Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్మికులు crates) అభిప్రాయము. గనులు త్రవ్వుట, మత్స్య పరిశ్రమ, వ్యవసాయమువంటివే అని వారంగీకరించిరి. కానీ, హెసజ్య పారశ్రాకు రవాణా సౌకర్యముల రంగములయందు కార్మికులు వినియోగించు శ్రమ ఆర్థి ధముగా లాభకరము కాదని వారి వాదన. ఆర్థిక మూల్య మును నిర్మించుటయందు వ్యావసాయిక రంగమనండు మాత్రమే ప్రకృతి మానవునితో సహకరించుచున్నడని, ఈ కారణమువలన వ్యావసాయక రంగమునందలి శ్రమ మాత్రమే క్రమయని ఫిజియోక్రాట్ల సిద్ధాంతం. ఆడమస్మిత్, డేవిడ్ రీ కార్డో మున్నగు సనాతన వాద మునకు చెందిన శాస్త్రజ్ఞులు, మిగిలిన ఉత్పత్తి సాధన ములతో పోల్చి చూచినచో, ఆర్థికముగా ఒక సరకునకు విలువ ఏర్పడుటకు క్రమయే మూలకారణమని ప్రవ చించిరి. ఏదేని ఒక సరకునకు ఆర్థికముగా విలువ ఏర్పడ వలెననినచో, అది పస్తువు ఉపయోగకరమైనదియై యుండ వలేనను అంశమును వారు నిరాకరించలేదు. జనను ఎంతయో ఉపయోగకరమైన వస్తువులు అంత అల్పమైన మూల్యమును కల్గియుండుటకు కారణమేమని వారి ప్రశ్న. (ఉదాహరణమునకు పుష్కలముగా నాగరిగ సమాజమునకు ఎల్లెడల లభించునీరు.) కావున విలువల నిర్ణయమునకు క్రతి వస్తువు తయారు చేయుటయందు వినియోగింపబడిన శ్రామిక శక్తియే కారణభూతమని సనాతన ఆర్థిక శాస్త్రవేత్తల మతము. కార్ల్ మార్క్సు మరియొక అడుగు ముందుకు వేసెను. మార్క్సుతత్త్వము ననుసరించి పెట్టుబడిదారీ విధానము యొక్క పునాదులు శ్రామికవర్గమును పీడించుటపై నిర్మింపబడి యున్నవి; శ్రామికులు శ్రమించి నిర్మిం చిన అదనపు విలువలు విషణీయందలి వస్తువులవెలలు వెనుక నున్న అత్యధిక లాభములు నొనగగా అవి పారిశ్రామిక వేత్తల జేబులలోనికి పోవుచు, కార్మికులను దారిద్ర్యపు అగాధములోనికి త్రొక్కుచున్నవి. వస్తువుల విలువళ నిర్ణయమునకు సంబంధించిన అనేక ఆర్థిక సిద్ధాంతముల యందు శ్రమకు ఇట్లు మిక్కిలి ప్రధానమగు స్థానము ఒసగబడినది. శ్రామికుల సామర్థ్యము నభివృద్ధిచేయుట ఎట్లు? : అనేక వృత్తులలో శ్రామికుని సామర్థ్యము కండరములపుష్టి, సంగ్రహ ఆంధ్ర నరఘంటం!ము అనగా బలము, ఆరోగ్యముతో నిండి యున్న శరీరమును కల్గియుండుటపై ఆధారపడియున్నది. ఇనుము ఉక్కు యంత్రశాలలలో పనిచేయు కార్మికుల విషయము ఈ అంశమునకు మంచి తార్కాణము. సాకు ర్థ్యము, లోష్ణస్థితి, ఆహారము అనువాన్ని పై కూడ ఆధార

డి ఉంచును. కొంతవరకు అది జార్జికి సంబంధించినదై

యున్నది. సరియైనడుస్తులు, చక్కటి గృహవసతులు కల్గియుండుట శ్రామికుల సామర్థ్యమును పెంపొందింప గలదు. తగినంచకూలి, విశ్రాంతి, ఆశాఖావము, స్వాతం త్ర్యము ఈసందర్భమున పేర్కొనదగిన మరికొన్ని అంశ ములు. యంత్రములకు సంబంధించిన విజ్ఞానము నొసగగల పాఠశాలలు కాని, అట్టి వాతావరణము కాని నేర్పరులైన కార్మికుల యొక్క సమర్థత అభివృద్ధిచేయును. చాకచక్య మ ఓ అనునిని తాను నిర్వహించుకొనగల సమర్థత శ్రామికునియొక్క నీతి, నిజాయితీలపైన కూడ ఆధార వేడి యున్నది. 660 శ్రమవిభజనము పారిశ్రామిక

విప్లవానంతరము ఆర్థిక వ్యవస్థయందు కల్గిన మార్పులు అనేకములు, ముఖ్య ముగా ఉన్పత్తి రంగమునందు శ్రమవిభజనము అధిక మాయెను. ఆధునిక ఆర్థిక సమాజము యొక్క ఉన్నతికి శ్రమవిధజనమే ఎన్నదగిన కారణములలో నొకటి. ఉనాడు బూట్లజత రొకదానిని తయారు చేయుటకు ఒకజోళ్ళ కార్ఖానాయందు కనీసము 80 మంది పని 'వాండ్రు పనిచేయుదురు. ఆదాము భూమిని త్రవ్వు చుండగా, అవ్వ చరఖా త్రిప్పిననాటినుండియు నూనవ కోటిమధ్య శ్రమవిభాగము కలదని ఆర్థికత త్వజ్ఞులు చమ త్కారముగా చెప్పుదురు. కాని ఇది యంత్రముల ప్రాబ ల్యము ఎక్కువగాగల నేటి పారిశ్రామిక వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణమని గమనించవలెను. శ్రమవిభజనము ప్రవేశ పెట్టబడక పూర్వము దినమునకు ఒక పని వాడు 20 సూదు అకుమించి చేయజాలకయుండగా, అట్టి విధానము అమలు లోనికివచ్చినతర్వాత ఒక గుండుసూదుల కార్ఖానాయందు కొద్దిమంది జేరి రోజునకు 12 పౌనులసిన్నులు ఎట్లు చేయగల్గు చున్నదియు ఆడమ్ స్మిత్తు 'ది వెల్త్ ఆఫ్ నేషన్సు' అను తనగ్రంథమునందు వివరముగా వర్ణించెను. శ్రమవిభజనము వలన క్రొత్త యంత్రములను పారిశ్రామిక రంగములోనికి