కాశ్మీరము - 2 సంవత్సరముల అనంతరము ఘనీభవించి తునకు కాశ్మీర సర్వతములుగా రూపొందెను. కాశ్మీరము యొక్క అవ తరణమునకు ఇదియే ప్రథమదశ. అయితే ప్రారంభమంచే సుందరములైన హిమశిఖరములు, మనోహరములైన వనములు అవతరింపక', అగ్ని పర్వత ద్వీపములు (Volcanic islands) మాత్రము తలలెత్తెను. ఇవయినను శాశ్వత ముగా నుండక, క్రమముగా సముద్రమున క్రుంగిపోయిన ఫలితముగా ఈ సముద్రమునకు అమెరికా ఖండముతో సంబంధ మేర్పడి యుండవచ్చును. పెక్కు దశలు దాటిన పిమ్మట కాశ్మీరము క్రొత్త రూపము దాల్చి భారత భూ భాగములో అంతర్గర్భిత మైనది. ఆనాటికి భారతదేశము ఆఫ్రికా ఖండముతో కలిసియుండెను. పూర్వము సముద్రము ద్వారమున అమెరికా ఖండముతో కలిసిపోయిన కాశ్మీరము, అనంతర కాలమున భూభాగము ద్వారమున ఆఫ్రికా ఖండముతో కలిసిపోయెను. చలన రహితముగా కన్పట్టు భూగోళము పై విధముగా బ్రహ్మాండమైన సంచలనమునకును, అద్భుత పరిణామములకును లోనగుట ఆశ్చర్యము కలిగించక మానదు. కాని కాశ్మీరమెంతో కాలమువరకు బాహ్య ప్రపం చమునకు గోచరమై నిలిచి యుండలేదు. మరల కార్బోని ఫెరస్' అను యుగమున కాశ్మీరము సముద్రమున క్రుంగిపోయి, కొన్ని లక్షల సంవత్సరముల వరకు ఆస్థితి యందే యుండెను. తిరిగి 'టెర్టియర్' యుగములో (ఇప్ప టికి 40 లక్షల సంవత్సరముల క్రిందట) మరల కాశ్మీరము సముద్ర గర్భమునుండి బయల్వెడలెను. సముద్రము క్రమముగా టిబెట్, హిమాలయములనుండి వెనుకకు నెట్టి వేయబడి 'ఇ యొనీన్' "ఇయొసీస్' యుగమునాటికి టికెట్, హిమాలయ ప్రాంతమంతయు తుదకు. మెట్ట ప్రాంత ముగ మారెను. ఇట్లు ఎప్పటికప్పుడు విపరీతమైన భౌతిక పరిణామములకు గురియైన కాశ్మీరము చిట్టచివరకు 40. లక్షల సంవత్సరముల రూపొందెను. పూర్వము తుదిసారిగా ప్రప్రథమమున సముద్ర జలము నుండి శాశ్మీరము ఉద్భవించినపుడు ఆ ప్రాంతమంతయు గుట్టలమయముగా మాత్రమే ఉండెనని తెలిసికొంటిమి. సముద్రమందు 714 సంగ్రహ ఆంధ్ర అల్పప్రాణులున్నను, గుట్టలపై గడ్డిగాని, మొక్కలుగాని, చరరూపమైన ప్రాణికోటి గాని మచ్చునకై నను గోచరింప లేదు. పశుజాతి, పిపీలికము లెచ్చటను కాన్పింపలేదు. మదకు గాలిలో సైతము ప్రాణి కరవాయెను. క్రమ ముగా వర్షపాతము వలన చెట్టు చేమలు, గడ్డి గాదము గుట్టలపై మొలకలెత్త నారంభించెను. చివరకు మైదాన ములలో గూడ వృక్షసంగతి అభివృద్ధికా నారంభించెను. ఇవ్విధముగ 3 కోట్ల సంవత్సరముల క్రిందట కాశ్మీర భూభాగము పై జీవరాసులు బ్రతుకుతెరువును ప్రారంభించి నట్లు తెలియుచున్నది. కాశ్మీరము-2 : ప్ర. రా, సు. ప్రాచ్య, పాశ్చాశ్య చరిత్రకారులు గావించిన పరి శోధనములనుబట్టి, కాశ్మీరము యొక్క మత, సాంస్కృ తిక, కళా వైశిష్ట్యము ప్రధానముగా భారత్, గ్రీస్ వంటి విదేశముల వలన ప్రభవించినట్లు ద్యోతక మగుచున్నది. కాశ్మీరము మహోన్నతములైన పర్వతములచే పరివేష్టింప బడియుండక, బాహ్య ప్రపంచమునకు సముద్ర మార్గము లున్నచో, అచ్చటి ప్రజలు విదేశములతో అధికతరమైన సంపర్కము కల్గించుకొని ప్రపంచ చరిత్రలో ఇతోధిక మైన 'పేరు ప్రతిష్ఠ లార్జించెడివారు. పెట్టని కోటగోడల వలె కాశ్మీరమునకు పర్వతపంక్తులు ప్రాకారములుగా నిలచి అన్యదేశములతో రాక పోకలకు ప్రతిబంధక ములుగా నున్నను, అచ్చటి సహజ సౌందర్యము విదేశీయుల నాక ర్షించి, ముగ్ధులను చేయుటచే, వారి మత, సాంస్కృతిక, కళా సంప్రదాయములు కాశ్మీరీయులపై విశేష మైన ప్రభావమును ప్రసరింపజేయుచు వచ్చెను. భారతదేశ మందు గ్రీకుల ప్రభ వెలుగొందుచున్న సమయమున నే కాశ్మీరము యొక్క చరిత్ర అవతరించినది. ప్రాచ్య చరిత్రకారులు మస కందించిపోయిన వివ రములనుబట్టి అశోక వర్ధన చక్రవర్తి (క్రీ. పూ. 273.282) ప్రప్రథమముగా తన రాజ్యమును కాశ్మీరము వరకు విస్త రింప జేసికొనెననీ విదితమగుచున్నది. ఇతని సామ్రాజ్యము వంగరాష్ట్రమునుండి దక్కను వరకును, పశ్చిమోత్తర మున ఆఫ్ఘనిస్థాను, పంజాబులవరకును విస్తరిల్లి యుండె నని నిర్వివాదముగ చెప్పనగును. అశోకుని పరిపాలనా
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/767
స్వరూపం