విజ్ఞానకోశము -౨ పెద్ద హాలోచార్జి (Hollow charge) ఆయుధములున్నవి. వీటికి లోపలికి చొచ్చుకొనిపోవు శక్తిగల మొనలుండును. కాల్బల పటాలమునందు సిపాయిలందరు కలిసి కాల్పులు చేసినచో, ఒక గంటలో శత్రువులపై ఒక టన్ను సీసపు గుండ్లను కురిపింపగలరు. కమాండ్: 1000 మంది సిపాయిలు గల కాల్బల పటా లము లెఫ్టినెంట్ కల్నల్ హోదాగల ఒక సైనికోద్యోగి స్వాధీనములో నుండును. ఇతని క్రింద 16 మంది ఆఫీసరులు కలరు. వారిలో 5 మంది మేజర్లు, 7 మంది కెప్టెనులు, శేషించినవారు లెప్టినెంటులు. లెఫ్టినెంట్ కల్నలను, అతని క్రింది ఆఫీసరులును నేతలుగను, తర్ఫీదు నొసంగు వారు గను వర్తించుటయే గాక, వారు ఇతర విధులను గూడ నిర్వహింపవలసియున్నారు. ఉదా: వారు సమర్థులగు వకీళ్లుగను, ప్రాసెక్యూటర్లుగను, న్యాయాధిపతులుగను పనిచేయవలసియున్నారు. సైనిక న్యాయస్థానము (Court Martial) నందలి సభ్యులుగా కఠినమైన దండనములను విధించు శక్తిని వారు కలిగియుండవలెను. వారు గొప్ప గణకులుగా (accountants), జమాఖర్చు లెక్కలను విమ ర్శించు ఆడిటర్లుగా (auditors), కార్యనిర్వాహకులుగా (managers) నుండవలసియున్నారు. అనేక లక్షల మూల ధనమును సంబాళింపవలసియుండుట వలన వారు పైన వివరింపబడిన అర్హతలు కలిగియుండవలెను. ఇంతేగాక, వారు సమర్థులైన మెకానిక్స్ ను, డ్రైవర్లుగను, టెక్నీషి యన్లుగను వ్యవహరించుట అవసరము. కాల్బలము – II : - ఎస్. ఎం. ఎస్. ప్రాచీన కాలము నుండియు - మధ్యయుగమును విడిచి పుచ్చి కాల్బలము శక్తిమంతమయిన ఏకైక యుద్ధాంగ ముగ పరిగణింపబడెను. కాల్బలముల పుట్టుకకు, ఉనికికి, అభివృద్ధికినిగల హేతువులను తెలిసికొనవలెనన్నచో, వివిధ దేశముల యొక్క సామాజిక విధానములను, వేర్వేరు దశలలో వాటి పరిణామములను అవగాహనము చేసికొన వలసియున్నది. అనగా, సామాజిక పరిస్థితులు మారునపు డేల్ల, యుద్ధావసరములకు అనువయిన నూతన పరిణామ ములు పై నిక రంగమందునగూడ జరుగుచుండెను. ఇది ఎల్ల దేశములందును, ఎల్ల కాలములందును సంభవించిన వా స్తవ 687 కాల్బలము - 11 విషయము. గ్రీసు, రోము, స్పెయిన్, ఫ్రాన్సువంటి పశ్చిమ దేశముల యొక్కయు, భారత్, చైనా ఇత్యాది ప్రాద్దేశముల యొక్కయు చరిత్రములు ఇందుకు చక్కని తార్కాణములు. అందుచే పురాతన కాలమునుండియు సైనిక నిర్మాణములోను, సమాజములోను జరుగుచు వచ్చిన పరిణామములను, సమాజమునకును సై నీకునికిని నడుమగల సంబంధములను సమన్వయపరచిన నేగాని కాల్బ లము యొక్క సమగ్రమయిన చరిత్ర చిత్రింప బడనేరదు. కాల్బలముల యొక్క జయాపజయములు సామాజిక, సైనిక పరిణామములమీద ఎప్పటికప్పుడు ఆధారపడి యుండును. భారతదేశమున, కాల్బలము ముఖ్యమయిన యుద్ధాం గముగ పూర్వమునుండియు పరిగణనము పొందినది. వేద కాలమునుండియు, ప్రప్రథమమున రథములు, ఏనుగులు యుద్ధములో ఎక్కువగా ఉపయోగింపబడెడివి. ఉత్తమా శ్వములను యుద్ధములలో విరివిగా వాడెడి దేశములతో భారత దేశమునకు సంపర్కము కలుగుటవలన, ఆశ్వీక దళములు అనాది కాలమునుండియు ఇచ్చట మయిన ప్రముఖపాత్ర నిర్వహించెను. పదాతులు చిట్ట చివరశ్రేణికి మాత్రమే చెందెడివారు. కాలము గడచిన కొలదియు, అధిక సంఖ్యాకులయిన కాల్బలముగల సైన్యమే విజయము సాధింపగలదను సిద్ధాంతమునకు అచ రణ పూర్వకముగ బలము చేకూరెను. అధర్వ వేదమందు పదాతి సైన్యముల ప్రసక్తి మెండుగా కలదు. కౌటిలీయ అర్థశాస్త్రములో పదాతి సైన్యములు ఒక ప్రత్యేకో ద్యోగి యొక్క నిర్వహణక్రింద వ్యవహరించినట్లు ఉల్లే జంపబడినది. గ్రీకు రాయబారియైన మెగ స్తనీస్ తన గ్రంథ మందు ఈఅంశమును ధృవపరచెను. "మౌల" అను ఆను వంశీకులగు సైనికులు సైన్యములలో అధిక సంఖ్యయం దుండిరి. వీరుకాక "భృతులు" (కిరాయి సైనికులు), “శ్రేణి" (సామంత ప్రభువులచే సహాయముగా పంపబడు సైనిక బృందములు) "మిత్ర" (మిశ్రరాజ్యములు పంపు సైన్యములు), “అమిత్ర" (శత్రువర్గమునుండి పలాయన మొనర్చు సైనికులు), "అటవి" (అడవిజాతులనుండి ఎన్ను కొనబడు నై నీకులు) మొదలయిన సైనిక నివహములు పదాతులుగా యుద్ధములయందు వ్యవహరించిరి. పురాతన
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/738
స్వరూపం