Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

కార్మికులు

మతి, సాంఘిక సామరస్యముల విషయమునను, యాత్ర విషయమునను, కారెంపూడి పట్టణము ఎంతయు విశిష్టత గడించుకొని యున్నది.

మా. వీ.

కార్మికులు :

“తమ ఇచ్ఛలను సాధించుటకు, ముఖ్యముగా జీవితావసరముల సేకరించుటకు, ప్రతి ప్రాణి కొంతవరకైన శ్రమించక తప్పదు. భూమియందు పాతబడిన బీజము సహితము గాలినిపీల్చి, వెలుతురు ననుభవించుటకు, నేలను చీల్చి బయల్వెడలుటకు ప్రయత్నించును. సముద్రపు శయ్యపై పరుండి ముత్యపుపురుగు తనకు అవసరమైన పుష్టి నొసంగు వస్తువుల నెల్ల వాతావరణమునుండి సంపాదించు కొనును. సాలెపురుగు గూడు నల్లును. నక్క, తోడేలు వేటకు పోవును. మానవుడును ఆహార సముపార్జనకై చేయవలసిన ఈ శ్రమమునుండి తప్పించుకొనజాలడు. నిరంతరము ఎడతెగని కాయకష్టము చేయుట వలననే అతడు తన కోర్కెల నెర వేర్చుకొనగల్గుచున్నాడు. వృక్షములలో నిగూఢము, జంతువులలో స్వాభావికము, మానవులలో ఆలోచనాసమన్వితము - అగు ఈ కృషియే శ్రమము అని పిలువబడు చున్నది"— ఛార్లెసు జిడ్.

కార్మికులన నెవ్వరు : 'శ్రమ' నిర్వచనము : భూమి, శ్రమము, పెట్టుబడి, నిర్మాణము అనబడునవి నాలుగును ఉత్పత్తి సాధనములని ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయము. శ్రమించువారు శ్రామికులు లేక కార్మికులు. కావున ఆర్థికోపయోగకరములైన వస్తువుల సుత్పత్తి చేయుట యందు మానవులు సాగించు కార్యకలాపములన్నియు శ్రమముగనే పరిగణింపబడుచున్నవి. అట్టి కృషి మానసిక మైనది కావచ్చును; కేవలము కండరముల కష్టము కావచ్చును. ధనరూపకమైన ఫలితమును పొందుటకై ఆర్థిక రంగమునందు మానవుడు పడు పొట్లన్నియు శ్రమమనియే ఎన్నదగును. కచ్చేరీలలోని గుమస్తాలు, వైద్యాలయములలోని వైద్యులు, విశ్వవిద్యాలయములలోని అధ్యాపకులు కూడ ఆర్థిక సిద్ధాంతము ననుసరించి శ్రామికులనియే చెప్పవలసియుండును. కాని శ్రమను ఇట్లు నిర్వచించుటయందు ఒక కష్టము గలదు, ఉత్పత్తి సాధనములలో ఒకటి నిర్మాణము. పారిశ్రామిక వేత్తను శ్రామికునిగా లెక్కింప జాలము. ఆతడు పొందునది లాభము ; కార్మికుడు సంపాదించునది కూలి. ఇట్లే మధ్య తరగతి మేధావంతులకు చెందునది వేతనము. ఆర్థిక పరిభాషను విడచి ఎట్టివారిని కార్మికులని వ్యవహరింపమో వెలిసికొనుటయు యుక్తము. భూమి ఖామందుగాని, పెట్టుబడిదారుడు గాని, పారిశ్రామికవేత్త గాని కార్మికుడని ఉదాహరింపబడడు.

తెడ్లను వేయు పడవ శ్రమ బాధాజనకమైనదా? వాస్తవమునకు బాహ్య స్థితిగతుల ప్రాబల్యము వలననే మానవానీక మంతయు శ్రమించి పనిచేయుచున్నది. పిల్లలు బహుమానములను పురస్కరించుకొని పని చేయవచ్చును. ఆర్థికలాభమునో, ఉన్నతినో పొందవలయునను ఆశతోనో, వృత్తిగౌరవము కాంక్షించియో పెద్దలు పనిచేయుదురు. ఆర్థికావసరము లైన సరకులను పెంపొందించుటకుగాను వలసిన శ్రమ యంతటిలోను కొంత బాధ తప్పదు. పని చేయుటయే బాధతో కూడిన విషయమని చెప్పజాలము. ఐనను విలాసమునకై నౌకావిహారమున కేగి పడవనడుపు ఉత్సాహవంతునకు, జీవనోపాధికై నీటిలో తెడ్లను వేయు పడవ వానికి, ప్రకృతి సౌందర్యమును జూచి ఆనందించుటకై ఆల్ప్సు పర్వతముల సధిరోహించు యాత్రికునకు, ఆతని వెనువెంట పోవు 'గైడ్' కు ఒక ముఖ్యమైన భేదము గలదు. తన ఆనందమునకై ఒకడు కాలమును వెళ్ళబుచ్చు చున్నాడు. పర్వతముల నెక్కుట, పడవ నడుపుట, కొందరు వృత్తిగా కల్గియున్నారు. తోటపని చేయుట యందు ఒక వ్యక్తి ఒక సంతోషకారణమైన సంతృప్తిని పొందియుండ వచ్చును, కాని అంగడిలో అమ్ముటకై కూరగాయలు పండించుటయే ఆతని జీవనమైనచో అది అంత సంతోషదాయకమైనదిగా ఆతడు భావించి యుండక పోవచ్చును.

సిద్ధాంతవిశాసము : శ్రమయొక్క విలువను సూచించు ఆర్థిక సిద్ధాంతములు ఫిజియోక్రటిక్ ఆర్థిక తత్త్వజ్ఞుల కాలమునాటినుండి మార్జినల్ యుటిలిటీ వాదమునకు చెందిన తత్త్వవేత్తలనాటి కాలమువరకు వికాసము చెందుచునే యున్నవి.

వ్యవసాయరంగమునకు సంబంధించిన శ్రమ మాత్రమే ఆర్థికోపయోగకరమైన శ్రమయని ఫిజియోక్రాట్ల (Physio-