విజ్ఞానకోశము - ఎ నులు, భూకంపములు, జలప్రళయములు ఈ దుష్టశ క్తుల దుష్టశక్తుల వలననే కల్గుచున్న పని భావించెడివారు. ఈ దుష్టశక్తులను సంతుష్టి పరచుటకై బలులు అర్పించెడివారు. తాయెతులు, రక్షరేకులు మున్నగువాటిని ధరించి ఈ దుష్టశ క్తులను పారద్రోలుటకై యత్నించెడివారు. మాంత్రికులను, భూత వై ద్యులను ఆశ్రయించి, దుష్టశక్తులను ఉచ్చాటనము కావించుటకై ఏర్పాట్లు చేసెడివారు. క్రమక్రమముగ వారి దృక్పథము విశాలము కాజొచ్చెను. ప్రకృతియందు మానవునికి అనుకూలమగు శక్తులు కూడ పెక్కులు కలవను నంశమును వారు గుర్తింపసాగిరి. సూర్యుడును, అగ్నియును తమకు అత్యంత సహాయకారులని వారు గ్రహించిరి. కావున ఈ ప్రకృతిశక్తులను దైవతములుగ భావించి, కాల్షియా ప్రజలు వాటిని స్తుతించుటయు, పూజించుటయు ప్రారంభించిరి. క్రమక్రమముగ కాల్షియా నివాసుల మతములో జిఅనా, ఇయా, మెరిడన్, ఇమ్ అను ఉత్తమదై వతము లావిర్భవించిరి. ఈ దేవతలు నిరంతరమును లోక సంరక్షణము కావించుచుందురు. కావున ఈ దైవతములను పూజించుట తమ విధి యని భావించి, కాల్షియా ప్రజలు అట్లు చేయదొడగిరి. సూర్యుడు, అగ్ని, వరుణుడు మున్నగువారు లోక బాంధ వులే అయినను వారు అప్పుడప్పుడు ప్రజలకు హానికూడ కల్గించుచుందురు. ఇందులకు హేతువేమైయుండునా యని కాల్షియా నివాసులు కొంతకాలము జిజ్ఞాస కావించిరి. మానవుడు అహంకారముతోడను, స్వార్థ బుద్ధితోడను కావించు పాపకార్యములు ఈ యుత్తమ శక్తులకు ఆగ్రహ కారణములగుననియు, దేవతలు కోపించి భూకంపములు, జలప్రళయములు, అగ్నిప్రమాదములు మున్నగు ఆపద లను కల్గింతురనియు ఈ ప్రజలు నిర్ణయించుకొనిరి. కావున మానవుడు సత్ప్రవర్తనము, పాపభీతియు కల్గియుండవలె ననియు, పాపములోనర్చినచో, పశ్చాత్తాపము పొందవలె ననియు, ఈ కార్డియా ప్రజలు తెలిసికొనిరి. పూర్వోక్త మయిన ప్రాచీన కాల్షియా మత గ్రంథమునందు ఇట్టి ఉత్తమభావములును, దైవప్రార్థనాదిక ములును కాన వచ్చును. ప్రాచీనులగు తురేనియా, కాల్షియా ప్రజలను గూర్చిన మరికొన్ని విషయముల నిచట తెలుపవలసియున్నది. వీరు 693 కాల్షియా తమ వ్రాతకోతల కొరకై ఒక స్వతంత్రమగు లిపిని సృష్టించుకొనిరి. వీరికి లోహముల ఉపయోగము చక్కగ తెలియును. వివిధ భవననిర్మాణములయందు వీరు దిట్టలు. ఈ ప్రాచీన ప్రజలు కాలువలను త్రవ్వి, దేశమునకు నీటి వసతులను కల్పించుచుండేడివారు. ఈ జాతివారు పెక్కు దేవాలయములను నిర్మించినట్లు చరిత్రలు తెల్పుచున్నవి. వీరు కాలపరిగణనము కొరకు చాంద్రమానమును వాడు చుండిరి. ఈ ప్రజలు దినమును పండ్రెండు విభాగములు గను, ఒక్కొక్క విభాగమును అరువది అంశములుగను, ఒక్కొక్క అంశమును అరువది సూక్ష్మాంశములుగను భాగించిరి. సౌరచాంద్రమానములకు గల భేదమును తొలగించుటకై వీరు ఆరు సంవత్సరముల కొక పర్యా యము సంవత్సరమునకు ఒక అధికమాసమును చేర్చు చుండిరి. పచ్చజాతులవారు దళాంళములను వాడరు. చీనా వారుకూడ అరువదిని ఒక ప్రమాణసంఖ్యగ భావించుట గమనింపదగిన యంశము. వీరికి 'పండ్రెండు' మిక్కిలి ప్రియమైన విభాజక సంఖ్యయై యున్నది. ఈ తురేనియా జాతివారు నేటికి ఏడువేల సంవత్సర ములకు పై బడిన కాలమునందే కాల్షియా దేశమునకు వచ్చిరనియు, వారు ముఖ్యముగ దక్షిణ కాల్షియాయందు నివసించిరనియు తెల్పుటకు ఆధారములు కలవు. కాల క్రమమున వీరు కువైట్, సెమిటిక్ జాతులవారితో సన్ని హిత సంబంధములు కల్పించుకొని, వారినుండి అనేక నూతనాంశములను గ్రహించి, వైజ్ఞానికముగ పుష్టిని చెందిరి. తురేనియా తెగవారి రాజకీయ జీవితమునుగూర్చి మనకు విశ్వసనీయములగు వంశములు పెక్కులు లభింప లేదు. బహువిధముల ఆ ప్రాచీనయుగమందు కాల్షియా దేశమున చిన్న చిన్న స్వతంత్ర నగర రాజ్యములు (City States) నెలకొని యుండెము. ప్రతి నగరమునందును ఒక దేవాలయము విధిగ నుండెడిది. ఈ పట్టణమునకుగల ప్రాముఖ్యము దేవాలయము మూలముగనే లభించు చుండెడిది. ప్రతి దేవళమునకును అనుబంధముగ మత విజ్ఞానమును బోధించు కళాశాల యొక్కటి ఉండెడిది. ప్రతి దేవస్థానమునకును పరిపాలకుడైన ఒక పురోహితు డుండెడివాడు. ఈతడు దేవునికి పూజారిగను, రాజ్యము నకు పాలకుడుగను ఉండుచు వచ్చెను. కాలక్రమమున
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/744
స్వరూపం