Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/736

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - - కాలాముఖమును షణ్ముద్రికల నంగీకరించుచున్నది. ఈ షణ్ముద్రలను ధరించిన యెడల పునర్జన్మ లేదని వీరి నమ్మ కము. ఈ క్రింది కర్మలు ఇహపరములను సాధించుటకు ముఖ్యోపాయములని కాలాముఖము తెల్పుచున్నది. 1. కపాలములో (పుట్టెలో) అన్నమును తినుట. 2. దహన వేదిక నుండి భస్మమును గొని శరీరమందు అంతటను ధరించుట, 8. భస్మమును ఆరగించుట. 4. చేతదండమును (లకులము) ధరించుట. 5. మద్యపాత్రమును దగ్గర నుంచుకొనుట. 6. అందు శివుని పూజించుట. అందుకై ఈ క్రిందివస్తువు అవసరము : (1) రుద్రాక్షమాల, (2) అల్లుకొనిన జుట్టు, (8) కపా లము, (4) భస్మము మొదలగునవి. పై వాటిలో కపాలములో భుజించుట మున్నగునవి కొన్ని కాపాలికమునకును, కాలాముఖమునకును సమాన ములుగా కనబడును. దీక్ష యనునది వీరికి మిక్కిలి పవిత్ర కార్యము. దీక్ష తీసికొనినతరువాత వంశ, వర్ణ భేదములు లేవు. దీక్షాగ్రహణమైన వెంటనే ఏ జాతి వ్యక్తి యైనను ఉత్తమ బ్రాహ్మణు డగునని వీరి సిద్ధాంతము, మరియు కపాలదీక్ష గ్రహించిన వెంటనే వ్యక్తి మహర్షి యైపోవునని వీరి సిద్ధాంతము. శ్రీ శంకరులు, శ్రీ రామానుజా చార్యులు తమ గ్రంథములందు కాపాలికము నుల్లేఖించి యున్నారు. శివ, పార్వతులను భైరవచండికా రూపములతో వీరు పూజింతురు. వీరు చండికకిచ్చు రూపము మిక్కిలి భయం కరమైనది. ఆమె కపాలమాలను ధరించును. ఆమెకు నరబలి మిక్కిలి యిష్టము. మద్యమాంసములు ముఖ్య నై వేద్య ద్రవ్యములు. ఇట్టివి ఆశయములుగా కాపాలిక, కాలాముఖముల నేడి రెండు మతములకును ఉన్నవి. కాలా ముఖులు రై వమేతస్థులై మిక్కిలి వామాచారము కలవా రని శ్రీ రామానుజాచార్యులు వారు అభిప్రాయపడినారు. వీరు మహావ్రతులని పిలువబడు చున్నారు. మహావ్రతమనగా ఉత్తమవ్రతము. కపాలాన్న భక్షణము, నరభస్మధారణము - దీని ముఖ్యాంగములు. వీటిని కాపాలికము కూడ అంగీకరించుచున్నది. భవభూతి శైవపురాణములలో 685 కాల్బలము . I తన మాలతీమాధవ నాటకమున నీ “మహావ్రతము"ను వర్ణించినాడు. ప్రస్తుత కాలమున ఈ తెగ విరివిగా నున్నట్లు కానరాదు. కాపాలికులవలెనే వలెనే మతానుయాయులును తము ఎ కార్యములను ప్రచ్ఛన్నముగా చేయుచుందురు. ముతానుయాయులు ఇన్ని నరఓలు లిచ్చెదమని చండికా దేవికి మ్రొక్కుచుందుకు. తమ మ్రొక్కులు చెల్లించుటకు సాధారణముగా పిల్లలను ఎత్తికొనిపోయి దేవిదగ్గర జరి యిచ్చి, ఆ మాంసమును భక్షించుచుందురు. మొత్తము మీద ఆంధ్రదేశమున ఈ తెగ వరలినట్లు కానరాదు. బెంగాలు, గుజరాతు ప్రాంతములందు ఈ తెగవారు తమ యత్యాచారములను అప్పుడప్పుడు జరుపుచున్నట్లు తెలియుచున్నది. సామాన్య శైవమునందును, వేదములు ఆగమము లతోపాటు సమాన ప్రామాణ్యము కలవి అని వచించునట్టి శైవులే ఆంధ్రదేశమున ఎక్కుడుగా నున్నారు. బ్రాహ్మ ణేతరులలో లింగాయతులున్నను, వారు ఇతర ప్రాంతము లందలివారివలె మతోన్మాదము కలిగియున్నట్లు కాన రాదు, ఆంధ్రులకు శివుడు ఇష్టదైవముగా తోచును. ప్రతి . ఆంధ్రబాలుడును, బాలికయును తన విద్యాభ్యాసము "ఓం నమః శివాయ" అనుదానితో ప్రారంభించును. కాల్బలము - 1 : .. 1 ప్రవేశిక : ఇన్ ఫెంట్రీ (కాల్బలము) అను పదము 'శిశువు' అను అర్థమిచ్చు ఇన్ ఫినిస్ (infinis) అను లాటిను భాషా పదమునుండి నిష్పన్నమైనది. కాని ఈ పదమునకు పొద చారులై యుద్ధ మొనర్చు సైనికులు అను అర్థ మెట్లు సంక్రమించెనో ఎంతమాత్రము తెలియరాదు. మొట్ట మొదట యుద్దమొనర్చినవాడు పదాతి (foot-soldier) యేనని అనవచ్చును. కాని రథము లేక అశ్వము యుద్ధ సాధనముగా కలిగిన కాల్బలము అశ్వదళము (cavalry)న కంటె చాలా అనంతరకాలముననే తద్భిన్నమయిన యుద్ధో పాయముగా గుర్తింపబడినది.. ప్రాముఖ్యము : యుద్ధమనునది వివాదములను పరిష్క

రించుకొను తుదిమార్గముగా నున్నంతకాలము, ఏదియో యొక పక్షమువారు ఆయుధ బలముచే విజయ నిశ్చయ