విజ్ఞానకోశము . ౨
కాల్పలము II
మయిన కారణములుగా గుర్తింపబడినవి. నెపోలియన్ విదేశ దండయాత్రలు ప్రారంభించిన మొదటి 15 సంవత్సరములలో రష్యన్ సైన్యములు తప్ప ఇతర శత్రుసైన్యములు అతని పదాతి దళములను నిర్జించి గెలువలేకుండెను. నెపోలియన్ సైనిక నిర్మాణ విధానము, అతని ఆయుధముల పాటవము,వ్యూహములు ఇతర దేశములను పోలినవే. అతని సైనిక బలముల సంఖ్య గూడ శత్రువుల కంటె తక్కువే. కాని అతని సైనిక నాయకత్వము అన్య దేశముల కంటె మిన్నగా నుండెను. అతని సైన్యములలో నగర వాసులు, విశేషించి గ్రామీణులయిన రయితు యువకులు ఉండెడివారు. ఫ్రెంచి విప్లవములో వారు నిర్వ
హించిన వీరోచితమయిన పాత్రము నుండి ఉత్తేజమును పొందెడివారు. వారి విజయములకు ఈ రెండే ప్రధాన కారణములు.
పదాతి సైనికుడు ప్రాచీన కాలమందు గద చేతను, ధనుర్బాణముల చేతను, కత్తులు, కటారుల చేతను, చేతికి అందిన రకరకములయిన ఆయుధముల చేతను పోరాడెడివాడు. అతడు పర్వతముల పైనను, మైదానములమీదను, ఎడారుల యందును, అరణ్యములలోను, చిత్తడి ప్రదేశముల యందును, సముద్రతీర ప్రాంతములందును పోరాడ గల్గెను. భారతదేశము, ఈజిప్టు, అస్సిరియా మొదలయిన ప్రాచీన దేశములలో అనాది జాతులకు చెందిన పలు తెగల వారు పదాతి దళములుగా ఏర్పడి పరస్పరముగ ధను ర్బాణముల తోడను, కంచుఖడ్గముల తోడను యుద్ధములు సల్పిరి. ఈ యుద్ధములలో పదాతి సైనికులు ఒకప్పుడు రక్షణ స్థితియందును, మరొకప్పుడు శత్రువులపై లంఘించు హెచ్చుస్థితి యందును ఉండెడివారు. ఈ పదాతులు స్వల్ప సంఖ్యాకమయిన ముకాల నుండి బ్రహ్మాండమయిన సైనిక నివహముల వరకు అభివృద్ధినొందిరి. ఆ కాలమందు సైనిక వర్గము లన్నింటి యందును పదాతి గుండెకాయవంటివాడు. శత్రు సైన్యములోని గుఱ్ఱపు దళమును ఎదుర్కొనుట యందు సైనికుడు భారము నెక్కువగా మోసెడివాడు.
ఈజిప్టు, అస్సిరియా దేశముల పదాతులనుండి వర్షియనులు యుద్ధ విద్య నభ్యసించిరి. పర్వత, సముద్ర యుద్ధములందు గ్రీకులు ఆరితేరిన దిట్టలు. వీరు సహజమయిన పదాతులని ప్రతీతి కలదు. ఆరు శతాబ్దముల కాలమువరకు రోమను పదాతి సేనలు ఐరోపాఖండ మంతటిలో మిన్నగా నుండెను. ప్రథమమున పౌరసైనికుడుగా నున్న రోమక పదాతి, కాలక్రమేణ యుద్ధమే తన యేకైక వృత్తి కలవాడుగా మారి, అనంతరము కై జీతగాడుగను (mercenary), అనాగరికమైన కిరాత సైనికుడుగను పరిణామము చెందెను. ఎడతెగని యుద్ధానుభవముల వలన రోమనులు బలవత్తరమయిన సైనికవీరులుగా చాలకాలము వరకు వాసికెక్కిరి. గ్రీకు, రోమక పదాతిసైన్యములు, సైనిక నాయక వర్గములు, అనాదివే అయినను, కొన్ని కొన్ని లక్షణములలో ఒకరిని మించి మరియొకరు ప్రసిద్ధికెక్కిరి. సీజరు పరిపాలన నాటికి, రోమక పదాతిభటుల శక్తి పాటవములు అత్యున్నత శిఖరములను స్పృశించెను. దీర్ఘకాలికమైన దండయాత్ర లందును, దుర్గముల యొక్క రాజమార్గముల యొక్క నిర్మాణమందును, తక్కిన ఐరోపా పదాతినైనికులకంటే రోమక పదాతులు అధిక శ్రమను, సహనమును, శక్తి యుక్తులను ప్రదర్శించేడి వారు.
ఇంగ్లండు దేశమందలి సైనికవర్గములు చాలకాలము వరకు పురాతన పదాతి సంప్రదాయములనే పోషించుచు, ఎప్పటికప్పుడు అవసరములయిన ఆయుధములను ప్రవేశ పెట్టుచుండెను. కాని మధ్యయుగమునాటి జమీందారీ (feudal) వ్యవస్థ అంతరింపగనే, బానిసలు రైతులుగ స్వతంత్రమును సంపాదించుకొనిరి. ఈ పరిణామదశలో శక్తి మంతమగు పదాతి సైన్యములు ఇంగ్లండునందు అవతరింప నారంభించెను. స్వతంత్రులయిన బ్రిటిష్ ప్రజలు ఐచ్ఛికముగ పై నికవిద్య నభ్యసించుట తమ విధ్యుక్తధర్మముగ పరిగణించిరి. 14 వ శతాబ్ది ప్రారంభదశలో బ్రిటిష్ పదాతి సైనికుడు స్వతంత్రుడై, పార్లమెంటు శాసనము ద్వారా అతని జీవనభృతికి స్థైర్య మేర్పరచుకొన గలిగెను.1346 లో జరిగిన 'కేసీ' యుద్ధములో విలు కాండ్రయిన బ్రిటిష్ పదాతిసైనికులు ఫ్రెంచి ఆశ్వికదళమును ఓడింపగల్గెను. ఆశ్వికదళముల ప్రాభవము ఈ యుద్ధముతో పతనముకా నారంభించెనని కొందరు చరిత్రకారులు వ్రాసినను, అంతమాత్రముననే ఆశ్వికదళముల ప్రాముఖ్యము అంతరింపలేదని తరువాతి చారిత్రక సంఘటనల వలన స్పష్టమయినది. B