Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - వి నిర్మాణము అభివృద్ధి అయ్యెను. దాని వ్యూహరచనా విధానముగూడ దాని కనుకూలముగనే రూపొందెను. రెండవ ప్రపంచయుద్ధము నాటికి పాశ్చాత్య దేశములలోని పదాలి సైన్యములన్నియు యాంత్రిక (mechanised) మొనర్పబడెను. కాని ఇప్పటికిని రష్యన్, జర్మన్ సైన్య ములలో పాదచారులై పోరాడు కొన్ని పదాతి దళము లున్నవి. రెండవ ప్రపంచయుద్ధము వలన రష్యన్, జర్మన్ పదాతిసై న్యములు ప్రపంచమందలి యే ఇతర సైన్యముల కంటెను బలవత్తరములయినవని రుజువాయెను. సాంకే తీక కార్యకలాపము లాచరించు దళములు గూడ పదాతి సైన్యములో అంతర్భాగములుగా పరిగణింపబడుచున్నవి. వైద్యబృందములు, సిగ్నల్ మెన్, ఇంజనీర్లు, ట్రక్ (లారీ) డ్రయివర్లు, శాపర్స్, మైనర్స్ మొదలయిన సిబ్బంది పదా తులతో పాటు యుద్ధరంగమున పురోభాగమందు ప్రమా దము నెదుర్కొనవలసినవారే. తొమ్మిది లేక పదిమంది - మగటిమిగల యోధులతో నిర్మాణమయ్యెడి 'స్క్వాడ్' పదాతిదళమున ముందుండి, ప్రాణమునైనను తెగించి పోరాడవలసియుండును. శత్రువును పసికట్టి, అతనిపై లంఘించి, పరిమార్చుటయే అతని ఏకైకక ర్తవ్యము. వీరు రైఫిళ్ళు, మరతుపాకులు, ఆటోమాటిక్ యంత్రములు ధరింతురు. పురోగాములయిన ఈ దళమునకు విశ్రాంతి ఉండదు. సమైక్యముతో రహస్యస్థావరములందుండి శత్రు వును పంచించుటయందును, క్లిష్టమయిన ఆయుధములను ఈ దళ సైనికులు ప్రయోగించుటయందును, నేర్పరులు. సోవియట్ రైఫిల్ దళములో బాంక్ విధ్వంసక శతఘ్నులు, విమానవిధ్వంసక శతఘ్నులు ప్రవేశ పెట్టబడుట ప్రత్యేకమయిన విశిష్టత. పురోభాగమున నున్న దళములు అటు శత్రువుపై లంఘించి దెబ్బతీయుటకును, ఇటు ఆత్మరక్షణ చేసికొనుటకును సామర్థ్యము, నేర్పు కలిగి ఉండవలెను. L కడు సాధారణముగ 18-85 సం. మధ్య వయస్సుగల యువ కులను పదాతి సైనికులుగా తర్ఫీదు చేసెదరు. ఆయుధము లను ప్రయోగించుట కవసరమయిన ప్రాథమికళిక్షణము, సైనిక జీవితమునకు అలవాటుపడు విధానమును, బ్రహ్మాండ మయిన శిక్షణ కేంద్రము నొద్ద వీరికి బోధింపబడును. 8 నుండి 14 వారముల పరిమితివరకు తర్ఫీదిచ్చిన తరువాత .691 వీరు డివిజనల్ యూనిట్లలో ప్రవేశ పెట్టబడి, స్క్వాడ్, ప్లాటూన్, రెజిమెంటు, డివిజన్ అను శ్రేణులవరుస క్రమ L ములో అవసరమైన సమగ్రశిక్షణము, వ్యూహవిధానము బోధింపబడును. వీటిలో సమగ్రమయిన శిక్షణము ఇచ్చిన వెనుక ఆర్టిలరీ, టాంక్, విమానయుద్ధములలో అవసర మయిన శిక్షణ నిచ్చెదరు. అనంతరము సైనిక విన్యాసము లలో పాల్గొనుటకు వీరిని సిద్ధపరచెదరు. దీని మూలముగా పదాతి సై నీకుడు సైనికతత్వమును అలవరచుకొన గలు గును. సరి అయిన స్థానమునకు సరి అయిన వ్యక్తి ని ఎన్నుకొని అతనికి సంపూర్ణమైన శిక్షణ యిచ్చుటయందు సైనిక నాయకులు సర్వదా తమ శక్తి యుక్తులను కేంద్రీక రింతురు. ఎన్ని కొనబడు వ్యక్తికి పోరాటమందు అభిరుచి కలదా లేదా యనునది ప్రధాన విషయము. భూసైన్యము లన్నిటిలోను శత్రువుతో వాహాబాహి పెనగి పోరాడుటయు, అతనిని పరాజితుని చేయుటయు పదాతుల ప్రాథమిక ధర్మముగ పరిగణింపబడుచున్నది. ఇందులకై పదాతి సైనికునికి అత్యున్నతమయిన నైతిక బలము, గుండెదిటవు అత్యవసరము. కాల్దియా : ప్ర. రా. సు. ఆధునిక యుగమందు మెసొపొటేమియా యను నామము గల భూభాగములో ప్రాచీనకాలమున డాలి లోనియా, అస్సీరియా అను రెండు రాష్ట్రములు నెలకొని యుండెను. ఇందలి మొదటి రాష్ట్రమునందు జగద్విఖ్యాతి గాంచిన బాబిలోన్ నగరము వెలసిన కారణమున ఈ ప్రాంతమునకు బాబిలోనియా దేశమను పేరు కలిగెను. బాబిలోన్ నగరము క్రీస్తునకు 2,000 సంవత్సరములకు పూర్వము 'సెమిటిక్' జాతికి చెందిన 'సుమూ ఆబూ' వంశమువారు పరిపాలన కావించుచున్నప్పుడు విఖ్యాతికి వచ్చెను. మనము పేరోనుచున్న దేశమునకు బాబిలోనియా అను నామముగూడ ఇంచుమించు ఆదే కాలమున కలి యుండవచ్చును. బాబిలోనియా దేశమునకు "కాల్షియా' అను ప్రాచీన నామముకూడ ఉండెను. బాబిలోన్ నగరము స్థాపింపబడుటకు పూర్వము ఈ పేరు సర్వసాధారణముగ వాడుకలో నుండియుండవచ్చును. కాల్షియా రాష్ట్రము యొక్క దక్షిణ ప్రాంతమునకు సుమేరు రాష్ట్రమనియు,