విజ్ఞానకోశము . ౨ సమష్టి కాంతిని వారి యెడ ప్రసారముచేయుచు, నెగడిన వారు వీరు. అందుచే ఆంధ్రు లొక్కరికే గాక, వీరు మానవాళి కెల్ల నాదర్శకులైనారు. దేశభక్తు లెల్లరి జీవిత ముల వలె గాక వీరి జీవితము సర్వతోముఖ సమగ్ర సుందరమై, విజ్ఞాతార్హభూమియంతట విస్తృతమైనది. భారతీయ నవజీవన వికాసమునకు దోహదకర్తలై, కారాక్లేశ జనిత తయ చిహ్న కృశీభూతులై, తను ధనములను దేశ సౌభాగ్యమునకే అర్పించిన స్వర్గీయ నా గేశ్వరరావుగారి యకశ్చంద్రికలు అజరామరములు. జాతీయోద్యమ పోషకులై మృతజీవులైన మహా పురుషుల పాలపుంతలో నాగేశ్వరరావొక మహోజ్వలమైన తార; ఆంధ్రుల దివ్యతేజోపుంజము. కాశ్మీర భాషాసాహిత్యములు : బొ. వే. కు. కాశ్మీరులోయలో మాట్లాడబడు భాషను కాశ్మీరు భాష యందురు. ఈ లోయకు ఉత్తరమందు 'చార్డు' ఉపశాఖకు చెందిన దార్డు భాషావర్గములోని 'షినా' (Shina) భాషయు, తూర్పున లడఖ్ ప్రాంతమునకు చెందిన బౌద్ధులు మాట్లాడు ‘బోధి' భాషయు, దక్షిణమున డోగ్రి, వహారి భాషలును, పశ్చిమమున పహారీ, పంజాబీ భాషలును వ్యవహారమున నున్నవి. 'పాంచాల' (Pantsala) పర్వత శ్రేణులకు అడ్డముగ నున్న లోయకు ఈశాన్యదిశయందు గల 'కష్టవార్' అను ప్రాంతములందు వాడుకలో నున్న 'కష్టవారి' అనబడు మాండలికము (dialect) స్వచ్ఛమగు కాశ్మీరి అనదగును. ఉత్తర భారతమునకు చెందిన సంస్కృత జన్యభాషలకును, ఆవల పశ్చిమమునను వాయవ్య మునను గల ఇరానియా భాషలకును మధ్య నుండుటచే కాశ్మీరి సహజముగా ఆ రెండింటివలనను ప్రభావిత మై యుండి యుండవలెను. సర్ జార్జిగ్రియర్సన్ మహాశయుడు "కాశ్మీర భాష 'షినా' భాషకు సంబంధించిన 'దార్డు' భాషా కుటుంబము యొక్క దార్దు భాషావర్గములోని ఒక భాషా మూలమున కలిగినట్టి ఒక మిశ్రమ భాష" అని వాదించెను. కాని కొందరు భాషాశాస్త్రజ్ఞులు ఈ వాదమును అంగీక రింపక ఆర్యభాషా కుటుంబమునకు చెందిన భారత దేశము నందలి ఆధునికములైన ఇతర దేశభాషలవలెనే కాశ్మీరి గూడ ఒకానొక అపభ్రంళ భాష నుండి ఉద్భవించియుండు 89 705 కాశ్మీర భాషాసాహిత్యములు ఈ భాషకు నని గట్టి పట్టుదలతో వాదించుచున్నారు. చెందిన కొన్ని లక్షణములనుగూర్చి వివాదములేదు. ఐనను దీని ఉత్పత్తి క్రనుమును గూర్చి విస్పష్టమయిన పరిశోధన జరుగలేదు. ఉదా : కాశ్మీర భాషయందు ధ్వనించెడు (ఒత్తిపలుకబడు) మహాప్రాణములు (Sonant-aspirates) లేవు. పదాంతమందు అచ్చులను ఉపయోగించుటలో గూడ ఈ భాష ఇతర భారతీయ భాషలకంటే భిన్నముగా నున్నది. ఆ అచ్చులు పలుకబడక పోవుట గాని, లేక దాదాపు అట్లే యుండుటగాని జరుగును. కాని వాటివలన పూర్వపు అక్షరము మీది అచ్చుయొక్క ఉచ్చారణము మార్పు చెందుచుండును. ఇతర ఆధునిక భారతీయ భాష లందు కనుపించని అచ్చుల ధ్వనులు కనీసము ఆరయినను ఈ భాషయందు కనుపించుచున్నవి. అట్లే ఇతర భార తీయ భాషలలో పక్కింటియందు లేని హాల్లు ధ్వనులు గూడ రెండు ఈ భాషయందును కలవు. కాశ్మీరు భాష యందలి వాక్యరచన కర్త, క్రియ, కర్మ అను క్రమములో నుండును. నామ వాచకముల రూపసాధనము (declension of Douns) విశ్లేషణ విధానము (analytic) ననుసరించి యున్నను, ప్రాచీనపు సంక్లిష్ట విధానములో నున్న (sy- nthetic) విభక్తులు కొన్ని సందర్భములలో నిలచి యుండుట ఈ భాషాశబ్ద శాస్త్రములో గమనించదగిన విషయము. విశ్లేషణ విధానమునుండి సంశ్లేషణ విధానము నకు పరిణామమునొందు దశలో నున్న ఆర్యభాషగా కాశ్మీర భాష యొక్కటి మాత్రమే ఉదాహరింపబడు చున్నది. మొదటి యుగము (1555 వరకు) ముమ్మందు రచిం పబడి ఇప్పటికిని నిలిచియున్న కాశ్మీరు భాషోదాహరణము నందు (కల్హణుని 'రాజ తరంగిణి' క్రీ.శ. 1150) చక్ర వర్మ మహారాజు పరిపాలన కాలము (క్రీ.శ. 988 - 997) పేర్చొన బడినది. ఈ భాషయందు లభించుచున్న గ్రంథములలో అత్యంతము ప్రాథమిక మైన రచన క్రీ.శ. 18వ శతాబ్దాంత మునకు గాని, 14వ శతాబ్దిలోని మొదటి దళకములకు గాని చెందియున్నది. 'మహానయ ప్రకాశము' అను గ్రంథము ఈకాలముననే రచింపబడియుండవచ్చును. ఈ గ్రంథము లోని భాష ప్రాచీనమైనదియు, జటిలమైనదియునై యున్నది. ఇది అపభ్రంశ దశలో నున్న ప్రాకృతము;
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/756
స్వరూపం