Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/728

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము 2 వివిధ రేఖాంశములను వరుసగా చాటుచుండును. మధ్యా హ్నముకూడ భూమిచుట్టును తూర్పునుండి పడమరకు 24 గంటలలో ఒక వలయమును పూర్తి చేయుచు పయ నించుచుండును. ఒక ప్రదేశమండలి స్థానిక కాలము దానికి పశ్చిమమందుండు మరియొక ప్రదేశములోని స్థానిక కాలముకంటే ముందుగా నడచుచుండును. వాటి రేఖాం 4 శములలో ఒక్కొక్క డిగ్రీని 4 నిమిషముల వంతున ఈ భేదముండును. వేర్వేరు భూతల ప్రదేశములందలి పరిశీలనములను పోల్చవలెనన్నచో, ఆయా ప్రదేశముల యొక్క రేఖాంశ ముల భేదమును కని పెట్టవలెను. రేఖాంశములను నిర్ణ యించుటకై గ్రీనిచ్ వద్ద నుండు యామ్యోత్తర రేఖ 'o' రేఖాంశముగా గ్రహింపబడి, అక్కడనుండి తూర్పు లేక పడమరదిశగా వేర్వేరు ప్రదేశముల యొక్క రేఖాంశ ములు 'o' నుండి 180 వరకు డిగ్రీలలో గ్రహింపబడెను. ఈ రేఖాంశములు ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషముల చొప్పున కాలభేదముగా కూడ తెలుపబడుచుండును. ఈ రేఖాంశ ములను ఈ క్రింది విషయములపై ఆధారపడి అనేక విధములుగా నిర్ణయింపవచ్చును : (1) చంద్రుని ఉచ్చస్థానము (culmination) (2) జ్వాల (flame) లేక రాకెట్ సిగ్నల్స్; (8) క్రోనో మీటరు (నావికా గడియారము), (4) టెలిగ్రాఫ్ లేక రేడియో సిగ్నల్స్. 'టెలిగ్రాఫిక్ సిగ్నల్స్ విధానము 19 వ శతాబ్ది మధ్యమునను, రేడియో సిగ్నల్సు విధానము 1908 లో ను మొదట వాడుకలోనికి వచ్చెను. ఈ పద్ధతులలో ఎ అను ప్రదేశమందుండు స్థానిక కాలము అను వేరొక ప్రదేశ మందలి స్థానిక కాలముతో ఎ నుండి కు మరియు బి నుండి ఎ కు పంపబడు ఎలెక్ట్రిక్ సిగ్నల్సు సహాయమున పోల్చబడును. ఇట్లు ఒకచోటునుండి మరియొక చోటుకు ఎలెక్ట్రిక్ సిగ్నలు పోవుటకు పట్టు కాలవ్యవధి వలన కలుగు లోపము తొలగింపబడును. వివిధ రేఖాంశములపై నుండు వివిధ ప్రదేశము లందలి స్థానిక కాలములు భేదించుచుండును. ఈ భేదము ప్రతి డిగ్రీ రేఖాంశమునకు 4 నిమిషముల చొప్పున ఉండును. రైళ్ళలో అతి వేగముగా ప్రయాణముచేయుట సర్వసామాన్యమైనప్పుడు వివిధ స్టేషనులలోని స్థానిక 677 కాలము (ఖగోళ శాస్త్రానుసారము) Q కాలభేదము మిక్కిలి ప్రతిబంధకమగుచు వచ్చెను. కాని ఒక సెంట్రల్ స్టేషనులోని గాని, ఒక పెద్ద పట్టణములోని గాని స్థానిక కాలమే ఆ రైలుమార్గమున కంతకును వాడుకయం దుండుటచే, ఈ యిబ్బంది తొలగిపోయెను. కొన్ని సందర్భములలో పశ్చిమమునుండి తూర్పునకు ఎక్కువగా వ్యాపించని దేశములో ఆ దేశపు రాజధానీ నగరము యొక్క గాని, ఏదేని యొక ముఖ్యనగరము యొక్కగాని స్థానిక కాలమే దేశమంతట వాడబడు చుండెడిది. ఈ విధముగా గ్రీనిచ్ ని స్థానిక కాలము ఇంగ్లండునండంతటను, పారిస్ లోని స్థానిక కాలము ఫ్రాన్స్నందంతటను వెక్కు సంవత్సరములవరకు వాడ బడెను, అయినను, ఒకదేశమునుండి మరియొక దేశమునకు పోయినపుడు గాని, పశ్చిమమునుండి తూర్పునకు ఎక్కువగా వ్యాపించిన దేశములో ప్రయాణము చేసి నపుడు గాని, కాలమును గూర్చిన చిక్కు. అట్లే యున్నది. ఈ యిబ్బందులను అధిగమించుటకై 1884 లో వాషిం గ్టన్ నగరమం దొక అంతర్జాతీయ సమావేశము జరుపబడి, అందు గ్రీనిచ్ నందలి యామ్యోత్తరరేఖ మొదలుకొని 15 డిగ్రీలు అంతరముండునట్లు 24 ప్రమాణిత రేఖాంశ ములు అంగీకరింపబడెను. ఇట్లేర్పడిన ప్రతి అంతరము లోని స్థానిక కాలము గ్రీనిచ్ నందలి స్థానిక కాలముకంటె పూర్తి గంటలలో (whole hours) మాత్రమే భేదించి యుండును. మరియు భూగోళముమీది ఏ ప్రదేశము యొక్క స్థానిక కాల మైనను, దానికి మిక్కిలి సమీపములో నుండు రేఖాంశముమీద స్థానిక కాలమే వర్తించునని గూడ అంగీకరింపబడెను. ఈ విధముగా భూగోళమంతయు 24 ప్రమాణిక రేఖాంశములు మధ్యగా గల 24 మండల ములుగా విభజింపబడెను. ఆయా రేఖాంశమునకు చెందిన స్థానిక కాలమే ఆ మండలమున కంతకు ప్రమాణిత కాలము (standard time) గా వర్తించును. ఒక మండలము నుండి ప్రక్కనుండు మండలమునకు జరుగునపుడు ఒక గంట వ్యత్యాస మేర్పడుచుండును. ఏ ఒక్క మండలములోని ప్రదేశము యొక్క స్థానికకాలమునకు, ప్రమాణిత కాల మునకును ఒక అర్ధగంటకంటె ఎక్కువ వ్యత్యాసముండదు. ప్రతి మండలమందును ప్రమాణితకాలమును చట్టసమ్మత మొనర్చుటకై పెక్కు దేశములు శాసనములు చేసినవి.