి. ఐనను గ్రీకు కుమ్మరముమీద పర్షియా దేశము యొక్కగాని, ఏ ఇతర దేశము యొక్క గాని ప్రభావము ప్రసరింపలేదు. అది పూర్తిగా స్వతంత్రముగ అభివృద్ధిచెంది నదే. ఈజిప్షియనులు తమ మృణ్మయపాత్రలకు మెరుగు పెట్టు విధానమును, బాబిలోనియనులు, పర్షియనులు పెంకులు, ఇటికలు చేయు విధానమును గ్రీకులు బాగుగా ఎరిగియుండిరి. ఐనను వారు తమ పాత్రలకు మెరుగులు దిద్దెడివారుకారు. గ్రీకులు తాము తయారుచేసిన పాత్రలకును, గిన్నెల కును ఇసుకరాతిలో మిళితమైన వారమునుండి ఉత్పత్తి చేయబడిన మెరుగుపదార్థముతో అందచందములు చేకూర్చి సుందరమైన రూపము కల్పించెడివారు. ఆపాత్రలను కాల్చు నపుడు, వాటికి లోహభస్మమును చేర్చుటవలన, నల్లనివర్ణ మేర్పడి, ఈ కాంతికి అపురూపమైన శోభ చేకూ రెను. గ్రీకులు నిర్మించిన పాత్రల యొక్క సౌష్ఠవమునుబట్టి వారు ఉపయోగించిన మట్టి అనువైన పాకములో తయా రయ్యెడిదని తెలియుచున్నది. ఆ పాత్రలను స్వల్పమైన ఉష్ణోగ్రతలో కాల్చెడివారు. అందుచే పాత్ర శరీ రము మృదువుగను, నున్నగ నుండి దానిమీద కత్తితో గీకుటకు అనుకూలముగ నుండెను. హస్తనైపుణ్యము హ కారణముగా, అలంకరణము అత్యంత కౌశల్యముతో చేయబడి తడిగానుండు ఉపరితలములపై లోహపు అచ్చు లతో అలంకారములు సహితము మనోహరముగ చిత్రింప బడెను, గ్రీకులు తమ కుమ్మరమందు సర్వ సాధారణముగా నలుపు, పసుపు, గోధుమ వర్ణములను ఉపయోగించెడి వారు. పుష్కలాలంకరణ వైవిధ్యమును, ఆకృతి సౌంద ర్యమును గ్రీకు కుమ్మరమందు ప్రధాన లక్షణములు. గ్రీకు కుమ్మరపు నమూనాలు క్రీ. పూ. 8వ శతాబ్దము నుండి క్రీ. శ. 2 వ శతాబ్ది వరకు లభించుచున్నవి. కాని క్రీ. పూ. 6వ శతాబ్దినుండి క్రీ. పూ. 4వ శతాబ్దివరకు తయారైన కుమ్మరపు పాత్రలు అత్యుత్తమమైన గ్రీకు కుమ్మరమునకు ఉదాహరణములై యున్నవి. 756. రోమను కుమ్మరము: తక్కిన సాంస్కృతిక జీవిత దశా విశేషములందువలెనే కుమ్మరపు కళయందుగూడ
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/809
స్వరూపం