Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యాత్మ C షరూకిన్ లేక సారగాన్ అను నాతడు. ఈ రాజు క్రీ. పూ. 8800 ప్రాంతము వాడని చారిత్రకులు నిర్ణయించినారు. ఈ ప్రభువు ప్రశంస క్రైస్తవమత గ్రంథ (హోలీ బైబిలు) మందలి “ఓల్డు టెస్టమెంటు"లో కలదు. ఈ సారగాన్ రాజు ముఖ్య పట్టణము 'నిప్పారు' నగరము. ఇది యూఫ్రెటీస్ నదికి సమీపమున నొక కాలువ యొడ్డున నెలకొని యుండెను. ఈ ప్రభువు సిరియా, ఏలామే అను రాజ్యము లను జయించి, మధ్యధరాసముద్రము వరకును దండెత్తి పోయెను. ఈతని కాలమున ప్రాచీన ట్యు రానియా ప్రజలును, తరువాత కార్డియాలోని కేతెంచిన కుషైటు, సెమిటిక్ ప్రజలును, ఒండొరులతో కలిసి మెలిసి యుండ జొచ్చిరి. ముఖ్యముగ మతవిషయములలో ఈ సమ్మేళ నము సంపూర్ణముగనుండెను. ఈ కాలమునాటికి ప్రాచీన కాలపు ట్యురానియా భాష వాడుకగా నుండిపోయి నందున, సారగాన్ రాజు ఈ ప్రాచీన భాషయందలి మత గ్రంథముల నన్నిటిని జాగ్రతగ ఇటుకలపై వ్రాయించి సంరక్షించేను. ఈ ప్రాచీన భాష పలువుర కర్థముకాకుం డుటవలన, గ్రంథముల ప్రతులను వ్రాయునప్పుడు మూల మున కర్ణమును కూడ రెండు పంక్తుల నడుమనో, లేక ఇటుకల వెనుక భాగముననో వ్రాయించు నేర్పాటును కూడ ఈతడు 'కావించెను. అట్లే ప్రాచీన కాల్జియాభాష యందలి పదముల నిఘంటువులను, ఈ భాషా వ్యాకరణ మును గూడ సారగాన్ అను రాజు వ్రాయించెను. గ్రంథ ముల ప్రతులను వ్రాయించుటయే కాక, వాటిని సంర జించు విషయమున కూడ ఈతడు చాల కృషి చేసెను. ఆ కాలమున ఎరిక్ అను పట్టణమున నొక ధార్మిక కళా శాల యుండెడిది. ఆ కళాశాల యందలి గ్రంథ భాండార మున పై గ్రంథములు (ఇటుకలు) అన్నియు పొందుపరచ బడెను. ప్రాచీన గ్రంథ సంరక్షణమునందు ఈ రాజునకు మతాధికారులుకూడ చాల సహాయము కావించిరి. ఆ కాల మున ఎరిక్ పట్టణమునకు 'గ్రంథ నిలయనగరమ'ని విఖ్యాతి కలిగెను. అనేక శతాబ్దములు గడచిన వెనుక అస్సీరియా ప్రభువైన అషుర్ బనిపాలుడు ప్రాచీన గ్రంథముల సేక రించుటకై అనేక ప్రాంతములకు తన వ్రాయసకాండ్రను పంపినప్పుడు ఈ ఎరిక్ నగరమునందే అధిక సంఖ్య గ్రంథములు లభించెను. సారగాన్ రాజు సేకరించిన 696 సంగ్రహ ఆంధ్ర పుస్తకములలో జ్యోతిషము, మంత్రతంత్రములు, శకున ములు, వాటి ఫలములు మున్నగు సంళములకు సంబం ధించిన గ్రంథములే కాక, వ్యవసాయమును గూర్చిన ఒక పుస్తకముకూడ వెల్వడేను. మరియొక గ్రంథములో ప పదములు పొందుపరచబడెను. క్రీ. పూ. ఇరువదినాల్గవ శతాబ్దితో ప్రాచీన కాల్షియా దేశపు శోభ నశించెను. క్రీ. పూ. 2900 సంవత్సర ప్రాంత మున ఏలాం దేశపు రాజులు కాల్షియాపై దండెత్తిపోయి, దేశమును కొల్ల గొట్టి, దేవాలయముల నాశనముచేసి, అందలి విగ్రహములను కొన్నిటిని తమ దేశమునకు తీసి కొనిపోయిరి. కొందరు ఏలాం రాజులు కాల్షియా దేశ ములో స్థిరనివాస మేర్పరచుకొని రాజ్యపాలనము సాగించిరి. కాని వీరికి ప్రజారంజకులుగ ప్రసిద్ధిలేదు. ప్రజలయందు అసంతుష్టియు, నిరుత్సాహమును ప్రబలెను. మరికొంతకాలము గడచిన వెనుక, ఈ నిరుత్సాహము మారి విదేశీయ ప్రభువులను తరిమి వేయవలెననెడి గాఢమగు కోర్కె కాల్షియా ప్రజలలో కల్గెను. ఈ స్వాతంత్య్ర సంగ్రామమును నడిపి, కాల్షియా దేశమునకు విముక్తి కల్పించినవారు బాబిలోను ప్రభువులు. ఇరువదప శతాబ్ది ప్రారంభమున పంజాబు రాష్ట్ర మందలి హరప్పా వద్దను, సింధు రాష్ట్రమునందలి మొహెంజోదారో వద్దను భూమిని త్రవ్వించుటవలన, అతి ప్రాచీనమగు నాగరకత యొక్క చిహ్నములు వెలు పడినవి. ఆ నాగరకతను హైందవ సుమేరు నాగరకత యనికూడ కొందరు వర్ణించినారు. కాని సౌలభ్యము కొరకై ఆ నాగరకతకు సింధునదీలోయ నాగరకతయని పేరు పెట్టబడినది. ప్రాచీన కాల్షియా నాగరకతను, సింధు నదీలోయ నాగరకతను పోల్చిచూచినచో, ఈ రెంటి యందును అనేక సామ్యములు కనుగొనుటకును, ప్రపంచ జాతుల చరిత్రయందలి నిగూఢరహస్యము అనేకములు వెలువడుటకును అవకాశము కలదు. కావ్యాత్మ : ఖం.. కవిత్వశరీరము ఆత్మ : యజ్ఞాదికర్మను గురించి చర్చిం చుటకు క ర్మ మీమాంసా గ్రంథములును (పూర్వ మీమాంస), బ్రహ్మను గురించి చర్చించుటకు బ్రహ్మ మీమాంసాగ్రంథ