Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/733

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాలము (భారతీయ సిద్ధాంతానుసారము) అనగా, ఒక పద్మము, 5 మహాఖర్వముల, లీ ఖర్వముల. 5 న్యర్భుదములు, 2 అర్పురములు (ఒక కోటి, 55 లక్షల, 2 52 వేల కోట్లు). 4. ఈ మహాకాలములో మనుపులనువారు రాజ్యము చేయుచుందురు. ఈ మనువులు పదునాలుగురు. స్వాయం భువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవ తుడు, చాకుషుడు, వైవస్వతుడు, సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి, అనునవి వరుసగా మనువులు నామములు. 71 మహాయుగములు ఒక మన్వంతర మనబడును. కృత యుగము ఎన్ని సంవత్సరములో అన్ని సంవత్సరములు సంధి యనబడును. ఇట్టి సంధికాలము ప్రతి మన్వంతరము నకు ముందును, 14 వ మన్వంతరమునకు ముందును, వెనుకను జరుగును. 14 మన్వంతరములు, 15 సంధులు నుచేరి ఒక కల్ప మనబడును. (బ్రహ్మకు ఒక పగలు లేక రాత్రి) మన్వంతరము (432000071)-806720000 మా.సం. ఒక సంధికాలము (కృతయుగ ప్రమాణము) 1728000 మా.సం. 14 మన్వంతరముల కాలము 4204080000 మా.సం. సంధి సంవత్సరములు (15 సం. లు) 25920000 మా.సం. 14 మన్వంతరముల కాలము 15 సంధుల కాలము కలిసి 4820000000 మా.సం (కల్పము) 5. ఇప్పటికి శ్వేత వరాహకల్పములో ఆరు మన్వంతర ములు గడిచినవి. ఇప్పుడు ఏడవదగు వైవస్వత మన్వంత రము నడచుచున్నది. కావున, 8. మన్వంతరములకు గడచిన కాలసంఖ్య (808720000×6) - 1840320000 మా. సం. గత 6 మన్వంతరములలో గత 7 సంధుల కాలము- 12096000 మా.సం. ఏడవదగు వైవస్వతమన్వంతరములో 27 మహాయుగములు 28.వ మహాయుగములో కృత, త్రేత, గతించినవి. ద్వాపరయుగములు మూడును గతించినవి. నాలవదగు కలియుగములో 5030సం. గతించినవి. (క్రీ.శ. 1959-1980). కాబట్టి వైవస్వత మన్వంతరములో గతాబ్దములు. 27 మహాయుగములకు (4820000×27) 118640000 మా, సం. సంగ్రహ ఆంధ్ర 6. బ్రహ్మ తన యొక్క 100 సంవత్సరముల ఆయుస్సులో 50 సంవత్సరములు గతించిన అనంతరము ఈ కల్పాది యందు నిదురనుండి లేచి 17064000 సంవత్సరములు (స్వమానమున ఇంచుమించుగా ఓ విఘడియల కాలము) ధ్యాన యోగనుండుండి తరువాత చరాచర స్వరూప మయిన ప్రపంచమును సృష్టిచేయ నారంభించెను. 7. ఇప్పుడు వర్తమాన వికారినామ సంవత్సర పంచాం గము నందు "అస్య సంవత్సరస్య సృష్ట్యాది గతాబ్దాః 1955885060 అని యున్నది. ఈ సంఖ్య ఎట్లు వచ్చినదో క్రింద రూపబడినది. గతించిన 6 నున్వంతరముల కా గతించిన 7 సంధుల కాలము వైవస్వత మన్వంతరములో గతించిన 27 మహా గతించిన కృతయుగ - 1840820000 12096000 116640000 యుగములు ప్రమాణము గతించిన త్రేతాయుగ 1728000 ప్రమాణము 1298000 గతించిన ద్వాపరయుగ ప్రమాణము 682, గడచుచున్న కలియుగ కాలము هيد మొత్తము బ్రహ్మ తన 51 వ సంవత్స రములో ధ్యాన యోగమునందుండిన కాలమును తీసివేయ వలయును. (474 వందల దివ్యవర్షములు) సృష్ట్యాది గతాబ్దములు 864000 5060 1972949000 JP. No. 17084000 1955885080 మా. సం. 125 కోట్ల, 58 లక్షల, 85 వేల అరువది సంవత్సర ములు, క్రీ. పూ. 3102వ సంవత్సరము ఫిబ్రవరి నెల 20 వ తేదీ రాత్రి 2 గంటల 27 నిమిషముల 30 సెకనుల కాల మప్పుడు కలియుగ ప్రవేశమయినటుల హైందవ గణిత శాస్త్రజ్ఞులు స్ఫుటన మొనర్చి చెప్పియున్నారు.