విజ్ఞానకోశము . కాశ్మీరమందలి అపురూపములగు ఉన్నత భూభాగ ములు 'చీనాబ్' నదీ తోయములతో సస్యశ్యామల మొనర్పబడుచు, అత్యంత సారవంతములైన పంట భూము లుగా వన్నె కెక్కినవి. 'పీర్ పంజల్ ' అను హిమాలయ పర్వత పంక్తులమీదుగా ప్రయాణించినచో కాశ్మీరులోయ కాననగును. సమశీతోష్ణస్థితియందుండి, చిత్ర విచిత్ర లక్షణ ములుగల ఈ సంస్థానము మూడింట ఒక వంతు పర్వత మయముగను, మిగిలిన రెండు వంతులును జలమయము గను, సుక్షేత్రములగు భూఖండములుగను విభజింపబడి యున్నది. అందుచే అచ్చటి ప్రజల జీవిత చరిత్ర, ఆచార వ్యవహారములు, శారీరక మానసిక ప్రవృత్తులు ప్రకృతి శక్తులచే బలీయముగ ప్రభవింపబడుచున్నవి. కాశ్మీర మందలి సరస్సులలో సంవత్సరమున కారుమాసములు మంచుకొండ లేర్పడి, వాటి మూలమున వ్యావసాయక వ్యాసంగమునకు తీరని అంతరాయ మేర్పడుచున్నది. మానస సరోవరమును మరపించు 'చాల్' సరోవర మును, ఈ సరోవరమునుండి నిరంతరము ప్రసరించు చల్లని పిల్లగాడ్పులును, కవకవలాడుచు పెరిగి, నలు వైపుల నల్లిబిల్లిగ నలుముకొనిన తరులతా నికుంజములును అరుణ కిరణ కాంతులచే వివిధ వర్ణ ప్రభా శోభితము లై న ఉత్తుంగ పర్వత పంక్తులును, హిమమావరించు పర్వత సానువులును, నేత్రపర్వ మొనర్చు పచ్చని లోయలును, ఫలపుష్ప భరితములగు నందనోద్యానములును, పశు సంతతులకు తనివిదీర ఆహార మొదవు పచ్చిక బయళ్ళును, కిలకిలారావములచే చెవులకు పండువుచేయు నానావిధ పక్షి సంతానములును, పుష్కలముగ మధుర నీరములు లభించు జలాశయములును, ఇత్యాదులు ఖండాంతరముల నుండి తండోప తండములుగ వచ్చి దర్శించు యాత్రీకు లకు స్వర్గధామమువలె కన్నులపండువు కల్పించును. కవికులము కాశ్మీరమును అణిముత్యముల నడుమ పొది గిన మరకతమణితో పోల్చుటయందు అత్యుక్తియే శాన రాదు. కాశ్మీరమునకు రాజధానియైన శ్రీనగరులో సుందర మైన విహారదృశ్యములు అనేక ములుకలవు. దాల్ సరస్సు, మొగల్ గార్డెన్స్, నిషాన్ బాగ్, షాలిమర్ బాగ్, నసీమ్ బాగ్ వీటిలో ముఖ్యములు. ఇవన్నియు మొగలుల 711 కాశ్మీరము - 1 పరిపాలనములో నిర్మాణ మయ్యెను. ఇవి యే కాక శ్రీనగరులో జుమామశీదు, షాహమదన్ మశీదు మొదలైన దివ్య భవనములును, సామాన్యమైన హిందూ దేవాలయ ములును కలవు. శ్రీనగరు 'కాలువల' నగరమను ప్రతీతి గలదు. నగరమం దేర్పడిన కాలువలపై పడవల నెక్కి ప్రజలు విహారము సల్పుట ఇచ్చటి ప్రత్యేక విశిష్టత. శ్రీనగరునకు మూడుమైళ్ల దూరమున పూర్వపు శ్రీనగరు రాజధాని యుండెననియు, కాని ఆ నగర మంత రించి, దాని స్థానమున ఈనాడు 'పండధన్' అను గ్రామము వెలసియున్నదనియు, ప్రాచీన రాజధానీ నగరమును అశోక చక్రవర్తి నిర్మించే ననియు చరిత్రకారులు నుడువు చున్నారు. పరిహాస పురమను ప్రాచీన నగరము ఆకర్షణీయ మైన మరొక మనోహరదృశ్యము. నేడా నగరము పరానపూరు అను పేర జరుగుచున్నది. ఇది శ్రీనగరుకు సమీపమున నున్న షాదిపూరునకు 2 మైళ్లు పై ఋతిదిశగా నున్నది. మహా వైభవ మనుభవించిన ఈ నగర మిప్పుడు నామమాత్రా వశిష్టమైయున్నది. అలనాటి మహాసౌధములు, దేవాలయ ములు శిథిలమైపోగా అచ్చటి అవశేషములైన రాతిబండ లతో, ఆ సమీపమున నే వెలసిన 'పటన్ నగర' మందు నూతన దేవాలయము నిర్మింపబడెను. 8వ శతాబ్దములో మార్తాండ దేవాలయము' ను నిర్మించిన లలితాదిత్య సార్వభౌముడే పరిహాస పురమును గూడ నిర్మించినట్లు చరిత్ర వలన రూఢిగా తెలియుచున్నది. ఈ నగరసౌధముల యొక్కయు, ప్రాకారము యొక్కయు నిర్మాణపు తీరును పరిశీలించి నచో, వాటి కళాపై భవము ఎంతటి మహోన్నత మైనదో తెల్లముకాగలదు. మార్తాండాలయము వలెనే పరిహాస పురము గూడ ప్రకృతి రామణీయకతకు నిర్మాణ చాతుర్య మును మేళవించి తీర్చిదిద్దినటుల స్పష్టమగును. ఇందుచే అపూర్వమైన కళావై దగ్ధ్యము ఈ నగరమున ఉట్టిపడెను. లలితాదిత్యుడు వెండి విగ్రహముతో విష్ణు పరిహాస కేళ వాలయమును, బంగారు విగ్రహముతో విష్ణుముక్త కేశవాలయమును, కవచధారియైన విగ్రహముతో విష్ణుమహావరాహాలయమును, వెండివిగ్రహముతో గోవర్ధన ధరాలయమును, రాగి బుద్ధవిగ్రహముతో రాజవిహారమను
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/764
స్వరూపం