విజ్ఞానకోశము -౨
కారెంపూడి
పురాతన దేవళములున్నవి. వీటికి నిత్య నైవేద్య ధూప దీపారాధనలు జరుగుచున్నవి. గుడి అర్చకులకు మాన్యము లున్నవి.
గ్రామములో హరిజనులు, మహమ్మదీయులు సైతము హిందువులతోపాటు వీరుల ఉత్సవములలో పాల్గొనుచు పల్నాటివీరుల యెడ తమకుగల గాఢ భక్తి తాత్పర్యములను ప్రకటించుచుందురు. కులమత భేదము లేకుండ అందరు శివ, విష్ణువులకంటె వీరులనే ఎక్కువగా భావించెదరు.
శాసనములు : ఈ దేవాలయముల లోను,మండప స్తంభముల మీదను అనేక శాసనములు కాననగును.
వీరులగుడిలో : (1) కన్నమదాసు మండపమునకు వెనుకనున్న బండమీద అయోధ్యరాజు శాసక మున్నది. అది స్ఫుటముగా కనిపించుటలేదు..
“స్వస్తి శ్రీ మన్మహామండలేశ్వర అయోధ్యపురవరాధీశ్వర...ల సింగు మండలేశ్వరుని సన్నిధికి చెన్న రాయల వారి గుడియెత్తించ... డుకొనిలమస్యంది శకవర్షంబు ౧౨౪౯...క్రోధి సం. కార్తీ... ౧౧గు. చండ ప్రసిద్ద గరుడగంబ" ...
(2) శక 1536 (క్రీ. శ. 1614) న నోక స్తంభమును నిర్మించినట్లు వీరుల మండపమునకు దక్షిణముగా నున్న రాతిమీద శాసన మున్నది.
(3) గుడి యొక్క ముఖమండపము, స్తంభముమీద మండప నిర్మాణమును గూర్చి శక 1255 (క్రీ. శ. 1333) నాటి శాసన మున్నది.
(4) వీరులగుడి ఆవరణములో ఒక రాతిమీద చెక్కబడి యున్న శాసనము చాల ముఖ్యమయినదని చరిత్రకారుల అభిప్రాయము. ఇది గవర్నమెంటు శాసన శాఖవారి 1909 సం. వార్షిక నివేదిక లో 556 వ నంబరు శాసనముగా ఈయబడినది. ఇది శక 1318 (క్రీ. శ. 1396) నాటిది.
శాసనపాఠము :
- చంద్రుడు- -సూర్యుడు
- శంఖము- -చక్రము
- 1. స్వస్తి [II] శక వరుషంబులు ౧౩౧౮ అగు నేం
- 2. టి యువ సం [వ] త్సర ఆషాఢ శు ౧౧ శు
- 3. శ్రీ నల్లాని చక్రవత్తు౯లు ఇచ్చిన
- 4. శాసనము I
- 5. నైదశ౯నే 3 సంత్తి వివాదో సవ్వ౯వాదినా I సమ్మతం సవ్వ౯లో కానా
- 6. ందశ౯సం చక్రవత్తి౯నాం 1 స్వస్తి శ్రీమతు వేదమాగ౯ ప్రతిష్ఠా
- 7. చాయ౯ం చక్రగొల విజయ చూడామణి దుష్ట
- 8. నిగ్రహ నీ (శి) ష్ట ప్రతిపాలక మాయావాది కోళా హళ మం
- 9. త్రవాది భయంక్కర పరమవైదిక సావ్వ౯ భౌమ మర పరవా
- 10. దిగజకేసరి త్రిభువనికుళ సముద్ర విళంబతాళ గత శ్రీ
- 11. ంగా నిర్మహం శరణాగత వజ్రపంజర శ్రీ అహొబల దేవవిభవ విరో
- 12. ధిమానమర౯న తిరువెంగళనాథ దేవ దివ్య శ్రీపాద పద్మారా
- 13. ధులైన శ్రీ నల్లాను గోవిందచక్రవత్తి౯ అయ్యం గారు అఖిలలో
- 14. లోకాల పదునెట్టి నాంటి శ్రీవైష్ణూలకును ఆనతిచ్చి పున్నెంచిన
- 15. శ్రీముఖం బడగుల నీవాలవారు తమకుం గుంక్కుమ వస
- 16. ంత్తంము గల్దని దేవ చక్రవత్తి౯ అయ్యంగారికిని మఱుగువడ విన్నపం
- 17. నేని శ్రీముఖాలు తెచ్చి వసంత్తమాడే మసంగాను పలినా
- 18. ంటివారు వసంత్తం ఆడనీక అడ్డు పెట్టితేను నేము శత్తం
- 19. డ్డము వారిన్ని మా ముందటికి రప్పించ్చి విచారింప్ప
- 20. ంగాను పలినాంటివారు పూవ్వ౯మందు కుంక్కుమ వస
- 21. ంతం బడగుల వార్కిం గలుగం దెలుపుకొని ఆడ
- 22. నిమ్మంట్టేమ ఆ బడుగుల వారు పూవ్వ౯ మంద్దు గలు
- 23. గం దెలుపరయిరి. గాన దేవ చక్రవత్తి౯ అయ్యంగా
- 24. రు యిచ్చిన శ్రీముఖాలు మడుగం బుచ్చికొ
- 25. ని నేము పలినాంటి వార్కి మహాదేవరకుం జెల్లేటి