విజ్ఞానకోశము-
కాలము (భారతీయ సిద్ధాంతానుసారము)
మగుచున్నది. అనగా సామాన్యముగా నోక మానవుడు నాలుగు సెకండ్ల కాలములో ఒకతూరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుచుండును. ఇక నాక్షత్రాహోరాత్ర మనగా ఈనాడొక నక్షత్ర ముదయించి తిరిగి రేపుదయించుటకు పట్టుకాలము. అనగా భూమి తనచుట్టు తాను ఒకసారి తిరుగుటకు పట్టుకాలము. రెండు సూర్యోదయముల మధ్య కాలమునకు సావనాహస్సు అని పేరు. ఈ సావన దినము నాక్షత్ర దినముకంటే కొంచెము అధికముగా నుండును. దానికి కారణము సూర్యునికి నక్షత్రములందు గమన ముండుటయే. ఈపావనహోరాత్ర కాలము నియక పరిమాణము కలదికాదు. దానికి కారణము సూర్యుని
గతికి నియత పరిమాణము లేకపోవుటయే. కావున మధ్య సావనకాలమనునది జ్యోతిష్కులచేత కల్పింపబడినది. మన గడియారములు చూపు కాల మీ మధ్య సావనకాలము. సూర్యచ్ఛాయనుండి గణించి తేల్చిన కాలమునకు స్పష్ట సావనకాలమని పేరు. మధ్య స్పష్టసావనకాలములకు గల
యంతరము నకు ఆంగ్ల ఖగోళ శాస్త్రమందు 'Equation of Time' అని పేరు. అనగా అది కాలభేదమన వచ్చును. ఈ కాలభేదము రెండు కారణములచేతపుట్టును. వాటిలో సూర్యుడు విషువద్వృత్తమందు తిరుగక క్రాంతి వృత్త మందు తిరుగుటచేత, సమానక్రాంతి వృత్తీయభాగములు సమాన కాలములందు ఉదయింపకపోవుట ఒక హేతువు. ఈ కాలభేదము పరమక్రాంతి జన్యమనబడును. ఇక రెండవ
హేతువు సూర్యునికి కాంతివృత్తమందుగూడ నియతగతి లేకపోవుట, ఇందువలన పుట్టిన కాలభేదమును 'చ్యుతి జన్య' మందురు. పరమకాంతియనగా 'Obliquity of the Ecliptic' అనియు, ద్యుతియనగా 'Eccentricity of the Sun's orbit' అనియు నవీన ఖగోళ శాస్త్రమునందలి పరిభాష.
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించు నాటినుండి సంవత్సరము ప్రారంభమగును. సూర్యుడొక రాశినుండి బయలుదేరి మరియొక రాశిలోనికి చేరుకాలము ఒక నెల అవబడును. దీనినే సౌరమాసమందురు. సూర్యుడు మేష రాశి నుండి బయలు దేరి ద్వాదశరాసులలో పరిభ్రమించి తిరిగి యథాస్థానము చేరు కాలము ఒక సంవత్సరమగును, దీనిని పౌరసంవత్సరమందురు. సూర్యుడు తిరుగడు. భూమియే సూర్యునిచుట్టు తిరుగుచుండును. భూమిమీదనున్న మనకు సూర్యుడు తిరుగుచున్నట్లు భ్రమకలుగును. అందుచే వ్యవహారభాషలో సౌకర్యార్థము సూర్యుడు తిరుగుచున్నట్లు వాడెదరు. భూమి సూర్యునిచుట్టు ఒక్క ప్రదక్షిణము చేయుకాలమే సౌరసంవత్సరము. అనగా 365 దినముల 6 గంటల 12 నిమిషముల 30 సెకనులు. ఇది సౌర సంవత్సర కాలపరిమితి. ఈ సంవత్సరమును సాయన సంవత్సరమందురు. సూర్యుడు అశ్వినీ నక్షత్రమునుండి తిరిగి అశ్వినీ నక్షత్రమును చేరుకాలమును నిరయన సంవత్వర మందురు. రెండు విధములైన సంవత్సరములకునుకొద్ది భేదముకలదు. దానికి కారణము విషువద్బిందు చలనమే. విషువద్బిందువు 27,000 సంవత్సరముల కొకసారి నక్షత్ర చక్రమును వెనుకకు తిరిగి వచ్చును. ఈ చలనమునకు భారతీయ సిద్ధాంతములందు ఆయన చలనమని పేరు. ఈ ఆయన చలనము చేతనే నేడు ఋతువులు, ఆయనములు వెనుకకు జరిగినవి అను ప్రవాదము పుట్టినది.
మాసమనునది చంద్రగతిచేత పుట్టినది. చంద్రుడు అశ్వినీ నక్షత్రమునుండి, తిరిగి అశ్విని నక్షత్రము చేరు కాలమునకు నాక్షత్ర మాసమని పేరు. అమావాస్యనుండి, తిరిగి అమావాస్య వరకుగల కాలమునకు చాంద్రమాసమని పేరు.
ఛాంద్ర మాసములకు చైత్రాదుల పేర్లు కలవు. ఈ పేర్లు ఎట్లు ఏర్పడినవి? ఇవి నక్షత్రములనుబట్టి ఏర్పడినవి. అనగా, పూర్ణిమనాడు చంద్రుడు ఏనక్షత్రమందుండునో ఆ నెలకు ఆ నక్షత్రనామము ఇయ్యబడినది. పూర్ణిమనాడు చంద్రుడు చిత్రా నక్షత్రమునందుండును. అది చైత్ర మాసము. పూర్ణిమనాడు చంద్రుడు విశాఖ నక్షత్రమందుండును. కావున అది వైశాఖమాసము. అట్లే ఇతర మాసములకును పేర్లు వచ్చినవి. చాంద్రమాస పరిమితి హెచ్చు తగ్గులుగా నుండును. మధ్యమ మానమున 29 దినముల 12 గంటల 44 నిమిషముల 2.83 సెకనులు ఉండును. ఇట్టి మాసములు పండ్రెండయినచో ఒక చాంద్ర సంవత్సరమగును. చాంద్ర సంవత్సర పరిమితి 354 దినముల 8 గంటల 48 నిమిషముల 34 సెకనులు, అనగా సౌర సంవత్సరముకన్న 10 దినముల 21 నిమిషముల 29.56 సెకనులు చాంద్ర సంవత్సరము తక్కువగా నుండును, అనగా సౌర సంవత్సరము పెద్దది. చాంద్ర