Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/739

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాల్బలము . 11 గ్రీసు, జర్మనీ దేశములందువలెను, నేటి ఆఫ్ఘనిస్థాన నుందువలెను, పై జెప్పిన సైనికులు గ్రామములు వారీగా సై న్యములలో చేర్చుకొనబడి, శిక్షణగరపబడి యుందురని ప్రొఫెసర్ రాప్సన్ అనునతడు తెలుపుచున్నాడు. పై నిక శిక్షణమే వృత్తిగాగలవారు సైన్యములో అత్యధిక ముగా నున్నను, కొన్ని ప్రత్యేక పరిస్థితులయందు ఇతర వర్ణములవారు గూడ సై న్యమందు చేర్చుకొనబడెడివారు. ఈ వర్గీకరణ విధానము పదాతిదళములందే కాక, అశ్విక దళములయందు గూడ ఆనాడు ఆచరణయందుండెను. ఆనువంశికముగా వచ్చు స్థాయీ సైన్యముల విలువయు, ప్రభువులందు వారికిగల భక్తి విశ్వాసములును ఆకాలమున బాగుగ గుర్తింపబడేను. యుద్ధరంగమున ప్రత్యక్ష సైనిక చర్యలకు వలయు శిక్షణము పదాతులకు ఇయ్యబడెడిది. సైనిక కందకములనుండియు, నిమ్నోన్నత ప్రాంతముల నుండియు, పర్వతశ్రేణులనుండియు, ప్రత్యక్ష పరోడు. యుద్ధప్రక్రియలందును, ఎట్టివాతావరణ పరిసరప్రదేశము అందయినను అహోరాత్రములు పోరాటమును సమర్థ వంతముగ సాగించుటకు కఠోరమయిన శిక్షణ గరపబడెను. “నీతిప్రకాశిక” అను గ్రంథముందు ఈ సైనికుల విధు అన్నియు పేర్కొనబడినవి. క్లిష్టమయిన సైనిక శిబిర నిర్మాణముగావించి, గుడారములు వేయుట, జీకఐ తె ములు లేని వెట్టిచాకిరి చేయుట, సై నికోద్యోగములలో ప్రవేశించి పనిచేయు కార్మికుల యొక్క కార్యకలాపములను తనిఖీచేయుట, ధనాగార, ఆయుధాగారములను, ఇతర వస్తు వాహనములను పరిరక్షించుట, సైనిక వ్యూహ రచన యందు వేర్వేరు దళములను మోహరించుటయందు సహాయపడుట ఈ మొదలయిన విధులు సై నికు లాచ రింపవలెనని, నిర్దేశింపబడెను. 'శుక్రనీతి', కామందక నీతిసారము' అను గ్రంథములలో శత్రుపడమునకు భయ భ్రాంతులు రేకెత్తించు ఉద్దేశ్యముతో స్వసైన్యముల సంఖ్యాబలము సాధ్యమయినంత ఎక్కువగా పెంచబడెడి దని వివరింపబడినది. పదాతి సైనికులు పోరాటముల Share యందు తుపాకులు ప్రయోగించిరని కూడ 'శుక్ర నీతి' - వెల్లడిచేయుచున్నది. పచాతిపై వికుడు తన నిలువెత్తు విల్లును ధరించి శత్రువుతో పోరాడెనని తెలియుచున్నది. అంబులు, కవచ 688 సంగ్రహ ఆంధ్ర ములను సహితము చూసికొనిపోయెడివట. విల్లు నమ్ములే కాక, మూడు మూళ్ళకు తక్కువకానట్టి పలురకముల మేలికత్తులను, బల్లెములను, ఈటెలను గూడ పదాతులు రెండుచేతులందు ధరించి బాహాబాహీ, ముష్టాముష్టి యుద్ధములలో శత్రువులపై బలమైన దెబ్బ తీసెడివారట. సుశిక్షితులై, అధిక సంఖ్యాకులు గనున్న పదాతిపైన్యము లకే ఎల్లపుడును విజయము తధ్యముగ సిద్ధించెడిదని అగ్ని పురాణము స్పష్టము చేయుచున్నది. చతురంగబలములలో పదాతిసైన్యము 'స్వాగమ' అను సాంకేతిక నామముతో పిలువబడేడిదనియు, తక్కిన మూడు అంగములు అన్యాగమ' నామముతో పిలువ బడెడివనియు 'శుక్రనీతి' విదితము చేయుచున్నది. చతు రంగ బలములు సమీకరింపబడిన యుద్ధరంగములు పెద్ద రాతిబండలతో, వృక్షములతో నిండియుండవలెననిగూడ ఇందు నిర్దేశింపబడియున్నది. కాల భారత యుద్ధమందును, గుప్తరాజులనాటి యుద్ధము లందును, రాజపుత్రులు, మరాటులు, మొగలుల మందును, చతురంగబలములలో పదాతి సైన్యముల కత్యంత ప్రాధాన్యమీయబడినది. సజాతుల నిర్మాణ మందును, వ్యూహరచనయందును, యుద్ధ కౌశలమందును, వ్యక్తిగతమయిన శౌర్య పరాక్రమములను ప్రదర్శించుట యందును, భారతీయులు అసమానమయిన ప్రతిభను ఆర్జించినట్లు చారిత్రక నిదర్శనములు వెక్కులు కలవు. బ్రిటిష్ ప్రభుత్వముపై భారతదేశమునందలి స్వతంత్ర రాజులు, వారి సైన్యములు 1857 లో సాగించిన ప్రథమ స్వాతంత్ర్య సమరములో పదాతిదళములు ప్రశంసా పాత్రముగ పోరాడినట్లు చరిత్ర చాటుచున్నది. ఐరోపా ఖండమందు గ్రీసు, రోము, ఫ్రాన్సు, రష్యా మొదలయిన దేశములు పదాతియుద్ధముల యందు అందె వేసిన చేతులు. ప్రాచీన రోమను సైనిక నివహములు పన్నిన వ్యూహములు, ఎత్తుగడలు, చాతుర్యము గ్రీసుకు భిన్నమయినవి కావు. శత్రురాజ్యముల యొక్క సైనిక నాయకత్వమునకు రోమక రాజ్యము తీసిపోయినను, రోమక సైన్యములు పెక్కు విజయములు సాధింపగల్గెను. ఈ విజయములకు సైనిక, సాంకేతిక పాటవమొక్కటే "కాక, సాంఘిక చైతన్యము, సంమైక్యత గూడ బలీయ