Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/745

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాల్షియా రాజపదవియు, పురోహిత పదవియు విడివడగా, ఈ పద పులు వేరు వేరు వ్యక్తులచే నిర్వహింపబడ జొచ్చేను రాజులు క్రమముగ బలపడిరి. ట్యురానియాజాతి రాజులు దక్షిణ కాల్షియాయందు మాత్రమే రాజ్యము చేసిరి. వారి నామ ములు మనకు లభింపలేదు. ఈ కాలమునాటి మూడు ప్రసిద్ధ పట్టణముల పేర్లు మనకు తెలియవచ్చినవి. అవి ఎరిధూ, లార్సమ్, ఉగ్ అనునవి. ఇందు వరుసగా ఇయాదేవుడు, సూర్యుడు, చంద్రుడు అను దేవతల గౌరవార్థము ప్రసిద్ధ దేవాలయములు నిర్మింపబడెను. నేటికి సుమారు 7,000 సంవత్సరములకు పూర్వము కార్డియా దేశములోనికి మరియొక నూతన జాతివారు రాజొచ్చిరి, వారు సెమిటక్ తెగకు చెందిన ప్రజలని ఈ అంశమును ఇంతకుముందు సూచింపబడినది. చారిత్రకులందరును అంగీకరించుటలేదు. తురేనియా తెగ వారు కాల్షియాకు వలసవచ్చిన వెనుక చిర కాలమునకు కుషైటులు అను జాతివారు ఆ దేశమునకు వచ్చిరనియు, అటుపిమ్మట సెమిటిక్ జాతులవారు కార్డియాకు ఏతెంచి యుండవచ్చుననియు ఈ వాదమునందలి సారాంశము. సెమిటిక్ జాతులవారు కుపెటులవలె విజ్ఞాననం పన్నులు కారు. కావున సెమిటిక్ ప్రజలు కార్డియాదేశపు విజ్ఞాన మునకు విశేషముగ పెంపు కలుగ జేయ లేదనికూడ పై విద్వాంసులు తెల్పుచున్నారు. కుషైటులు కూడ సెమిటిక్ ప్రజలవలెనే పురాణపురుషుడగు నోహా వంశస్థులు, నోహా రెండవ కుమారుడు హామ్ అనువాతడు. ఇతని కుమారుడు కుష్ అనునతడు. కుషైటులు అనువారు ఈ కుష్ అను నాతని వంశమువారు. వీరు ప్రాచీన కాలమున మధ్య ఆసియా యందలి పీఠభూమిలో నివసించుచుండిరి. కాల క్రమమున ఈ కుషైటులు స్వదేశమును వీడి అనేక ప్రాంత ములకు వలసపోయిరి. వీరిలో కొందరు హిందూదేశము నందు ప్రవేశించి, దక్షిణ భారతభూమిలోనికికూడ చొచ్చు కొని పోయిరి. మరికొందరు ఆఫ్రికాఖండమున కేగి అచ్చట స్థిరనివాస మేర్పరచుకొనిరి. వీరికి ఇథియోపియాజాతి "యన్లు నామము కలిగెను. వేరొక భాగమువారు సిరియా, పాల స్తీనములలో ప్రవేశించిరి. హిందూ దేశమునందు కొంతకాలము వరకును స్థిరనివాసులుగ నున్న కుటు 'వర్గమువారు సముద్రమార్గమున ప్రయాణము చేయుచు సంగ్రహ ఆంధ్ర వచ్చి, పారసీక గుడమునకు ఆనుకొనియున్న కాల్షియా దేశమున వేశించిరి. ఆర్మీనియా, యూదు, అరబ్బీ అను L భాషలను శబ్దతత్వ శాస్త్రజ్ఞులు సెమిటిక్ భాషలని వర్ణించు చున్నారు. పేరున కియ్యవి సెమిటిక్ భాషలని వ్యవహ రింప బడుచున్నను, వీటిని వృద్ధి కావించినవారు కుషైటు జాతివారే. వీరు జ్యోతిష, గణితశాస్త్రములందు చాల కృషి చేసిరి. ఇంతేకాక మతవిషయములలో కూడ వీరి దృక్పథము విశాలమును, విజ్ఞాన సంపన్నములై నవి. 694 కాలము గడచినకొలదియు కార్డియా దేశపు ప్రాచీన ప్రజలును, నూతన ప్రజలును సమ్మేళనము చెందిరి. తత్ఫలి తముగ నొక సమిష్టిజాతియు, సమిష్టి విజ్ఞానమును పెంపొందెను. మత విషయములందు ఈ నూతన జాతివారు ప్రాచీన సంప్రదాయములను పూర్తిగ త్రోసిపుచ్చ లేదు. వారుకూడ తొల్లింటి ప్రజలవలెనే శకునములయందు నమ్మకము కల్గియుండిరి. ప్రకృతి శక్తులలో కొన్ని ఉత్త మములై నవనియు, మరికొన్ని దుష్టములై నవనియు వీరు గుర్తించిరి. ఈ రెండువిధములగు శక్తులకును కూడ నూతన కార్డియా మతమునందు స్థానము లభించెను. కాల్షియాప్రజలకు అనాదినుండియు నక్షత్ర పరిశీలనము నందు చాల ఆసక్తి యుండెను. నక్షత్రములను పరిశీలించిన కొలదియు అయ్యవి ఉత్తమ శక్తులకును, దేవత్వమునకును నిలయములను భావము వారి మనస్సులలో వృద్ధిచెందెను. క్రమక్రమముగ ముద్రశక్తులకంటే, ఉత్తమశక్తులే బల పత్తరములనియు, ఉత్తమళ క్తులు తమకు క్షేమమును కూర్పగలవనియు, కావున నీతినియమములకు అనుగుణ ముగ జీవించుచు, చేసిన పాపముల విషయమున పశ్చా తాపము చెందుచు మెలగుట దైవతములకు ప్రీతికర మును, తమకు క్షేమదాయకమును అని వీరు భావింప సాగిరి. కాల్షియాప్రజల భాషలో నక్షత్రమునకు “ఇలు” అని పేరు. ఈ శబ్దమే కాలక్రమమున మారి అరబ్బీ భాష యందు పరమేశ్వర సూచకమగు "అల్లా" శబ్దముగ మారినదని శాస్త్రజ్ఞులు ఊహించుచున్నారు. కార్డియా మళములో ఎట్టి మార్పులు సంభవించినను, అందు బహు దేవతారాధనము స్థిరముగ నెలకొనెను. కాని జగత్తు నెల్లను రక్షించుచు, దాసినొక త్రాటిపై నడపు వర మేశ్వరు డొక్కడు కలడను భావముకూడ వీరియందు