కాశీనాథుని నాగేశ్వరరావు మున ప్రజలలో కలిగించు రాజకీయ చైతన్యప్రబోధములు వీరిని అధిక ప్రభావాన్వితులనుగ చేసినవి. 1907 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెసు మహాసభ సూరతులో జరిగెను. అప్పుడు విజృంభించిన జాతీయో ద్రేకమనెడి జ్వాలాజిహ్వ పంతులుగారి మనస్సుధను పొంగు లెత్తించినది. ఆ జ్వాలాదీప్తి ప్రసారమునకు సత్రికలే సాధనములు. దీనికి తోడు వంగదేశ విభజనము (1904) భారతీయులకు కళాఘాతమువలె తగిలేను. 'వందేమాతర' నినాదమును మార్మోగించిన 'బిపిన్ చంద్రపాల్ ' బంధనకు అసమ్మతీ సూచకముగ 'ఆంధ్ర పత్రిక' అను నొక వార పత్రికను 1908 లో సెప్టెంబరు 9 వ తేదీన వంతులుగారు నెలకొల్పిరి. దీని ద్వారమున ప్రజలకు నూతన రాజకీయ భావములను నూరిపోయుచు వ్యయప్రయాసలకోర్చి దీనిని బొంబాయి నుండి నడపజొచ్చిరి. అమృతాంజనము వలన ధనంజయులై, ఆ బలోత్సాహములచే ఆంధ్రపత్రిక యను దేవదత్తమును పూరించి తన జాతిని మేల్కొలిపిన విజయ శీలురగు ప్రథమాంధ్రులు పంతులుగారు. ప్రజల వార్తా తృష్ణను తీర్చుట మాత్రమే కాక పత్రికా నిర్వహణములో క్రొంగ్రో త్తి రీతులను సంతరించుకొని ప్రజల నాకర్షించినది నాటి ఆంధ్ర వార పత్రిక. ఇది సర్వతోముఖమైన మన జాతి ప్రగతికిగాను త్రొక్కని చక్కని దారిలేదనుట నిజము నొప్పుకోనుట. ప్రథమ ప్రపంచ సంగ్రామము 1914 లో ప్రారంభ మైనది. కొల్లలుగా వచ్చేడి వార్తలను దూరమున నున్న ఒక వారపత్రిక జాతికెల్ల నెట్లు అందీయగలదు? అందుచేత దానిని మద రాసునకు తరలించి 1914 ఏప్రియల్ మొదటి తేదీ నుండి దినపత్రికగా కూడ ప్రకటింపజొచ్చిరి. ఇది ఆంధ్రుల సంస్కృతి చరిత్రలో ఇంకొక ఘనమైన సంఘట నము. ఇందుమూలమున యావత్ ప్రపంచము ఆంధ్రుల కన్నుల యెదుటకు వచ్చినట్లయినది. ఈ యాంధ్ర పత్రిక తో పాటు వంతులుగారి నివాసము సైతము బొంబాయి నుండి మదరాసునకు తరలివచ్చేను. జాతీయోద్యమము, ఆంధ్రోద్యమము మాత్రమే గాక, 'దేశమున ఎల్ల రంగముల యందు జరుగు కృషికి సమస్త విషయములకును ఆంధ్రపత్రిక నిలువుటద్దమై నెరపిన సేవ నిరుపమానము, నిస్సీమమును. ఈ "ఆంధ్ర పత్రిక" తొలు 702 సంగ్రహ ఆంధ్ర "ల వెలువరించిన సారస్వతాను బంధ మే కీ. శే. పానుగంటి వంటి వారి 'సాక్షి' కి వెలుగు ప్రసాదించిన కర్మసాక్షి. ఈ సారస్వతాను బంధములే ఆంధ్రమున నవ్యకవితా రీతు లను ప్రకటించి అందొక రీతికి "భావకవిత్వ" మని ప్రప్రథ మముగా నామకరణము కూడ చేసినవి. ఇంక నిందు ప్రోగువడిన విమర్శనల రాశిని గూర్చిగాని, వైవిధ్యమును గూర్చి గాని, గుణమును గూర్చిగాని చెప్పలేము. దిన పత్రికలకు అనుబంధములుగ 'ఉగాది సంచికలు' వెలువడుట అనునది ఆంధ్రపత్రిక నెలకొల్పిన యింకొక సముదాచా రము, నాటి నుండియు ఉగాది సంచికలు ఆంధ్రుల సంస్కృతికిని, వైదేశిక విషయవ్యాప్తికిని, నానా విధో ద్యమముల యభ్యుదయమునకును, శాస్త్ర క థాచర్చలకును, ప్రతిబింబములగుచు వచ్చుచున్నవి. దిన పత్రిక లైన యీ రూపాంతరములన్నియు మన దేశమును, జాతీయు పొందు చున్న పరిణామమునకును, ప్రగతికిని రత్న దర్పణములు. వంగ, మహారాష్ట్రములయందువలె గాక, ఆంధ్రావ నిలో నవయుగ నిర్మాణము, సాంఘిక వాఙ్మయ రంగ ములయందు ప్రచలితమై, మితవాద రాజకీయదళను దాటి, జాతీయ రాజకీయదశలో అడుగిడుచున్న బలీయ మైన శుభముహూర్త మది. కార్యక్షేత్రమును గాంధీ మహాత్ముడు పదునుగ సేద్యయోగ్యముగ చేయుచున్నాడు. ఆ జాతీయ రాజకీయ ప్రాతస్సవనమునకు ఆంధ్రులలో యాజమాన్యమును వహించిన పంతులుగారు 1920 లో సహాయ నిరాకరణోద్యమములోనికి దుమికిరి. విరోద ముగ పత్రికల మూలముననే గాక, ప్రత్యక్షముగ సంచా రముల మూలమున గూడ, దేశమున నాలుగు చెరగుల యందు ప్రచారము సాగించి మన జాతిని వీరు జాగరిత మొనర్చిరి. నాగేశ్వర రావుగా రనగా, ఆ దినాలలో ఆంధ్ర రాష్ట్రీయ మహా సభాధ్యక్షతను, పండ్రెండు సంవత్సర ములు అఖిల భారత కాంగ్రెసు కార్యవర్గ సభ్యత్వమును, దక్షతతో, దీక్షతో నిర్వహించిన ధీశాలియన్నమాట. 1919 లో గుంటూరునందు ప్రత్యేకాంధ్రమహాసభయని యొకటి జరిగినది. దానికి వీరు అధ్యక్షులు. అట్లే రాష్ట్రీయ గ్రంథాలయ సంబంధములై నవియు, ప్రాక్ గాంధేయ హరిజనోద్యమ సంబంధులై నవియు, తదితరములై నవియు నగు చెక్కు మహాసభలను వీరు అధ్యక్షించిరి. ప్రతి
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/753
స్వరూపం