Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాశ్మీర భాషాసాహిత్యములు తుదకు నేటి కాశ్మీరిగా రూపొందిన భాషలో అపుడే సమ్మి "తమైనట్టి కాలమునకు చెందినది. 'మహానయ ప్రకాశము' లో సుమారు 94 పద్యములు గలవు. అందు గూఢమయిన మత సంప్రదాయములకు చెందిన ఆచారములనుగూర్చి వివరింపబడినది. ఒక్కొక్క పద్యమునకు నాలు గేసి పాదము లున్నవి. దానితో సాహిత్యాభిరుచికంటె ఛందో భాషాభిరుచియే గురుతరమై గోచరించును. అందలి కవిత్వమును మిక్కిలి మనోహర ముగా నుండును. కాని 14 వ శతాబ్దపు పరార్ధమందు జీవించియుండిన 'అలద్యద్' (Lal Ded) అను కవయిత్రి యొక్క 'వాన్' (సంస్కృతము : వాక్యాని) అనబడు గ్రంథస్థితి అట్టిదికాదు. అది కాశ్మీరములో తొలిసారిగా ముసల్మానుల ప్రభుత్వము ఏర్పడిన సమయమునకు చెంది నది. అప్పటికి ప్రాచీన సంస్కృత సంప్రదాయము అంత రించుట కారంభించెను. నాడు సంఘముపైన సంస్కృత మునకు గల పలుకుబడి పర్షియన్ భాషకు లభించియుండ లేదు. ఈ పరిస్థితివలన ప్రజల యొక్క స్వంత భాషకు అనుకూలమైన అవకాళము చేకూరెను. తదనుగుణముగా దైవవశమున ఒక మహాకవికూడ లభించెను. ప్రజల స్వకీయమగు నుడికారమునకు చెందిన భాషాతంతువుల నుండి 'అలద్యద్' అను కవయిత్రి నూతన కవితాప్రక్రియ అను, కల్పనలను రచించెను. 'వాబ్ ' అను గ్రంథము ఆమె యొక్క గూఢానుభవముల ఋజుత్వముచేతను, కవితాభి వ్యక్తి యొక్క ప్రామాణ్యముచేతను ముద్రితమైనది. ఈ గుణములు భాషీయముల యొక్క పాటవముచేతను, రూపకముల (metaphors) చేతను, సంక్షిప్త లలితము లైన కల్పనలచేతను విశదీకరింపబడినవి. వీటి మూలమున ఆమె కావ్యమునకు చేకూరిన ప్రశంసలు దాని మహత్వ మును శాశ్వతము చేయుచున్నవి. 'వాబ్ ' అను గ్రంథము వలన ఆమె కాశ్మీరశై వమునకు చెందిన శైవయోగినియై యుండె నని తెలియుచున్నది. ప్రాణము, అపానము అనబడు ప్రధాన వాయువులను వశపరచుకోనుటకై ఆమె ముఖ్యముగా అభ్యసించిన నియమములను గూర్చి అనేక ఉదాహరణములు అందు కానవచ్చును. కృత్రిమ వృత్తిని (hypocrisy), ఏకాకి జీవనమును (exclusiveness), కర్మకాండమును (ritualism) ఆమె ఎదిరించెను, ఆమెకు 706 సంగ్రహ ఆంధ్ర సమకాలికుడును, పిన్న వయస్కుడును అగు నందఋషి కరారి - ఇ - షఫ్కు చెందిన షేక్ నూర్ -ఉద్ -దీన్) - యొక్క పద్యరచనలు గూడ ఈ కాశ్మీర సాహిత్యము యొక్క ప్రథమ యుగమునకు చెందినవి. ఈ మహ నీయుడు కాశ్మీరములోని మహమ్మదీయ ద్రష్టలకు లేక బాణాలకు జనకుడుగా ఏకగ్రీవముగా అంగీకరింపబడెను. 'షే నామ' లేక 'నూర్నామ' అను గ్రంథములోని విశేష భాగము నీత్యుపడేశాశ్మకముగ నున్నది. అందలి భాష సారవంతములును, సుప్రసిద్ధములునైన సామెతలతో సుసంపన్నమైనది. జైనులాబుద్దీన్ (1420 1470) అను మహా రాజు యొక్క పరిపాలన కాలములో కాశ్మీర వాఙ్మయ మందు ఉత్కృష్టమగు సాహిత్యరచనలు చేపట్టబడినవి. సోమపండితునిచే రచింపబడిన 'జైనచరిత్' అనబడు జీవిత చరిత నాటకము ప్రకృతమునకు ఉదాహరణము. భట్టావతార్ అను కవి 'బాణాసుర కథ' అను కావ్యమును రచించెను. ఈ కావ్యమునందు కవి నుడివినట్లు, అనేక వృత్తములు ఉపయోగింపబడినవి. ఇందలివస్తువు హరి పంశ పురాణో క్తమయిన ఉష, అనిరుద్ధుల ప్రేమప్రవృత్తికి సంబంధించినది. ఈ కావ్యమునందు భాషాశాస్త్రమునకు, ఛందశ్శాస్త్రమునకు, సాహిత్యశాస్త్రమునకు సంబం ధించిన వైశిష్ట్యము గోచరించును. సుల్తాన్ హసనా (1472-1484) 352- యొక్క కాలమునందు గణక ప్రశస్తు నిచే రచించబడిన 'సుఖదుఃఖచరితము' అను గ్రంథ మొకటి కలదు. ఇది ఉపదేశాత్మకమయిన ఒక బృహ త్కావ్యము, ద్వితీయ యుగము (1555-1819) : కాశ్మీర సాహిత్య చరిత్రమందలి ప్రథమయుగము రూప నిర్మాణాత్మక మైనది, అది సుమారు క్రీ.శ. 1555 వ సంవత్సరముతో ముగిసిన దనవచ్చును. అది, సుల్తానులలో కడపటివాడు సింహాస నమునుండి తొలగింపబడి 'ఘాజిచక్' అను నతడు రాజైన సమయము, ప్రథమయుగమునకు చెందిన 'వాఖ్' అను కావ్యము అనేకములయిన అనుప్రాసకల్పనలతో కూడిన నాలుగు పంక్తులుకల పద్యములతో అలరారుచున్నది. అందు గూఢ మతబోధయు, నీత్యుపదేశమును కలవు. అట్టి కావ్యరచనపోగుచునే యున్నది. ప్రథమయుగము నందువలె ఇందు రూపకరచన జరుగలేదు. మొదటి యుగ